Vivo S16e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 23 Dec 2022 14:36:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 66W ఫాస్ట్ చార్జింగ్, 12GB ర్యామ్, 50MP కెమెరాతో లాంచైన Vivo S16e https://www.91mobiles.com/telugu/vivo-s16e-launched-china-price-specs/ Fri, 23 Dec 2022 14:36:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=4152 హైలైట్స్ చైనాలో లాంచైన Vivo S16e 5జీ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ ఎగ్జినోస్ 1080 చిప్సెట్ తో లాంచైన Vivo S16e 50ఎంపి కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Vivo S16e ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో ఎస్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. అవి: Vivo S16, Vivo S16 Pro, Vivo S16e. ఈ మూడు ఫోన్లు కూడా 5జీ […]

The post 66W ఫాస్ట్ చార్జింగ్, 12GB ర్యామ్, 50MP కెమెరాతో లాంచైన Vivo S16e first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Vivo S16e 5జీ స్మార్ట్ ఫోన్
  • శాంసంగ్ ఎగ్జినోస్ 1080 చిప్సెట్ తో లాంచైన Vivo S16e
  • 50ఎంపి కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Vivo S16e

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో ఎస్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. అవి: Vivo S16, Vivo S16 Pro, Vivo S16e. ఈ మూడు ఫోన్లు కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. ఇప్పుడు మనం Vivo S16e స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లు భారత్ లో Vivo V27 సిరీస్ గా లాంచ్ కానున్నాయి.

Vivo S16e శాంసంగ్ ఎగ్జినోస్ 1080 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైంది. Vivo S16e యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo S16e స్పెసిఫికేషన్స్

Vivo S16e స్మార్ట్ ఫోన్ 6.62-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైంది. 20:9 యాస్పెక్ట్ రేషియోని ఈ డిస్ప్లే కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

శాంసంగ్ ఎగ్జినోస్ 1080 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రకేషన్ పై తయారైన 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కల్గిన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ78 జీపీయూ ఉపయోగించారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. Vivo S16e డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo S16e ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బరువు 187 గ్రాములు.

Vivo S16e ధర, కలర్ ఆప్షన్స్

Vivo S16e స్మార్ట్ ఫోన్ చైనాలో మూడు వేరియంట్స్ లో లాంచైంది. అవి: 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ.

8జిబి + 128జిబి వేరియంట్ ధర 2099 యువాన్లు (సుమారు రూ.24,800).
8జిబి + 256జిబి వేరియంట్ ధర 2299 యువాన్లు (సుమారు రూ.27,000.
12జిబి + 256జిబి వేరియంట్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.29,500).

Vivo S16e స్మార్ట్ ఫోన్ బ్లాక్, పర్పుల్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 66W ఫాస్ట్ చార్జింగ్, 12GB ర్యామ్, 50MP కెమెరాతో లాంచైన Vivo S16e first appeared on 91Mobiles Telugu.

]]>
రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ https://www.91mobiles.com/telugu/vivo-s16-series-design-renders-launch-event/ Mon, 19 Dec 2022 12:20:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=4060 హైలైట్స్ త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo S16, S16 Pro, S16e ఫోన్లు ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న Vivo S16 సిరీస్ తాజాగా రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e ఫోన్ల యొక్క డిజైన్ రెండర్స్ చైనాలో త్వరలో Vivo S16 సిరీస్ లాంచ్ అవ్వనున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S16, S16 […]

The post రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo S16, S16 Pro, S16e ఫోన్లు
  • ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న Vivo S16 సిరీస్
  • తాజాగా రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e ఫోన్ల యొక్క డిజైన్ రెండర్స్

చైనాలో త్వరలో Vivo S16 సిరీస్ లాంచ్ అవ్వనున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S16, S16 Pro, S16e. అయితే కంపెనీ ఈ మూడు డివైజెస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని ఇంకా వెల్లడించలేదు. ఈలోపే Vivo S16, S16 Pro, S16e యొక్క డిజైన్ రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ తాజాగా ఈ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెల్లడించాడు. అలాగే డిజైన్ రెండర్స్ ని ఎక్స్‌క్లూజివ్ గా MySmartPrice తో షేర్ చేశాడు. Vivo S16, S16 Pro, S16e డివైజెస్ యొక్క డిజైన్ రెండర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S16 సిరీస్ డిజైన్ రెండర్స్

ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా Vivo S16 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వేరే పేరుతో ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. అయితే వివో ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. టిప్‌స్టర్ అగర్వాల్ చెబుతున్న దాని ప్రకారం, Vivo S16e ఫ్లాట్ డిస్ప్లే తో వస్తోందట. ఇతర రెండు మోడల్స్ మాత్రం కర్వ్డ్ స్క్రీన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo S16e

Vivo S16e స్క్రీన్ ఫ్లాట్ గా, సన్నని బెజెల్స్ తో ఉంటుంది. ఇకపోతే చిన్ కూడా మూడు మోడల్స్ లో సన్నగానే ఉంది. 3 ఫోన్లలో హోల్-పంచ్ కటౌట్ ఉంది.

