Vijay Deverakonda - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 23 Nov 2022 15:01:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Amazon Prime Video లో అందుబాటులో ఉన్న విజయ్ దేవరకొండ సినిమాలు https://www.91mobiles.com/telugu/vijay-deverakonda-movies-available-on-amazon-prime-video/ Wed, 23 Nov 2022 15:01:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=3615 యువ నటుడు విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన స్టార్డమ్ ని ఒకే రీతిలో మెయింటెయిన్ చేస్తున్న యంగ్ టాలెంట్ విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులు చిత్రంతో హిట్టు కొట్టిన విజయ్, తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో గా అవతరించాడు. తక్కువ సమయంలో దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన హీరోగా నిలిచిపోయాడు విజయ్ దేవరకొండ. […]

The post Amazon Prime Video లో అందుబాటులో ఉన్న విజయ్ దేవరకొండ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>

యువ నటుడు విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన స్టార్డమ్ ని ఒకే రీతిలో మెయింటెయిన్ చేస్తున్న యంగ్ టాలెంట్ విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులు చిత్రంతో హిట్టు కొట్టిన విజయ్, తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో గా అవతరించాడు. తక్కువ సమయంలో దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన హీరోగా నిలిచిపోయాడు విజయ్ దేవరకొండ. సినిమాల్లో తన నటనతో పాటు అలరించడమే కాకుండా, బయట తన ఔట్‌ఫిట్స్ తో ఆకట్టుకుంటూ ఫ్యాషన్ ఐకన్ గా నిలుస్తున్నాడు.

సొంతంగా రౌడీ అనే దుస్తుల బ్రాండ్ ని కలిగి ఉన్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అలాగే మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి కూడా దిగాడు. ఇటీవలె లైగర్ అనే ప్యాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్, త్వరలో ఖుషీ అనే ప్రేమకథతో వస్తున్నాడు. ఈ చిత్రంలో సమంతా కథానాయికగా చేస్తోంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. సరే, విషయంలోకి వెళ్దాం. విజయ్ దేవరకొండ నటించిన పలు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉన్నాయి. ఆ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓ కన్నేయండి. అలాగే ఆ చిత్రాలను చూడకుంటే గనుక ఓసారి చూసేయండి.

Amazon Prime Video లో విజయ్ దేవరకొండ సినిమాలు

  • ద్వారక
  • ఏ మంత్రం వేసావే
  • నోటా
  • మహానటి
  • అర్జున్ రెడ్డి
  • డియర్ కామ్రేడ్

1. ద్వారక

ఈ చిత్రం 2017, మార్చి 3 న విడుదలైంది. విజయ్ దేవరకొండ, పూజా జవేరి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాశ్ రాజ్, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చాడు. కుటుంబ సమేతంగా చూడదగిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఆనందించండి.

2. ఏ మంత్రం వేసావె

ఇదొక రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రానికి శ్రీధర్ మర్రి దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ, శివాని ప్రధాన పాత్రలు పోషించారు. గోలిసోడ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2013 లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్లన 2018 మార్చి 9 న రిలీజ్ అయ్యింది. విజయ్ దేవరకొండను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని చూడండి.

3. నోటా

పొలిటికల్ త్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాని ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ తమిళ తెరకు పరిచయమయ్యాడు. మెహ్రీన్ పీర్జాదా విజయ్ కి జతగా నటించింది. సత్యరాజ్, నాజర్, సంచనా నటరాజన్, కరుణాకరన్, ప్రియదర్శి పుల్లికొండ కీలక పాత్రలు పోషించారు.

4. మహానటి

ప్రముఖ నటి సావిత్రి జీవితగాథగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సహాయక పాత్ర పోషించాడు. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కీర్తి సురేశ్ సావిత్రి పాత్రను పోషించగా, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో కనిపించాడు.

5. అర్జున్ రెడ్డి

ఇదొక రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలినీ పాండే ప్రధాన పాత్రలు పోషించారు. రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, సంజయ్ స్వరూప్, గోపీనాథ్ భట్, కమల్ కామరాజు, కాంచన సహాయక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు.

