Vi - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Oct 2022 08:31:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme https://www.91mobiles.com/telugu/realme-partners-with-jio-airtel-vi-qualcomm-mediatek-5g-india/ Mon, 03 Oct 2022 08:31:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=2704 హైలైట్స్: భారతీయ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో, వీఐ లతో చేతులు కలిపిన Realme కస్టమర్ల కోసం వివిధ రకాల బండిల్ ఆఫర్లు తెస్తున్నట్లు తెలిపిన రియల్మీ సీఈవో 2020 లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన రియల్మీ, అప్పటి నుంచి మొత్తం 23 5జీ ఫోన్లను లాంచ్ చేసిన రియల్మీ అక్టోబర్ 1 న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5జీ సేవలను పీఎం నరేంద్ర మోదీ లాంచ్ చేశారు. ఇప్పటికే […]

The post Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారతీయ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో, వీఐ లతో చేతులు కలిపిన Realme
  • కస్టమర్ల కోసం వివిధ రకాల బండిల్ ఆఫర్లు తెస్తున్నట్లు తెలిపిన రియల్మీ సీఈవో
  • 2020 లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన రియల్మీ, అప్పటి నుంచి మొత్తం 23 5జీ ఫోన్లను లాంచ్ చేసిన రియల్మీ

అక్టోబర్ 1 న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5జీ సేవలను పీఎం నరేంద్ర మోదీ లాంచ్ చేశారు. ఇప్పటికే ఎయిర్టెల్, జియో సంస్థలు తమ రోలౌట్ ప్లాన్స్ ని రివీల్ చేశాయి. లాంచ్ సమయంలో రియల్మీ సంస్థ తాను ఎయిర్టెల్, జియో, వీఐ లతో పాటు మీడియాటెక్, క్వాల్కమ్ సంస్థలతో చేతులు కలిపి 5జీ ప్లాన్స్ ని భారత్ లో అందిస్తామని తెలిపింది. 5జీ ఫోన్ల డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. గత 5 రోజుల్లో రియల్మీ కంపెనీ పది లక్షలకు పైగా 5జీ ఫోన్లను అమ్మినట్లు సమాచారం. రియల్మీ 5జీ ఫోన్ల అమ్మకాలు 45 శాతం గా నమోదైనట్లు సదరు కంపెనీ తెలిపింది.

2020 లో Realme కంపెనీ భారత్ లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పటి వరకు 23 5జీ ఫోన్లను రియల్మీ లాంచ్ చేసింది. దేశ వ్యాప్తంగా 5 మిలియన్ల 5జీ యూజర్లు తమకు ఉన్నారని రియల్మీ తెలిపింది. రియల్మీ ప్యాడ్ ఎక్స్ వంటి డివైజెస్ కి కూడా రియల్మీ తన 5జీ టెక్నాలజీని విస్తరించింది.

భారతీయ టెలీకామ్ సంస్థలతో జట్టుకట్టిన Realme

భారత్ లో 5జీ సేవలు లాంచ్ అవ్వడంతో, రియల్మీ కంపెనీ ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీలతో పాటు, మీడియాటెక్, క్వాల్కమ్ సంస్థలతో కలిసి దేశంలో 5జీ సేవలను విస్తరించేందుకు జట్టు కట్టింది. కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బండిల్ ఆఫర్లు ఉన్నాయని రియల్మీ కంపెనీ సీఈవో మాధవ్ సేత్ అన్నారు. 85 శాతం రియల్మీ ఫోన్లు స్టాండలోన్ (SA) 5జీ కి సపోర్ట్ చేస్తాయని ఆయన అన్నారు. జియో రోలౌట్ చేసే 5జీ సేవలు స్టాండలోన్ ఆధారితంగానే రూపొందినవి. ఈ నెల నుంచి తమ డివైజెస్ 100 శాతం సపోర్ట్ ని పొందబోతున్నాయని మాధవ్ చెప్పారు.

తమ యూజర్లు 5జీ సేవలు వినియోగించుకునే విధంగా డివైజెస్ కు ఓటీఏ అప్డేట్ ని పంపిస్తున్నామని మాధవ్ సేత్ వెల్లడించారు. 2024 కల్లా 100 మిలియన్ 5జీ యూజర్ల మార్కుని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాధవ్ తెలిపారు. ఇకపోతే 2023 లో రియల్మీ సంస్థ 100 శాతం 5జీ ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే, రియల్మీ కంపెనీ భారత్ లో మరింతగా పాతుకుపోయేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. దేశంలోని ప్రధాన టెలీకామ్ సంస్థలైన జియో, ఎయిర్టెల్, వీఐ లతో జట్టు కట్టడం, చిప్సెట్ తయారీ సంస్థలు మీడియాటెక్, క్వాల్కమ్ లతో చేతులు కలపడం వంటివి రియల్మీ సంస్థకు మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశాలను అమాంతం పెంచనున్నాయి. జనాల్లో రియల్మీ ఫోన్లకు మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు 5జీ బండిల్ ఆఫర్లతో ఆ సేల్స్ మరింత పెరగనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.409, రూ.475 ప్రీపెయిడ్ ప్లాన్స్ కి మార్పులు చేసిన వొడాఫోన్ ఐడియా https://www.91mobiles.com/telugu/vi-revised-rs-409-rs-475-plans-more-date-benefits/ Tue, 19 Jul 2022 17:11:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=1080 హైలైట్స్: రూ.409, రూ.475 ప్లాన్స్ కి మార్పులు చేసిన వొడాఫోన్ ఐడియా ఇప్పుడు రూ.409 ప్లాన్ ద్వారా 2.5జిబి డెయిలీ డేటాకు బదులు లభించనున్న 3.5 జిబి డెయిలీ డేటా రూ.475 వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్యాక్ ద్వారా 3జిబి డెయిలీ డేటాకు బదులు లభించనున్న 4జిబి డెయిలీ డేటా మరింత మంది యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు వొడాఫోన్ ఐడియా రూ.409, రూ.475 రీఛార్జ్ ప్లాన్స్ కి మార్పులు చేసింది. ఈ ప్లాన్స్ ఇప్పుడు 112జిబి డేటా వరకు […]