Vivo S16e డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. అన్ని ఫోన్లలో పవర్, వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. మూడు ఫోన్లలో రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. మూడు ఫోన్లలో ట్రిపుల్ కెమెరా సెటప్, సర్క్యులర్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి.

Vivo S16e లావెండర్/పర్పుల్, సైయన్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Vivo S16, Vivo S16 Pro గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నాయి. Vivo S16 స్టాండర్డ్ వర్షన్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో కూడా లభించనుంది.

అగర్వాల్ Vivo S16 Pro యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేశాడు. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

 

Vivo S16 Pro స్పెసిఫికేషన్స్

Vivo S16 Pro 6.78-ఇంచ్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తోంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉండనుంది. 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 4600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Vivo S16 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఈ డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.4 మిల్లీ మీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo S16 సిరీస్ చైనాలో డిసెంబర్ 22 న జరిగే లాంచ్ ఈవెంట్ లో రివీల్ కానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన Vivo S16, Vivo S16e పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-s16-vivo-s16e-full-specs-revealed/ Thu, 15 Dec 2022 04:21:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3993 హైలైట్స్ రివీల్ అయిన Vivo S16, Vivo S16e స్పెసిఫికేషన్స్ ఈ నెలలో లాంచ్ కానున్న Vivo S16, Vivo S16e డివైజెస్ స్నాప్ డ్రాగన్ 870 చిప్ తో వస్తోన్న Vivo S16, ఎగ్జినోస్ 1080 చిప్ తో వస్తోన్న Vivo S16e ఈ ఏడాది మే నెలలో చైనాలో Vivo S15, Vivo S15 Pro లాంచ్ అయ్యాయి. ఇప్పుడు 7 నెలల తర్వాత, వివో వీటికి సక్సెసర్స్ ని తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Vivo S16, Vivo S16e పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రివీల్ అయిన Vivo S16, Vivo S16e స్పెసిఫికేషన్స్
  • ఈ నెలలో లాంచ్ కానున్న Vivo S16, Vivo S16e డివైజెస్
  • స్నాప్ డ్రాగన్ 870 చిప్ తో వస్తోన్న Vivo S16, ఎగ్జినోస్ 1080 చిప్ తో వస్తోన్న Vivo S16e

ఈ ఏడాది మే నెలలో చైనాలో Vivo S15, Vivo S15 Pro లాంచ్ అయ్యాయి. ఇప్పుడు 7 నెలల తర్వాత, వివో వీటికి సక్సెసర్స్ ని తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. కొన్ని రోజుల నుంచి Vivo S16, Vivo S16 Pro ఫోన్లు వార్తల్లో నిలుస్తూ వస్తున్నాయి. ఈవారంలోనే ఈ రెండు ఫోన్లు కూడా గీక్ బెంచ్ పై దర్శనమిచ్చాయి. అయితే ఇప్పుడు వీటికి తోడు Vivo S16e మోడల్ కూడా ఉండనున్నట్లు తెలిసింది.

అయితే ఈ Vivo S16 సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. ఇండస్ట్రీ వార్తల ప్రకారం, ఈ నెలలోనే చైనాలో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇక వివో ఎస్15 ని వివో భారత్ లో లాంచ్ చేయలేదు. కావున, ఎస్16 సిరీస్ కూడా భారతదేశంలో లాంచ్ అవుతుందని మేం భావించడం లేదు. రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూద్దాం. ఇప్పుడైతే, Vivo S16, Vivo S16e స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

రివీల్ అయిన Vivo S16, Vivo S16e స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ చెబుతున్న దాన్ని బట్టి, Vivo S16 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 870 చిప్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీతో రానుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo S16 లో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ఈ డివైజ్ 182 గ్రాముల బరువు, 7.4 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఇంకా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ కూడా ఉంటాయి.

Vivo S16e స్పెసిఫికేషన్స్

Vivo S16e లో 6.62-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి. వివో ఈసారి ఈ ఫోన్ లో శాంసంగ్ యొక్క ఎగ్జినోస్ 1080 చిప్సెట్ వాడుతోంది. ఈ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో రానుంది.

Vivo S16e లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.

పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ 7.8 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Vivo S16, Vivo S16e పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>