Vivo S16 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:12:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 66వాట్ ఫాస్ట్ చార్జింగ్, 12+8జిబి ర్యామ్, కర్వ్డ్‌ డిస్ప్లేతో లాంచైన Vivo S16 Pro https://www.91mobiles.com/telugu/vivo-s16-pro-launched-china-price-specs/ Fri, 23 Dec 2022 08:27:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4141 హైలైట్స్ చైనాలో లాంచైన Vivo S16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లైనప్ లో వచ్చిన ఫోన్లు: Vivo S16 Pro, Vivo S16, Vivo S16e 50ఎంపి సెల్ఫీ కెమెరా, 12జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచైన Vivo S16 Pro చైనాలో Vivo S16 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో Vivo S16 Pro, Vivo S16, Vivo S16e ఫోన్లు వచ్చాయి. ఈ మూడు […]

The post 66వాట్ ఫాస్ట్ చార్జింగ్, 12+8జిబి ర్యామ్, కర్వ్డ్‌ డిస్ప్లేతో లాంచైన Vivo S16 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Vivo S16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు
  • లైనప్ లో వచ్చిన ఫోన్లు: Vivo S16 Pro, Vivo S16, Vivo S16e
  • 50ఎంపి సెల్ఫీ కెమెరా, 12జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచైన Vivo S16 Pro

చైనాలో Vivo S16 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో Vivo S16 Pro, Vivo S16, Vivo S16e ఫోన్లు వచ్చాయి. ఈ మూడు ఫోన్లు 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. టాప్ మోడల్ అయిన Vivo S16 Pro 50ఎంపి సెల్ఫీ కెమెరాతో రావడం విశేషం. అలాగే ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 8జిబి వర్చువర్ ర్యామ్ కలిగి ఉంది. అంటే యూజర్ కి మొత్తం 20 జిబి ర్యామ్ లభిస్తుంది. ఇకపోతే ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, కర్వ్డ్ డిస్ప్లే, 66 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Vivo S16 Pro పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo S16 Pro ధర

Vivo S16 Pro రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర CNY 3299 (రూ.39,100), 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ధర CNY 3599 (రూ.42,700) గా ఉంది.

Vivo S16 Pro స్పెసిఫికేషన్స్

Vivo S16 Pro 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1.07 బిలియన్ కలర్స్, పీ3 కలర్ గేముత్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo S16 Pro లో 5జీ కనెక్టివిటీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అమర్చారు. ఇది 4 నానోమీటర్ టెక్నీలజీ పై తయారైన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెన్ మాలి జీ610 జీపీయూ వాడారు. ఈ ఫోన్ మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. అంటే ర్యామ్ ని 8జిబి వరకు పెంచుకోవచ్చు. దీంతో యూజర్ కి 12జిబి+8జిబి ర్యామ్ కలిపి మొత్తం 20జిబి ర్యామ్ లభిస్తుంది.

Vivo S16 Pro కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766వి ప్రైమరీ సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Vivo S16 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 66వాట్ ఫాస్ట్ చార్జింగ్, 12+8జిబి ర్యామ్, కర్వ్డ్‌ డిస్ప్లేతో లాంచైన Vivo S16 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ https://www.91mobiles.com/telugu/vivo-s16-series-design-renders-launch-event/ Mon, 19 Dec 2022 12:20:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=4060 హైలైట్స్ త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo S16, S16 Pro, S16e ఫోన్లు ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న Vivo S16 సిరీస్ తాజాగా రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e ఫోన్ల యొక్క డిజైన్ రెండర్స్ చైనాలో త్వరలో Vivo S16 సిరీస్ లాంచ్ అవ్వనున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S16, S16 […]

The post రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo S16, S16 Pro, S16e ఫోన్లు
  • ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న Vivo S16 సిరీస్
  • తాజాగా రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e ఫోన్ల యొక్క డిజైన్ రెండర్స్

చైనాలో త్వరలో Vivo S16 సిరీస్ లాంచ్ అవ్వనున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S16, S16 Pro, S16e. అయితే కంపెనీ ఈ మూడు డివైజెస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని ఇంకా వెల్లడించలేదు. ఈలోపే Vivo S16, S16 Pro, S16e యొక్క డిజైన్ రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ తాజాగా ఈ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెల్లడించాడు. అలాగే డిజైన్ రెండర్స్ ని ఎక్స్‌క్లూజివ్ గా MySmartPrice తో షేర్ చేశాడు. Vivo S16, S16 Pro, S16e డివైజెస్ యొక్క డిజైన్ రెండర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S16 సిరీస్ డిజైన్ రెండర్స్

ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా Vivo S16 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వేరే పేరుతో ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. అయితే వివో ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. టిప్‌స్టర్ అగర్వాల్ చెబుతున్న దాని ప్రకారం, Vivo S16e ఫ్లాట్ డిస్ప్లే తో వస్తోందట. ఇతర రెండు మోడల్స్ మాత్రం కర్వ్డ్ స్క్రీన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo S16e

Vivo S16e స్క్రీన్ ఫ్లాట్ గా, సన్నని బెజెల్స్ తో ఉంటుంది. ఇకపోతే చిన్ కూడా మూడు మోడల్స్ లో సన్నగానే ఉంది. 3 ఫోన్లలో హోల్-పంచ్ కటౌట్ ఉంది.

Vivo S16e డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. అన్ని ఫోన్లలో పవర్, వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. మూడు ఫోన్లలో రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. మూడు ఫోన్లలో ట్రిపుల్ కెమెరా సెటప్, సర్క్యులర్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి.

Vivo S16e లావెండర్/పర్పుల్, సైయన్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Vivo S16, Vivo S16 Pro గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నాయి. Vivo S16 స్టాండర్డ్ వర్షన్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో కూడా లభించనుంది.

అగర్వాల్ Vivo S16 Pro యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేశాడు. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

 

Vivo S16 Pro స్పెసిఫికేషన్స్

Vivo S16 Pro 6.78-ఇంచ్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తోంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉండనుంది. 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 4600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Vivo S16 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఈ డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.4 మిల్లీ మీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo S16 సిరీస్ చైనాలో డిసెంబర్ 22 న జరిగే లాంచ్ ఈవెంట్ లో రివీల్ కానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>