Tecno Spark 10 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 26 Apr 2023 07:58:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మీడియాటెక్ హీలియో జీ37 చిప్, 50ఎంపి కెమెరాతో లాంచైన Tecno Spark 10; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/tecno-spark-10-4g-launched-phillipines-price-specs-availability/ Wed, 26 Apr 2023 07:58:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=6043 Tecno Spark 10 Pro, Tecno Spark 10 5G డివైజెస్ ని లాంచ్ చేసిన టెక్నో కంపెనీ, తాజాగా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Tecno Spark 10 4జీ వేరియంట్ ని గ్లోబల్ గా లాంచైంది. Tecno Spark 10 డివైజ్ ఫిలిప్పైన్స్ దేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 50ఎంపి కెమెరా, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ తో వచ్చింది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయిన Tecno Spark 10 ముఖ్యమైన […]

The post మీడియాటెక్ హీలియో జీ37 చిప్, 50ఎంపి కెమెరాతో లాంచైన Tecno Spark 10; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిలిప్పైన్స్ లో లాంచైన Tecno Spark 10 డివైజ్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన డివైజ్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Tecno Spark 10

Tecno Spark 10 Pro, Tecno Spark 10 5G డివైజెస్ ని లాంచ్ చేసిన టెక్నో కంపెనీ, తాజాగా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Tecno Spark 10 4జీ వేరియంట్ ని గ్లోబల్ గా లాంచైంది. Tecno Spark 10 డివైజ్ ఫిలిప్పైన్స్ దేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 50ఎంపి కెమెరా, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ తో వచ్చింది.

ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయిన Tecno Spark 10 ముఖ్యమైన ఫీచర్లతో వచ్చింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. 8ఎంపి ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Tecno Spark 10 డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 10 4G ధర, లభ్యత

Tecno Spark 10 4జీ ధర 90 డాలర్లు (సుమారు రూ.7400) గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. టెక్నో సంస్థ భారత లో ఎప్పుడు ఫోన్ లభిస్తుందో ఇంకా తెలపలేదు.
త్వరలోనే అన్ని ఆసియా, ఆఫ్రికన్ మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం.

Tecno Spark 10 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Tecno Spark 10 4G స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ తో లాంచైంది.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

Tecno Spark 10 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఐఎంజీ పవర్‌వీఆర్ జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వినియోగించారు. ఈ డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది.

ఓఎస్

Tecno Spark 10 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

Tecno Spark 10 4G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాషెస్ అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

Tecno Spark 10 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

కనెక్టివిటీ

Tecno Spark 10 4G లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఇచ్చారు. 4జీ, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, జీపీఎస్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్

Tecno Spark 10 4G డివైజ్ మెటా వైట్, మెటా బ్లూ, మెటా బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ 163.89 ఎంఎం పొడవు, 75.39 ఎంఎం వెడల్పు, 8.40 ఎంఎం మందం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీడియాటెక్ హీలియో జీ37 చిప్, 50ఎంపి కెమెరాతో లాంచైన Tecno Spark 10; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>