TRAI - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:52:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio, Airtel ఖాతాలో కొత్త సబ్‌స్క్రైబర్లు; 2.47 మిలియన్ కస్టమర్లను కోల్పోయిన Vodafone Idea https://www.91mobiles.com/telugu/telecom-regulatory-authority-of-india-subscriber-tally-report-airtel-jio-gained-subscribers-vodafone-idea-lost-users/ Mon, 20 Feb 2023 15:53:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=5016 Vodafone Idea సంస్థ యొక్క మార్కెట్ షేర్ దారుణంగా పడిపోయింది. తాజాగా టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన రిపోర్ట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుల ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతోన్న వొడాఫోన్ ఐడియా సంస్థ 2.47 మిలియన్ కస్టమర్లను కోల్పోయి మరింత దిగజారింది. ఇక 5జీ నెట్వర్క్ ని కూడా లాంచ్ చేసేందుకు వీఐ ఎంతో సతమతమవుతోంది. మరోవైపు ఎయిర్టెల్, జియో భారీగా సబ్‌స్క్రైబర్లను పొందాయి. భారతి ఎయిర్టెల్ ఖాతాలో […]

The post Jio, Airtel ఖాతాలో కొత్త సబ్‌స్క్రైబర్లు; 2.47 మిలియన్ కస్టమర్లను కోల్పోయిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 21.11 శాతానికి పడిపోయిన ఒకప్పటి మార్కెట్ లీడర్ వీఐ షేర్
  • ట్రాయ్ తాజా రిపోర్ట్ ప్రకారం, 2022 డిసెంబర్ లో 2.47 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా
  • 1.7 మిలియన్ యూజర్లను పొందిన ఎయిర్టెల్, 1.52 మిలియన్ సబ్‌స్క్రైబర్లను పొందిన జియో

Vodafone Idea సంస్థ యొక్క మార్కెట్ షేర్ దారుణంగా పడిపోయింది. తాజాగా టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన రిపోర్ట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుల ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతోన్న వొడాఫోన్ ఐడియా సంస్థ 2.47 మిలియన్ కస్టమర్లను కోల్పోయి మరింత దిగజారింది. ఇక 5జీ నెట్వర్క్ ని కూడా లాంచ్ చేసేందుకు వీఐ ఎంతో సతమతమవుతోంది.

మరోవైపు ఎయిర్టెల్, జియో భారీగా సబ్‌స్క్రైబర్లను పొందాయి. భారతి ఎయిర్టెల్ ఖాతాలో 1.7 మిలియన్ యూజర్లు చేరగా, ముకేశ్ అంబాని కంపెనీ జియో 1.52 మిలియన్ కస్టమర్లను పొందింది. ఈ గణాంకాలు ట్రాయ్ విడుదల చేసిన 2022 డిసెంబర్ కి సంబంధించినవి.

ఓవరాల్ సబ్‌స్క్రైబర్ కౌంట్ నాలుగు నెలల్లో వరుసగా మూడోసారి దిగజారింది. 2022 నవంబర్ లో ఉన్న 1.143 బిలియన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య, 2022 డిసెంబర్ కి వచ్చేసరికి 1.142 కి చురుకుందని ట్రాయ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో యూజర్లు తగ్గడంతోనే ట్యాలీ లో తగ్గుదల కనిపిస్తోందని ట్రాయ్ తెలిపింది. మరొక వైపు పట్టణ ప్రాంతాల్లో వైర్లెస్ సబ్‌స్క్రిప్షన్స్ 626.3 మిలియన్ నుంచి 627.03 మిలియన్ కి పెరిగింది.

ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ సంస్థలు 37.14 పర్సెంట్ మరియు 32.16 పర్సెంట్ మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నాయి. మరొకవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేర్ 21.11 శాతానికి తగ్గిపోయింది. వైర్‌లైన్ సేవల విషయంలో జియో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

ఫిస్కాల్ థర్డ్ క్వార్టర్ వరకు వీఐ నెట్ లాస్ రూ.7,595.5 కోట్ల నుంచి రూ.7,990 కోట్లకు పెరిగాయి. అత్యధిక ఫైనాన్సింగ్, నిర్వహణ ఖర్చులు వెరసి వొడాఫోన్ ఐడియా కు భారీ నష్టాలను మిగిలాయి.

Vi 5G రోలౌట్ ప్లాన్స్

5జీ ఇకోసిస్టమ్ అభివృద్ధి కోసం, వొడాఫోన్ ఐడియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్మీ లతో జట్టు కట్టింది. ఇతర అగ్ర సంస్థలతో కలిసి తన యూజర్ల కి 5జీ రోలౌట్ ని అందించేందుకు వీఐ అడుగులు వేస్తోంది. ఎల్ అండ్ టీ స్మార్ట్ వరల్డ్ తో కలిసి హెల్త్ కేర్ వంటి ఇండస్ట్రీ యూజ్ కేసెస్ ని వీఐ డెవలప్ చేస్తోంది.

