Tecno Pova 6 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 05 Apr 2024 07:32:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Pova 6 4G https://www.91mobiles.com/telugu/tecno-pova-6-4g-globally-launched-with-108mp-camera/ Fri, 05 Apr 2024 07:32:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=10944 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Tecno గ్లోబల్‌గా Pova 6 4G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ Tecno Pova 6 త్వరలో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్, డైనమిక్-టెక్ డిజైన్ తో వచ్చింది. టెక్నో పోవా 6 లో 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 12జిబి ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి […]

The post Tecno: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Pova 6 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా లాంచైన Tecno Pova 6
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్‌
  • 70W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Tecno గ్లోబల్‌గా Pova 6 4G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ Tecno Pova 6 త్వరలో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్, డైనమిక్-టెక్ డిజైన్ తో వచ్చింది. టెక్నో పోవా 6 లో 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 12జిబి ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Tecno Pova 6 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Pova 6 ధర, కలర్ ఆప్షన్స్

Tecno Pova 6 ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటన వస్తుంది. అలాగే భారతీయ మార్కెట్ లో పోవా 6 ఎప్పుడు లాంచ్ కానుందో కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tecno Pova 6 కామెట్ గ్రీన్, మీటియోరైట్ గ్రే మరియు ఇంటర్‌స్టెల్లార్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Pova 6 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova 6 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2436 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 లో మీడియాటెక్ హీలియో జీ99 అల్టిమేట్ చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా అందించారు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Tecno Pova 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ: Tecno Pova 6 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
  • ఓఎస్: Tecno Pova 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Tecno: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Pova 6 4G first appeared on 91Mobiles Telugu.

]]>