Valentine's Day Offer - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:00:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ‘వాలెంటైన్స్ డే’ ఆఫర్ తీసుకొచ్చిన Jio, Vi https://www.91mobiles.com/telugu/jio-vodafone-idea-valentines-day-offers-valid-till-february-14th/ Mon, 13 Feb 2023 15:00:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4904 వాలెంటైన్స్ డే సందర్భంగా టెలీకామ్ కంపెనీలు తమ యూజర్ల కోసం పలు ఆఫర్లను తీసుకొచ్చాయి. అదనపు చార్జీలు ఏమీ లేకుండానే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు తన సబ్‌స్క్రైబర్ల కోసం వాలెంటైన్స్ డే ఆఫర్ ని ప్రకటించాయి. ఆ వివరాలను తెలుసుకుందాం పదండి. జియో సంస్థ ఈ ఆఫర్లన్నీ రూ.249, రూ.899 మరియు రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే వర్తించేలా ఈ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇక వొడాఫోన్ సంస్థ రూ.199, […]

The post ‘వాలెంటైన్స్ డే’ ఆఫర్ తీసుకొచ్చిన Jio, Vi first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రేమికుల రోజు సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనౌన్స్ చేసిన జియో, వొడాఫోన్
  • రూ.249, రూ.899, రూ.2,999 ప్లాన్స్ పై అదనపు బెనిఫిట్స్ ని అందిస్తోన్న జియో
  • రూ.199 నుంచి రూ.299 మధ్య పలు ప్లాన్స్ పై 2జిబి అదనపు డేటా, రూ.299 పైన ప్లాన్స్ కి 5జిబి డేటా ఆఫర్ చేస్తున్న వీఐ

వాలెంటైన్స్ డే సందర్భంగా టెలీకామ్ కంపెనీలు తమ యూజర్ల కోసం పలు ఆఫర్లను తీసుకొచ్చాయి. అదనపు చార్జీలు ఏమీ లేకుండానే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు తన సబ్‌స్క్రైబర్ల కోసం వాలెంటైన్స్ డే ఆఫర్ ని ప్రకటించాయి. ఆ వివరాలను తెలుసుకుందాం పదండి. జియో సంస్థ ఈ ఆఫర్లన్నీ రూ.249, రూ.899 మరియు రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే వర్తించేలా ఈ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇక వొడాఫోన్ సంస్థ రూ.199, రూ.299 పైన రీచార్జెస్ పై ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది.

రిలయన్స్ జియో దేశంలోనే టాప్ టెలీకామ్ సంస్థగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సంస్థ తన యూజర్ల కోసం జియో ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తోంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా బోలెడన్ని సర్‌ప్రైజెస్ తో జియో తన కస్టమర్ల ముందుకు వచ్చింది. మరి జియో తీసుకొచ్చిన ఆ ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Jio వాలెంటైన్స్ డే ఆఫర్ బెనిఫిట్స్

జియో సంస్థ వాలెంటైన్స్ డే ఆఫర్ క్రింద కస్టమర్లకు 12జిబి 4జి ఉచిత డేటా, ఇక్సిగో పై ఫ్లైట్ బుకింగ్ కోసం రూ.4,500 మరియు అంతకంటే ఎక్కువ లావాదేవీలను నెరిపితే రూ.750 డిస్కౌంట్, ఫెర్న్స్ అండ్ పెటల్స్ లో మినిమమ్ రూ.799 కొనుగోళ్ళపై రూ.150 డిస్కౌంట్, మెక్‌డొనాల్డ్స్ లో రూ.199 కంటే ఎక్కువ బిల్ చేస్తే రూ.105 విలువ గల ఉచిత బర్గర్.. వంటి ప్రయోజనాలను జియో అందిస్తోంది.

ఈ ఆఫర్లన్నీ రూ.249, రూ.899 మరియు రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే వర్తిస్తాయి. ఫిబ్రవరి 10 తర్వాత చేసే రీచార్జ్ లకే ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఆఫర్ కూపన్లు MyJio యాప్ అకౌంట్ లో 72 గంటల్లో క్రెడిట్ అవుతాయి. అలాగే వాటికి 28 రోజుల వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఫిబ్రవరి 14 వరకు ఆఫర్ ప్రయోజనాలను పొందే వీలుంది. ఈలోపు చేసే రీచార్జ్ లకే ఆఫర్ వర్తిస్తుంది.

Vodafone Idea వాలెంటైన్స్ డే ఆఫర్

వొడాఫోన్ ఐడియా కూడా వాలెంటైన్స్ డే ఆఫర్ ని తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. రూ.299 కంటే పైన ప్రీపెయిడ్ ప్లాన్స్ రీచార్జ్ చేసే కస్టమర్లకు 5జిబి ఉచిత డేటా అదనంగా లభిస్తుంది. అలాగే రూ.199 నుంచి రూ.299 మధ్య కొన్ని సెలెక్టివ్ రీచార్జ్ ప్లాన్స్ పై 2జిబి డేటా అదనంగా యూజర్ కి లభిస్తుంది. వీఐ యాప్ ద్వారా ఫిబ్రవరి 14 వరకు జరిపే ప్రీపెయిడ్ రీచార్జ్ లకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.

జియో, వొడాఫోన్ ఐడియా అందిస్తోన్న వాలెంటైన్స్ డే ఆఫర్ వివరాలు తెలుసుకున్నారు కదా? మరోసారి సమాచారాన్ని పూర్తిగా చదివి మీకు తగిన ప్లాన్ ని రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ ప్రయోజనాలను పొందేందుకు ఫిబ్రవరి 14 ఆఖరు తేదీ.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ‘వాలెంటైన్స్ డే’ ఆఫర్ తీసుకొచ్చిన Jio, Vi first appeared on 91Mobiles Telugu.

]]>