ఒకవైపు నష్టాల్లో కూరుకుపోయినప్పటకీ, మరోవైపు 5జీ సాంకేతికతను అందించేందుకు వొడాఫోన్ ఐడియా తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే వీఐ 5జీ వచ్చేందుకు ఇంకా కొన్నేళ్ళ సమయం పట్టనుందని సమాచారం. ప్రస్తుతం అగ్రపథాన దూసుకెళ్తోన్న ఎయిర్టెల్, జియో సంస్థలకు గట్టిపోటీనిచ్చే స్థాయికి వీఐ చేరుకోగలదా? 5జీ నెట్వర్క్ లాంచ్ అయితే వొడాఫోన్ ఐడియాకి మునుపటి రోజులు వస్తాయని ఆశించవచ్చు. వొడాఫోన్ ఐడియా తిరిగి పుంజుకోవాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Jio, Airtel ఖాతాలో కొత్త సబ్‌స్క్రైబర్లు; 2.47 మిలియన్ కస్టమర్లను కోల్పోయిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>
Reliance Jio, Airtel కి భారీగా పెరిగిన కస్టమర్లు – ట్రాయ్ రిపోర్ట్ https://www.91mobiles.com/telugu/airtel-jio-vodafone-idea-bsnl-subscribers-tally-november-2022-trai-report/ Mon, 30 Jan 2023 14:24:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=4692 దేశంలో టాప్ టెలీకామ్ సంస్థలుగా కొనసాగుతోన్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు దాదాపుగా 25 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్లను పొందారు. ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతోన్న వొడాఫోన్ ఐడియా 18.3 లక్షల మంది కస్టమర్లను కోల్పోయి మరింత దిగజారింది. టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం, రిలయన్స్ జియో సంస్థ 14.26 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లను నవంబర్ నెలలో పొందింది. మరోవైపు భారతి ఎయిర్టెల్ 10.56 లక్షల మంది యూజర్లను పొందింది. […]

The post Reliance Jio, Airtel కి భారీగా పెరిగిన కస్టమర్లు – ట్రాయ్ రిపోర్ట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2022 నవంబర్ లో 25 లక్షల మొబైల్ సబ్‌స్క్రైబర్లను పొందిన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్
  • 18.3 లక్షల కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా సంస్థ
  • తాజాగా జాబితాను వెలువరించిన టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా

దేశంలో టాప్ టెలీకామ్ సంస్థలుగా కొనసాగుతోన్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు దాదాపుగా 25 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్లను పొందారు. ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతోన్న వొడాఫోన్ ఐడియా 18.3 లక్షల మంది కస్టమర్లను కోల్పోయి మరింత దిగజారింది.

టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం, రిలయన్స్ జియో సంస్థ 14.26 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లను నవంబర్ నెలలో పొందింది. మరోవైపు భారతి ఎయిర్టెల్ 10.56 లక్షల మంది యూజర్లను పొందింది.

2022 నవంబర్ మాసం ముగిసే నాటికి జియో మొబైల్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్య 42.28 కోట్లుగా ఉంది. అంతకు ముందు నెలలో 42.13 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. జియోకి ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోయింది.

భారతి ఎయిర్టెల్ సబ్‌స్క్రైబర్ బేస్ పెరగడంతో నవంబర్ నెలలో సదరు కంపెనీ యూజర్ల సంఖ్య 36.60 కోట్లకు పెరిగింది.

ఇప్పటికే ఆర్థిక కష్టాలతో కుదేలైపోయిన వొడాఫోన్ ఐడియా సంస్థ 18.27 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో నవంబర్ లో వొడాఫోన్ ఐడియా యూజర్ బేస్ 24.37 కోట్లకు చేరుకుంది.

ట్రాయ్ డేటా ప్రకారం, 2022 నవంబర్ చివరి నాటికి మొత్తం బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు 82.53 కోట్లకు పెరిగారు. అంటే నెలవారీ వృద్ధి రేటు 0.47 శాతంగా నమోదైంది.

2022 నవంబర్ ముగిసే నాటికి మొత్తం 5 సర్వీస్ ప్రొవైడర్లు కలిసి 98 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

ఈ జాబితాలో రిలయన్స్ జియో (43 కోట్లు), భారతి ఎయిర్టెల్ (23 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.3 కోట్లు) మరియు బీఎస్ఎన్ఎల్ (2.6 కోట్లు) ఉన్నాయి.

2022 నవంబర్ నెల నాటికి, టాప్ 5-వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లుగా రిలయన్స్ జియో (73.8 లక్షలు), భారతి ఎయిర్టెల్ (55.6 లక్షలు), బీఎస్ఎన్ఎల్ (40.2 లక్షలు), ఆట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (21.4 లక్షలు), హ్యాత్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ (11.3 లక్షలు) ఉన్నాయి.

టాప్-5 వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లుగా రిలయన్స్ జియో (42.28 కోట్లు), భారతి ఎయిర్టెల్ (22.5 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.34 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.18 కోట్లు), ఇన్‌టెక్ ఆన్‌లైన్ (2.3 లక్షలు) ఉన్నాయి.

Airtel, Jio సంస్థలు ఇప్పటికే 5G సేవలను లాంచ్ చేశాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5జీ సేవలను విస్తరించే లక్ష్యంతో సదరు సంస్థలు పనిచేస్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ సేవలను దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురాలేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే బీఎస్ఎన్ఎల్ 4జీ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దేశం మొత్తం 4జీని విస్తరించే దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. అలాగే 5జీ సేవలను తీసుకొచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థ టీసీఎస్ తో కలిసి పని చేస్తోంది. టీసీఎస్ సహకారంతో అతి త్వరలో దేశంలో 4జీ ని పూర్తిస్థాయిలో తీసుకురావడంతో పాటు, ఆ వెనువెంటనే 5జీ ని కూడా లాంచ్ చేయబోతోంది. ఇక వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం 4జీ సేవలను అందిస్తోంది. 5జీ నెట్వర్క్ లాంచ్ ఎప్పుడో ఇంకా తెలియదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Reliance Jio, Airtel కి భారీగా పెరిగిన కస్టమర్లు – ట్రాయ్ రిపోర్ట్ first appeared on 91Mobiles Telugu.

]]>