Toyota Innova Hycross - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 29 Dec 2022 09:09:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో Toyota Innova Hycross ధర; స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ https://www.91mobiles.com/telugu/toyota-innova-hycross-price-specs-availability/ Thu, 29 Dec 2022 09:08:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=4233 హైలైట్స్ రూ.18.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచైన Toyota Innova Hycross 2 పవర్ ట్రెయిన్ ఆప్షన్స్, 8 వేరియంట్స్ లో లభించనున్న Toyota Innova Hycross 186బీహెచ్పీ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్, 21.1 కేఎంపీఎల్ మైలేజీ, పనోరమిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తదితర ఫీచర్లతో వచ్చిన Toyota Innova Hycross ప్రముఖ కార్ల కంపెనీ టొయోటా తాజాగా Toyota Innova Hycross భారత మార్కెట్ ధరను ప్రకటించింది. కొన్ని వారాల క్రితమే ఈ కారు […]

The post భారత్ లో Toyota Innova Hycross ధర; స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రూ.18.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచైన Toyota Innova Hycross
  • 2 పవర్ ట్రెయిన్ ఆప్షన్స్, 8 వేరియంట్స్ లో లభించనున్న Toyota Innova Hycross
  • 186బీహెచ్పీ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్, 21.1 కేఎంపీఎల్ మైలేజీ, పనోరమిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తదితర ఫీచర్లతో వచ్చిన Toyota Innova Hycross

ప్రముఖ కార్ల కంపెనీ టొయోటా తాజాగా Toyota Innova Hycross భారత మార్కెట్ ధరను ప్రకటించింది. కొన్ని వారాల క్రితమే ఈ కారు భారత్ లో లాంచైంది. Toyota Innova Hycross ఎంపీవీ బేస్ వేరియంట్ ధర రూ.18.30 లక్షల (ఎక్స్-షోరూమ్) తో ప్రారంభమవుతుంది. ఇకపోతే ఫుల్ హైబ్రిడ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.28.97 లక్షల వరకు ఉంటుంది.

Toyota Innova Hycross భారత్ లో నవంబర్ నెలలో లాంచైంది. ఇది భారతదేశపు తొలి హైబ్రిడ్ 7+ సీటింగ్ కెపాసిటీ కల్గిన ఎంపీవీ. ఈ వెహికిల్ 186 బీహెచ్పీ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో వచ్చింది. ఈ కారు 21.1 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Toyota Innova Hycross ధర, లభ్యత

Toyota Innova Hycross కారు భారత్ లో రూ.18.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచైంది. ఇది బేస్ వేరియంట్ అయిన పెట్రోల్ జీ (7-సీటర్) ధర. Toyota Innova Hycross కారు మొత్తం 8 వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో 4 పెట్రోల్ వేరియంట్స్ కాగా, మరొక 4 ఫుల్ హైబ్రిడ్ వేరియంట్స్. అన్ని వేరియంట్లు కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు 7 లేదా 8 సీటింగ్ ఆప్షన్స్ తో వస్తున్నాయి.

Toyota Innova Hycross కారు మొత్తం 7 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: బ్లాకిష్ అగేహ్ గ్లాస్ ఫ్లేక్, సూపర్ వైట్, ప్లాటినమ్ వైట్ పర్ల్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, స్పార్క్లింగ్ బ్లాక్ పర్ల్ క్లిస్టల్ షైన్ మరియు అవాంట్ గ్రేడ్ బ్రాంజ్ మెటాలిక్.

టొయోటా ఇప్పటికే Toyota Innova Hycross యొక్క బుకింగ్స్ ని తీసుకుంటోంది. ఈ కారు ని రూ.50,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Toyota Innova Hycross స్పెసిఫికేషన్స్

Toyota Innova Hycross టొయోటా యొక్క 5 వ తరం స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ అయిన M20A-FXS పై తయారైంది. ఇది 2.0 లీటర్ ఇంజిన్ మరియు ఒక ఎలక్ట్రిక్ మోటర్ ని కల్గి ఉంటుంది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 152బీహెచ్పీ మ్యాక్స్ పవర్ మరియు 187ఎన్ఎం మ్యాక్స్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటర్ తో కలిపి మొత్తం 186 బీహెచ్పీ పవర్ అవుట్ పుట్ ని జనరేట్ చేస్తుంది. ఈ కారు 21.1 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. Toyota Innova Hycross 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని 9.5 సెకన్లలో చేరుకుంటుంది.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, Toyota Innova Hycross లో 10.1-ఇంచ్ సెంట్రల్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, 4.2-ఇంచ్ కలర్డ్ ఎంఐడీ, డ్యాష్-మౌంటెడ్ గేర్ లివర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, చెస్ట్‌నట్ బ్రౌన్ లెదరెట్ అప్‌హోల్‌స్ట్రీ, డ్యాష్ బోర్డ్స్, డోర్ కార్డ్స్ పై సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ఆంబియంట్ లైటింగ్, ఒట్టోమాన్ మోడ్ తో కూడిన పవర్ సెకండ్-రో సీట్స్, డ్యూయల్-జోన్ ఏసీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇన్నోవా కారు పవర్డ్ టెయిల్ గేట్, పనోరమిక్ సన్ రూఫ్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తో వస్తోంది.

Toyota Innova Hycross యొక్క టాప్ ఎండ్ జెడ్ఎక్స్ (ఓ) వేరియంట్ ఏడీఏఎస్ సూట్ (టొయోటా సేఫ్టీ సెన్స్ టెక్నాలజీ) తో వస్తోంది. ఈ సిస్టమ్ లో లేన్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇతర భద్రత ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ తో కూడిన ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఈఎస్‌సీ వంటివి ఉంటాయి. 8 మంది ప్యాసింజర్ల కోసం టొయోటా 3-పాయింట్ సీట్ బెల్ట్స్ ఆఫర్ చేస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో Toyota Innova Hycross ధర; స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>