Vivo Philippines - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 25 Jan 2024 05:38:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: ఫిలిప్పైన్స్‌లో Vivo V30 సిరీస్ అఫీషియల్ టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/vivo-v30-series-official-teaser-released-in-philippines/ Thu, 25 Jan 2024 05:38:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9914 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 డివైజెస్ లాంచ్ కానున్నాయి. గత నెలలో వివో కంపెనీ Vivo V30 Lite స్మార్ట్‌ఫోన్ ని మెక్సికో లో లాంచ్ చేసింది. ఇప్పుడు Vivo V30 సిరీస్ ని ఫిలిప్పైన్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ లైనప్ లో Vivo V30 డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ […]

The post Vivo: ఫిలిప్పైన్స్‌లో Vivo V30 సిరీస్ అఫీషియల్ టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ
  • లైనప్ లో రానున్న Vivo V30, V30 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 డివైజెస్ లాంచ్ కానున్నాయి. గత నెలలో వివో కంపెనీ Vivo V30 Lite స్మార్ట్‌ఫోన్ ని మెక్సికో లో లాంచ్ చేసింది. ఇప్పుడు Vivo V30 సిరీస్ ని ఫిలిప్పైన్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ లైనప్ లో Vivo V30 డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ లో ఎప్పుడు లాంచ్ కానుందో వివో ఫిలిప్పైన్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ, వివో ఫిలిప్పైన్స్ తన అధికార వెబ్‌సైట్ లో Vivo V30 సిరీస్ కమింగ్ సూన్ అని టీజర్ వదిలింది.

Vivo V30 సిరీస్ అని పేర్కొనడంతో లైనప్ లో Vivo V30 5G తో పాటు Vivo V30 Pro 5G కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి Vivo V30 5G డివైజ్ డిజైన్, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 5G డిజైన్

  • Vivo V30 5G మైక్రోసైట్ వివో ఫిలిప్పైన్స్ అధికార వెబ్‌సైట్ లో దర్శనమిస్తోంది. ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలుసుకుందాం.
  • Vivo V30 5G డివైజ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది. అలాగే సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా కనిపిస్తోంది.
  • Vivo V30 5G లో బ్యాక్ ప్యానెల్ పై స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ వివరాలు తప్పా మైక్రో-సైట్ లో కనిపిస్తోన్న ఇమేజ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

Vivo V30 5G గీక్‌బెంచ్ వివరాలు

  • Vivo V30 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కొన్ని నెలల క్రితం లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Vivo V30 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • Vivo V30 5G డివైజ్ రీసెంట్ గా V2318 అనే మోడల్ నంబర్ తో బీఐఎస్, ఎఫ్‌సీసీ, ఐఎండీఏ, ఎన్బీటీసీ, టీడీఆర్ఏ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

Vivo V30 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ 1.5కే డిస్ప్లే, 1260*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండవచ్చు. వీటికి తోడు ఒక ఆరా ఎల్ఈడీ లైట్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటాయి.

The post Vivo: ఫిలిప్పైన్స్‌లో Vivo V30 సిరీస్ అఫీషియల్ టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>