Tecno Pova Neo 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 24 Jul 2023 08:42:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 7000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ తో లాంచ్ అయిన Tecno Pova Neo 3 https://www.91mobiles.com/telugu/tecno-pova-neo-3-launched-price-specs-availability/ Mon, 24 Jul 2023 08:42:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=7296 తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల ఫోన్లను తీసుకొస్తూ యూజర్లలో మంచి పేరు సంపాదించింది టెక్నో సంస్థ. తాజాగా ఈ కంపెనీ పోవా సిరీస్ లో ఒక కొత్త డివైజ్ ని లాంచ్ చేసింది. అదే Tecno Pova Neo 3. టెక్నో సంస్థ అధికార వెబ్ సైట్ లో ఈ డివైజ్ లిస్ట్ అయ్యింది. Tecno Pova Neo 3 యూనిక్ డిజైన్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Pova Neo 3 పూర్తి […]

The post 7000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ తో లాంచ్ అయిన Tecno Pova Neo 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • టెక్నో వెబ్‌సైట్ లో లిస్ట్ అయిన Tecno Pova Neo 3
  • Turbo Mecha డిజైన్ తో వచ్చిన స్మార్ట్ ఫోన్
  • ఇంకా ధరను ప్రకటించని టెక్నో కంపెనీ

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల ఫోన్లను తీసుకొస్తూ యూజర్లలో మంచి పేరు సంపాదించింది టెక్నో సంస్థ. తాజాగా ఈ కంపెనీ పోవా సిరీస్ లో ఒక కొత్త డివైజ్ ని లాంచ్ చేసింది. అదే Tecno Pova Neo 3. టెక్నో సంస్థ అధికార వెబ్ సైట్ లో ఈ డివైజ్ లిస్ట్ అయ్యింది. Tecno Pova Neo 3 యూనిక్ డిజైన్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Pova Neo 3 పూర్తి స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Tecno Pova Neo 3 డిజైన్

Tecno Pova Neo 3 డివైజ్ టర్బో మెకా డిజైన్ తో వచ్చింది. ఈఫోన్ మెకా బ్లాక్, అంబర్ గోల్డ్, హరికేన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. బ్యాక్ సైడ్ నుంచి ఫోన్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే బాటమ్ లో టెక్నో పోవా బ్రాండింగ్ ఉంది.

Tecno Pova Neo 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova Neo 3 లో 6.82-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 1640*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కౌటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Tecno Pova Neo 3 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ: Tecno Pova Neo 3 లో 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Tecno Pova Neo 3 లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Tecno Pova Neo 3 లో 16ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Tecno Pova Neo 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno Pova Neo 3 స్మార్ట్ ఫోన్ ధర

Tecno Pova Neo 3 స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రానున్న రోజుల్లో ధర వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post 7000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ తో లాంచ్ అయిన Tecno Pova Neo 3 first appeared on 91Mobiles Telugu.

]]>
7000mAh బ్యాటరీతో వస్తోన్న Tecno Pova Neo 3; స్పెసిఫికేషన్స్ షేర్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/tecno-pova-neo-3-teased-by-company-key-specs-revealed/ Thu, 13 Jul 2023 17:19:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=7182 చవకైన మరియు మన్నికైన ఫోన్లను తయారు చేస్తోన్న టెక్నో సంస్థ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి మార్కెట్ ని ఏర్పరచుకుంది. నేడు, తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా Tecno Pova Neo 3 డివైజ్ సమాచారాన్ని షేర్ చేసింది. త్వరలోనే ఈ హ్యాండ్సెట్ ని లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. Tecno Pova Neo 3 డివైజ్ స్పెసిఫికేషన్స్ ని కూడా టెక్నో పంచుకుంది. 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో Tecno Pova Neo 3 వస్తోంది. […]

The post 7000mAh బ్యాటరీతో వస్తోన్న Tecno Pova Neo 3; స్పెసిఫికేషన్స్ షేర్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Pova Neo 3
  • గ్లోబల్ గా టీజ్ చేసిన టెక్నో సంస్ఠ
  • 4జీ, 8జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్

చవకైన మరియు మన్నికైన ఫోన్లను తయారు చేస్తోన్న టెక్నో సంస్థ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి మార్కెట్ ని ఏర్పరచుకుంది. నేడు, తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా Tecno Pova Neo 3 డివైజ్ సమాచారాన్ని షేర్ చేసింది. త్వరలోనే ఈ హ్యాండ్సెట్ ని లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. Tecno Pova Neo 3 డివైజ్ స్పెసిఫికేషన్స్ ని కూడా టెక్నో పంచుకుంది. 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో Tecno Pova Neo 3 వస్తోంది. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Pova Neo 3 స్పెసిఫికేషన్స్

  • బ్యాటరీ: Tecno Pova Neo 3 స్మార్ట్ ఫోన్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్ కి ప్రధాన బలం బ్యాటరీయేనని చెప్పాలి. భారీ బ్యాటరీ పట్ల కొనుగోలుదారులు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లో అందించనున్నారు. అయితే బ్యాటరీ కెపాసిటీని కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
  • ప్రాసెసర్: Tecno Pova Neo 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova Neo 3 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తుందని భావిస్తున్నారు.
  • కెమెరా: Tecno Pova Neo 3 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. కెమెరా సెటప్ బ్యాక్ ప్యానెల్ పై టాప్ రైట్ కార్నర్ లో ఉంటుంది. వర్టికల్ గా సెన్సర్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • డిస్ప్లే: Tecno Pova Neo 3 స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే తో రానుంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది. పంచ్ హోల్ స్క్రీన్ కి టాప్ లో కుడివైపున ఉంటుంది. ఇక స్క్రీన్ కి మూడు వైపులా బెజెల్స్ లేవు. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. ఈ ఫోన్ రౌండెడ్ ఎడ్జ్ డిస్ప్లేని కలిగి ఉంది.

Tecno Pova Neo 3 ధర (అంచనా)

Tecno Pova Neo 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రాసెసర్ వివరాలు తెలిసాక, ఈ హ్యాండ్సెట్ 4జీ కనెక్టివిటీతో వస్తోందని క్లారిటీ వచ్చింది. అలాగే ఈ ఫోన్ ధర కూడా తక్కువ బడ్జెట్ లోనే ఉంటుందని అంచనా వేయవచ్చు. అఫీషియల్ స్పెసిఫికేషన్స్ ని బట్టి, Tecno Pova Neo 3 ధర రూ.11,000 నుంచి 13,000 మధ్య ఉంటుందని చెప్పవచ్చు. అయితే, కచ్చితమైన ధర వివరాల కోసం కంపెనీ నుంచి రాబోవు తదుపరి ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

The post 7000mAh బ్యాటరీతో వస్తోన్న Tecno Pova Neo 3; స్పెసిఫికేషన్స్ షేర్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>