6. డియర్ కామ్రేడ్

రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రశ్మికా మందణ్ణ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Amazon Prime Video లో అందుబాటులో ఉన్న విజయ్ దేవరకొండ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Liger మూవీ ఓటీటీ అప్డేట్ https://www.91mobiles.com/telugu/vijay-deverakonda-liger-ott-update-disney-plus-hotstar/ Thu, 25 Aug 2022 15:16:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=1925 హైలైట్స్: ఆగస్టు 25 న ప్రపంచ వ్యాప్తంగా 3000 లకు పైగా థియేటర్లలో విడుదలైన లైగర్ ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ, కథానాయికగా చేసిన అనన్యా పాండే, కీలక పాత్ర పోషించిన రమ్యకృష్ణ, స్పెషల్ రోల్ లో కనిపించిన మైక్ టైసన్ లైగర్ ఓటీటీ హక్కులను భారీ ధరకు కైవసం చేసుకున్న డిస్నీ+ హాట్‌స్టార్, త్వరలోనే ప్రీమియర్ తేదీ ప్రకటన Liger OTT Update: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ […]

The post Liger మూవీ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 25 న ప్రపంచ వ్యాప్తంగా 3000 లకు పైగా థియేటర్లలో విడుదలైన లైగర్
  • ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ, కథానాయికగా చేసిన అనన్యా పాండే, కీలక పాత్ర పోషించిన రమ్యకృష్ణ, స్పెషల్ రోల్ లో కనిపించిన మైక్ టైసన్
  • లైగర్ ఓటీటీ హక్కులను భారీ ధరకు కైవసం చేసుకున్న డిస్నీ+ హాట్‌స్టార్, త్వరలోనే ప్రీమియర్ తేదీ ప్రకటన

Liger OTT Update: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ లైగర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 3000 లకు పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలవ్వడం విశేషం. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ కి సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+ హాట్‌స్టార్ ఈ చిత్ర హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ప్రీమియర్ తేదీని ఇంకా వెల్లడించలేదు. థియేటర్లో లైగర్ ప్రదర్శనను బట్టి, ఓటీటీ ప్రీమియర్ తేదీ నిర్ణయించబడుతుంది. థియేటర్ కి వెళ్ళి చూడలేని వారు త్వరలో డిస్నీ+ హాట్ స్టార్ లో లైగర్ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.

Liger చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం

లైగర్ చిత్ర కథ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో ఎంఎంఏ ఫైటర్ గా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించాడు. విజయ్ కి జోడీగా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటించింది. ఇక విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. రోనిత్ రాయ్, విషురెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు.

లైగర్ చిత్రానికి సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చి, జానీ, లిజో జార్జ్, డీజే చేతస్ సంగీతం అందించారు. విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పని చేశాడు. జునైద్ సిద్దిఖీ ఎడిటర్ గా పని చేశాడు. పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిత్ర కథ

ఎంఎంఏ లో నేషనల్ ఛాంపియన్ కావాలని కల కనే లైగర్ (విజయ్ దేవరకొండ), తన తల్లి బాలమణి (రమ్యకృష్ణ) తో కలిసి కరీంనగర్ నుంచి ముంబై చేరుకుంటాడు. తర్వాత కొన్ని పరిణామాల అనంతరం లైగర్, తాన్య (అనన్యా పాండే) తో ప్రేమలో పడతాడు. తన కలను నెరవేర్చుకునేందుకు లైగర్ ఏం చేశాడు? మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో నేషనల్ ఛాంపియన్ అవుతాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విజయ్ దేవరకొండ తన పాత్రకు న్యాయం చేశాడు. అనన్యా పాండే పర్వాలేదనిపించింది. గెటప్ శ్రీను తన కామెడీతో నవ్వులు పూయించాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ బాగానే చేశారు. విజయ్ దేవరకొండ హై ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ సినిమాకు ప్రధాన బలం. లైగర్ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ వెంచర్ గా నిలిచింది. లాంగ్ రన్ లో వచ్చే వసూళ్ళను బట్టి లైగర్ హిట్టా కాదా అనేది తేలుతుంది.

లేటెస్ట్ ఓటీటీ, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Liger మూవీ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>