Tecno Spark 10C - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 31 Mar 2023 08:24:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 16జిబి ర్యామ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ గ్లోబల్ వెబ్ సైట్ పై కనిపించిన Tecno Spark 10, Spark 10C https://www.91mobiles.com/telugu/tecno-spark-10-spark-10c-smartphones-listed-on-global-website-specs-revealed/ Fri, 31 Mar 2023 08:24:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=5685 టెక్నో సంస్థ గత వారం Tecno Spark 10 5G ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా ఈ సంస్థ స్పార్క్ సిరీస్ లో మరొక రెండు ఫోన్లను తన గ్లోబల్ వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. Tecno Spark 10 మరియు Spark 10C డివైజెస్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లో స్పెసిఫికేషన్స్ తో సహా లిస్ట్ అయ్యాయి. అయితే సేల్ తేదీ, ధర వివరాలు ఇంకా […]

The post 16జిబి ర్యామ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ గ్లోబల్ వెబ్ సైట్ పై కనిపించిన Tecno Spark 10, Spark 10C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కంపెనీ గ్లోబల్ సైట్ లో లిస్ట్ ఐన Tecno Spark 10 మరియు Spark 10C
  • 16జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న రెండు ఫోన్లు
  • ధర, సేల్ వివరాలను ఇంకా వెల్లడించని కంపెనీ

టెక్నో సంస్థ గత వారం Tecno Spark 10 5G ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా ఈ సంస్థ స్పార్క్ సిరీస్ లో మరొక రెండు ఫోన్లను తన గ్లోబల్ వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. Tecno Spark 10 మరియు Spark 10C డివైజెస్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లో స్పెసిఫికేషన్స్ తో సహా లిస్ట్ అయ్యాయి. అయితే సేల్ తేదీ, ధర వివరాలు ఇంకా రివీల్ కాలేదు. సరే, ఓసారి రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 10 మరియు Spark 10C ధర, సేల్ వివరాలు

టెక్నో అధికార వెబ్ సైట్ లో Tecno Spark 10 మరియు Spark 10C ఫోన్ల ధర వివరాలు తెలియలేదు. అలాగే కొనుగోలుకి ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయో తెలపలేదు. ఇంకా భారతీయ మార్కెట్ లాంచ్ గురించి కంపెనీ ఏ సమాచారం ఇవ్వలేదు.

Tecno Spark 10 స్మార్ట్ ఫోన్ మెటా బ్లాక్, మెటా బ్లూ మరియు మెటా వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Tecno Spark 10C డివైజ్ మెటా బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. రెండు ఫోన్లు బాక్సీ డిజైన్ ని కలిగి ఉన్నాయి. దీంతో పాటు, కెమెరా డిజైన్ కూడా రివీల్ అయ్యింది. ఇది చూడటానికి ఐఫోన్ కెమెరా మాడ్యూల్ లాగా ఉంది.

Tecno Spark 10 మరియు Spark 10C పూర్తి స్పెసిఫికేషన్స్

Tecno Spark 10 మరియు Spark 10C ఫోన్లలో దాదాపుగా ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్లలో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. కంపెనీ వెబ్ సైట్ లో ఈ డివైజెస్ యొక్క ప్రాసెసర్ సమాచారం ఇవ్వలేదు. కానీ, ఈ ఫోన్లు 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ అలాగే 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం.

కెమెరా విభాగం విషయానికి వస్తే రెండు ఫోన్లు కూడా వేర్వేరు సెన్సర్స్ ని కలిగి ఉన్నాయి. Tecno Spark 10 డివైజ్ 50ఎంపి ఆస్ట్రా రియర్ కెమెరాను కలిగి ఉంది. మరోవైపు Tecno Spark 10C లో 16ఎంపి రియర్ కెమెరా ఉంది. వీటికి తోడు రెండింట్లో ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. అయితే, ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలపలేదు. రెండు ఫోన్లలో కూడా 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

భద్రత కోసం Tecno Spark 10 మరియు Spark 10C స్మార్ట్ ఫోన్లలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. రెండు హ్యాండ్సెట్స్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్లలో 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 16జిబి ర్యామ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ గ్లోబల్ వెబ్ సైట్ పై కనిపించిన Tecno Spark 10, Spark 10C first appeared on 91Mobiles Telugu.

]]>
4GB ర్యామ్, UniSoC T606 ప్రాసెసర్ తో వస్తోన్న Tecno Spark 10C https://www.91mobiles.com/telugu/tecno-spark-10c-google-play-listing-specifications/ Thu, 23 Feb 2023 12:29:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=5072 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో త్వరలో Tecno Spark 10C స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన ఫోన్లను అందిస్తూ తక్కువ సమయంలోనే టెక్నో కంపెనీ మంచి పేరు సంపాదించింది. అయితే Tecno Spark 10C కి సంబంధించి కంపెనీ నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా Tecno Spark 10C డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో Tecno Spark 10C స్పెసిఫికేషన్స్, […]

The post 4GB ర్యామ్, UniSoC T606 ప్రాసెసర్ తో వస్తోన్న Tecno Spark 10C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Tecno Spark 10C స్మార్ట్ ఫోన్
  • 4జిబి ర్యామ్, UniSoC T606 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో Tecno Spark 10C ఫోన్ లాంచ్ తేదీ, తదితర వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో త్వరలో Tecno Spark 10C స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన ఫోన్లను అందిస్తూ తక్కువ సమయంలోనే టెక్నో కంపెనీ మంచి పేరు సంపాదించింది. అయితే Tecno Spark 10C కి సంబంధించి కంపెనీ నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా Tecno Spark 10C డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో Tecno Spark 10C స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Google Play Console పై కనిపించిన Tecno Spark 10C

Tecno Spark 10C స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. ఈ డివైజ్ Tecno KI5k అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ డివైజ్ 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, హెచ్డీ+ డిస్ప్లే, 320 పీపీఐ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉందని పిక్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

Tecno Spark 10C స్మార్ట్ ఫోన్ లో UniSoC T606 ప్రాసెసర్ వాడినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. 4జిబి ర్యామ్ ఆప్షన్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది. అయితే మిగతా ర్యామ్, మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. Tecno Spark 10C డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచ్ కానుంది.

టెక్నో సంస్థ ఇటీవలె Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ తో లాంచైంది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno POP 7 Pro స్పెసిఫికేషన్స్

Tecno POP 7 Pro లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే ప్యానెల్ 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. Tecno POP 7 Pro లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీపీయూ వాడారు. పోకో సీ50, లావా ఎక్స్3, రెడ్మీ ఏ1 వంటి ఎంట్రీ లెవెల్ ఫోన్లలో హీలియో ఏ22 చిప్సెట్ ని వాడటం జరిగింది. ఇకపోతే Tecno POP 7 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆధారిత హైఓఎస్ 11.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno POP 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. Tecno POP 7 Pro డివైజ్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయిని బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 12ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఒక ఏఐ లెన్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ లో కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఇవ్వడం విశేషం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 4GB ర్యామ్, UniSoC T606 ప్రాసెసర్ తో వస్తోన్న Tecno Spark 10C first appeared on 91Mobiles Telugu.

]]>