Tecno - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 29 Jul 2022 08:42:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన Tecno Spark 9T https://www.91mobiles.com/telugu/tecno-spark-9t-launched-in-india-specs-price/ Fri, 29 Jul 2022 08:42:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=1365 హైలైట్స్: భారత్ లో ఎంట్రీ ఇచ్చిన టెక్నో స్పార్క్ 9టీ మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ఆగస్టు 6 నుంచి మొదలు కానున్న సేల్, ధర రూ.9,299 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ 9టీ ని భారత్ లో లాంచ్ చేసింది. భారత్ లో దీని ధరను రూ.10,000 గా నిర్ణయించారు. ఇటీవలె […]

The post భారత్ లో లాంచ్ అయిన Tecno Spark 9T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో ఎంట్రీ ఇచ్చిన టెక్నో స్పార్క్ 9టీ
  • మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • ఆగస్టు 6 నుంచి మొదలు కానున్న సేల్, ధర రూ.9,299

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ 9టీ ని భారత్ లో లాంచ్ చేసింది. భారత్ లో దీని ధరను రూ.10,000 గా నిర్ణయించారు. ఇటీవలె టెక్నో నుంచి టెక్నో స్పార్క్ 9 స్మార్ట్ ఫోన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక స్పార్క్ 9టీ స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీ, 50ఎంపి రియర్ కెమెరాతో వస్తోంది. షావోమీ, రియల్ మీ ఫోన్లతో ఈ ఫోన్ పోటీపడనుంది. ఇక ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ డ్యూయల్-టెక్చర్ డిజైన్ ని కలిగి ఉంది. మెరుస్తూ ఉండే పై భాగంలో రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇక క్రింద వైపు స్ట్రైప్స్ తో కనిపిస్తూ ఆకర్షణీయంగా ఉంది.

భారత్ లో Tecno Spark 9T ధర, లభ్యత

భారత్ లో టెక్నో స్పార్క్ 9టీ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,299 గా ఉంది. ఇది ఇంట్రడక్టరీ ప్రైస్ అని కంపెనీ చెబుతోంది. అంటే తర్వాత దీని ధర పెరిగే అవకాశముంది. ఇక ఈ ఫోన్ ఆగస్టు 6 నుంచి అమెజాన్ ఇండియా లో సేల్ కి వస్తోంది. ఫీచర్లను బట్టి చూస్తే ఈ ఫోన్ మంచి ధరకే లభిస్తోందని స్పష్టమవుతోంది. తక్కువ ధరలో పర్వాలేదనిపించే ఫీచర్లు కలిగిన ఫోన్ కోసం చూసే వారికి టెక్నో స్పార్క్ 9టీ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Spark 9T స్పెసిఫికేషన్స్

టెక్నో స్పార్క్ 9టీ లో ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో ను అమర్చారు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మెమొరీ ఫ్యూషన్ ఫీచర్ ఉందని, దీని ద్వారా 3జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని పొందవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే మైక్రోఎస్డీ కార్డు సాయంతో స్టోరేజీని 512జిబి వరకు పెంచుకునే అవకాశముంది.

టెక్నో స్పార్క్ 9టీ స్మార్ట్ ఫోన్ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (మిగతా రెండు కెమెరాల రెజుల్యూషన్ ఇంకా తెలియదు) ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక మెయిన్ కెమెరాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్షాన్స్మెంట్స్ తో వస్తోంది. అలాగే ఇందులో పోట్రెయిట్ మోడ్, డెడికేటెడ్ నైట్ మోడ్, ఫుల్ హెచ్డీ స్లో మోషన్ వీడియో క్యాప్ఛర్ ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి సెల్ఫీ కెమెరాను, డ్యూయల్ ఫ్లాష్ తో అందించారు. ఇది స్క్రీన్ ఫ్లాష్ ఫీచర్ అయి ఉండే అవకాశముంది. ఇక ఈ ఫోన్ యొక్క బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. టెక్నో స్పార్క్ 9టీ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post భారత్ లో లాంచ్ అయిన Tecno Spark 9T first appeared on 91Mobiles Telugu.