The post రూ.409, రూ.475 ప్రీపెయిడ్ ప్లాన్స్ కి మార్పులు చేసిన వొడాఫోన్ ఐడియా first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.409, రూ.475 ప్లాన్స్ కి మార్పులు చేసిన వొడాఫోన్ ఐడియా
  • ఇప్పుడు రూ.409 ప్లాన్ ద్వారా 2.5జిబి డెయిలీ డేటాకు బదులు లభించనున్న 3.5 జిబి డెయిలీ డేటా
  • రూ.475 వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్యాక్ ద్వారా 3జిబి డెయిలీ డేటాకు బదులు లభించనున్న 4జిబి డెయిలీ డేటా

మరింత మంది యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు వొడాఫోన్ ఐడియా రూ.409, రూ.475 రీఛార్జ్ ప్లాన్స్ కి మార్పులు చేసింది. ఈ ప్లాన్స్ ఇప్పుడు 112జిబి డేటా వరకు అందించనున్నాయి. ఈ రెండు ప్లాన్స్ కి సదరు కంపెనీ 1జిబి అదనపు డేటాను జతచేసింది. ఇక డేటా కాకుండా, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్, రీఛార్జ్ ప్యాక్స్ యొక్క వ్యాలిడిటీ మునుపటిలానే ఉండనుంది. మార్చబడిన రూ.409, రూ.475 ప్లాన్స్ యొక్క ప్రయోజనాలను ఇక్కడ చూద్దాం.

Rs 409 Vi plan: డేటా మరియు బెనిఫిట్స్

రూ.409 ప్లాన్ ఇప్పుడు మొత్తం 98జిబి డేటాను అందిస్తోంది. అంటే రోజుకి 3.5జిబి డేటా లభిస్తుంది. అలాగే 84 రోజుల వ్యాలిడిటీకి బదులుగా, 28 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. ఇక అదనంగా మీకు భారతదేశ వ్యాప్తంగా అపరిమిత ఔట్ గోయింగ్ కాల్స్ లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. డెయిలీ లిమిట్ దాటాక, మెసేజ్ కి రూపాయి వసూలు చేయబడుతుంది. ఎస్టీడీ అయితే ఒక మెసేజ్ కి రూ.1.50 ఛార్జ్ అవుతుంది. ఇంతేనా.. మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. రూ.409 ప్లాన్ బింజ్ ఆల్ నైట్ అనే ప్రయోజనంతో వస్తోంది. దీని ద్వారా మీరు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి డేటా ఖర్చు లేకుండా, ఉచితంగా ఇంటర్నెట్ ను వినియోగించవచ్చు.

ఈ ప్లాన్ వీకెండ్ డేటా రోలోవర్ అనే ఫీచర్ ను కలిగి ఉంది. దీనర్థం ఏంటో ఇక్కడ చూద్దాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు వాడని డేటా, శని, ఆది వారాలకు బదిలీ చేయబడుతుంది. అలాగే మీకు వీఐ మూవీస్, టీవీ యాప్ కు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అంటే మీరు షోస్, మూవీస్, న్యూస్, ఇతర వినోద కార్యక్రమాలను చూడవచ్చు. ఇంకా డేటా డిలైట్స్ అనే బెనిఫిట్ ద్వారా మీరు నెలకు 2జిబి వరకు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి వీఐ ఎటువంటి ఛార్జి వసూలు చేయడం లేదు.

Rs 475 Vi plan: డేటా మరియు బెనిఫిట్స్

రూ.475 ప్లాన్ ద్వారా వొడాఫోన్ డెయిలీ 4జిబి వరకు హై స్పీడ్ 4జి డేటాను ఆఫర్ చేస్తోంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. అలాగే రోజుకి 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. డెయిలీ లిమిట్ దాటాక, మెసేజ్ కి రూపాయి వసూలు చేయబడుతుంది. ఎస్టీడీ అయితే ఒక మెసేజ్ కి రూ.1.50 ఛార్జ్ అవుతుంది. డెయిలీ డేటా పెంపు మినహా మిగతా ప్రయోజనాలన్నీ రూ.409 ప్లాన్ ని పోలి ఉంటాయి.

అలాగే మీరు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి డేటా ఖర్చు లేకుండా, ఉచితంగా ఇంటర్నెట్ ను వినియోగించవచ్చు. అలాగే మీకు వీఐ మూవీస్, టీవీ యాప్ కు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అంటే మీరు షోస్, మూవీస్, న్యూస్, ఇతర వినోద కార్యక్రమాలను చూడవచ్చు. ఇంకా డేటా డిలైట్స్ అనే బెనిఫిట్ ద్వారా మీరు నెలకు 2జిబి వరకు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి వీఐ ఎటువంటి ఛార్జి వసూలు చేయడం లేదు. ఇంకా వీకెండ్ డేటా రోలోవర్ ఫీచర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది.

The post రూ.409, రూ.475 ప్రీపెయిడ్ ప్లాన్స్ కి మార్పులు చేసిన వొడాఫోన్ ఐడియా first appeared on 91Mobiles Telugu.

]]>