]]>
తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ కావాలంటే ఈ ఫోన్ పై ఓ కన్నేయండి..!! https://www.91mobiles.com/telugu/tecno-spark-9-with-11-gb-ram-launched-in-india/ Mon, 18 Jul 2022 09:42:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=1037 హైలైట్స్: రూ.9,499 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 9 మీడియాటెక్ జీ37 చిప్సెట్, 13ఎంపి డ్యూయర్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు జులై 23 నుంచి భారత్ లో మొదలు కానున్న టెక్నో స్పార్క్ 9 అమ్మకాలు టెక్నో నుంచి స్పార్క్ సిరీస్ లో వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ 9. భారత్ లో రూ.10 వేల ధరతో 11జిబి ర్యామ్ ని […]

The post తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ కావాలంటే ఈ ఫోన్ పై ఓ కన్నేయండి..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.9,499 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 9
  • మీడియాటెక్ జీ37 చిప్సెట్, 13ఎంపి డ్యూయర్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • జులై 23 నుంచి భారత్ లో మొదలు కానున్న టెక్నో స్పార్క్ 9 అమ్మకాలు

టెక్నో నుంచి స్పార్క్ సిరీస్ లో వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ 9. భారత్ లో రూ.10 వేల ధరతో 11జిబి ర్యామ్ ని అందిస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో టెక్నో స్పార్క్ 9 యొక్క మైక్రో సైట్ ద్వారా ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్, అమ్మకాల వివరాలు తెలుస్తున్నాయి. టెక్నో స్పార్క్ 9 లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, బ్యాక్ ప్యానెల్ పై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 6.6 అంగుళాల 90 హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, 11జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. మరి టెక్నో స్పార్క్ 9 యొక్క ధర, ఇతర ఫీచర్లను గురించి తెలుసుకుందాం రండి.

భారత్ లో Tecno Spark 9 ధర

భారత్ లో టెక్నో స్పార్క్ 9 ధరను రూ. 9,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ స్కై మిర్రర్ మరియు ఇన్ఫినిటీ బ్లాక్ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో లభించనుంది. టెక్నో అధికార వెబ్ సైట్ తో పాటు, అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. జులై 23 నుంచి అమ్మకాలు జరుపుకోనున్న ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భాగం కానుంది.

Tecno Spark 9 స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్
  • 128జిబి స్టోరేజీ, 11జిబి వరకు ర్యామ్
  • 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా, డీటీఎస్ స్పీకర్స్
  • ఆండ్రాయిడ్ 12

టెక్నో స్పార్క్ 9 ఫోన్లో 6.6 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ ద్వారా 11జిబి వరకు ఎక్స్ టెండబుల్ ర్యామ్, 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, హైఓఎస్ యూఐ కస్టమ్ స్కిన్, డీటీఎస్ పవర్డ్ స్పీకర్స్, 3.5ఎంఎం ఆడియో జ్యాక్ వంటి ఫీచర్లు టెక్నో స్పార్క్ 9 ఫోన్లో ఉన్నాయి.

ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని వారికి, అలాగే తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ ఆప్షన్ కోసం చూసే వారికి టెక్నో స్పార్క్ 9 ఫోన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే డిస్ప్లే హెచ్డీ+ కావడం గమనించాల్సిన విషయం. డిస్ప్లే సైజ్ విషయంలో అడ్జస్ట్ అయతే కనుక, స్పార్క్ 9 చక్కటి ఫోన్ అనడంలో సందేహమక్కర్లేదు. ఎందుకంటే ఇందులో 11జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే అవకాశముంది. 128జిబి స్టోరేజీ ఇస్తుండటం వల్లన వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను స్టోరేజీ విషయంలో ఏ టెన్షన్ లేకుండా హాయిగా వాడుకోవచ్చు.

The post తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ కావాలంటే ఈ ఫోన్ పై ఓ కన్నేయండి..!! first appeared on 91Mobiles Telugu.

]]>