Vivo S17 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 31 May 2023 13:57:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-s17-series-launched-china-price-specs-features/ Wed, 31 May 2023 11:57:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=6561 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Vivo S17, Vivo S17t, Vivo S17 Pro. ఈ ఫోన్లు స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చాయి. నేడు జరిగిన ఈవెంట్ లో కంపెనీ మూడు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. అయితే Vivo S17, Vivo S17 Pro మోడల్స్ […]

The post 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo S17 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo S17, Vivo S17t, Vivo S17 Pro
  • 5జీ కనెక్టివిటీతో వచ్చిన డివైజెస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Vivo S17, Vivo S17t, Vivo S17 Pro. ఈ ఫోన్లు స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చాయి. నేడు జరిగిన ఈవెంట్ లో కంపెనీ మూడు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. అయితే Vivo S17, Vivo S17 Pro మోడల్స్ ధరలను మాత్రమే వెల్లడించింది. సరే, ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S17 సిరీస్ ఫోన్ల ధరలు

Vivo S17 ధర

  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 2499 యువాన్లు (సుమారు రూ.29,290)
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 2799 యువాన్లు (సుమారు రూ.32,900)
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 2999 యువాన్లు (సుమారు రూ.35,999)

Vivo S17 Pro ధర

  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 3099 యువాన్లు (సుమారు రూ.36,000)
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 3299 యువాన్లు (సుమారు రూ.38,300)
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 3499 యువాన్లు (సుమారు రూ.40,500)

Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్

Vivo S17 Pro

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

చిప్సెట్

  • డైమెన్సిటీ ప్రాసెసర్
  • మాలి-జీ610 జీపీయూ

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 4 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ ఆక్టాకోర్ చిప్ వాడారు. ఇది 3.1 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 జీపీయూ వాడారు. Vivo S17 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 50ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

  • 4600 ఎంఏహెచ్
  • 80 వాట్

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S17

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే

Vivo S17 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ఓఎస్

  • స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Vivo S17 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ

  • 4600 ఎంఏహెచ్
  • 80 వాట్

Vivo S17 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S17t

Vivo S17t స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన దాదాపు అన్ని స్పెసిఫికేషన్స్ బేస్ మోడల్ Vivo S17 ని పోలి ఉన్నాయి. కంపెనీ కేవలం చిప్సెట్ ని మార్చి Vivo S17t ని మార్కెట్ లోకి వదిలింది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ తో వచ్చింది. మాలి-జీ77 జీపీయూ గ్రాఫిక్స్ ని ఇందులో వాడారు. అయితే Vivo S17t ధరను వివో ఇంకా వెల్లడించలేదు.

The post 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo S17, S17 Pro ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-s17-s17-pro-chipset-camera-display-specs-leak/ Mon, 17 Apr 2023 11:33:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=5915 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో త్వరలోనే Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సిరీస్ ని Oppo Reno 10 సిరీస్ లైనప్ కి పోటీగా Vivo S17 సిరీస్ ని దింపుతున్నట్లు సమాచారం. ఈ రెండు స్మార్ట్ ఫోన్ సిరీస్ లు చైనాలో మే నెల లేదా జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లాంచ్ కి ముందు Vivo S17, […]

The post లీకైన Vivo S17, S17 Pro ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే నెలలో లాంచ్ కానున్న Vivo S17 సిరీస్
  • క్వాల్కమ్ మరియు మీడియాటెక్ చిప్సెట్స్ తో వస్తోన్న సిరీస్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరాతో రానున్న Vivo S17 సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో త్వరలోనే Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సిరీస్ ని Oppo Reno 10 సిరీస్ లైనప్ కి పోటీగా Vivo S17 సిరీస్ ని దింపుతున్నట్లు సమాచారం. ఈ రెండు స్మార్ట్ ఫోన్ సిరీస్ లు చైనాలో మే నెల లేదా జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లాంచ్ కి ముందు Vivo S17, Vivo S17 Pro స్పెసిఫికేషన్స్ ని TechGoing వెబ్ సైట్ డిజిటల్ చాట్ స్టేషన్ సౌజన్యంతో అందించింది.

Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రాసెసర్

  • క్వాల్కమ్ చిప్సెట్ తో వస్తోన్న Vivo S17
  • మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న Vivo S17 Pro

గతంలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, Vivo S17 సిరీస్ లో మూడు ఫోన్లు లాంచ్ కానున్నాయని సమాచారం. వీటిలో Vivo S17e, Vivo S17, Vivo S17 Pro అనే మోడల్స్ ఉన్నాయి. అయితే Vivo S17e మోడల్ లో ఏ ప్రాసెసర్ ఇవ్వనున్నారో ఇంకా తెలియలేదు. లేటెస్ట్ రిపోర్ట్ ని బట్టి, Vivo S17 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ SM7325 తో రానుందని తెలుస్తోంది. అంటే ఈ క్వాల్కమ్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 778జి లేదా స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ అయ్యుండే చాన్స్ ఉంది.

Vivo S17 Pro గురించి మాట్లాడితే ఈ ఫోన్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానుందని సమాచారం. గత మోడల్స్ అయిన వివో ఎస్16 మరియు ఎస్16 ప్రో డివైజెస్ లో స్నాప్ డ్రాగన్ 870 మరియు డైమెన్సిటీ 8200 చిప్సెట్స్ అందించింది.

డిస్ప్లే

  • ఓఎల్ఈడీ
  • హై రెజుల్యూషన్

టిప్‌స్టార్ డిజిటల్ చాట్ స్టేషన్ Vivo S17, Vivo S17 Pro స్మార్ట్ ఫోన్లు ఓఎల్ఈడీ డిస్ప్లే తో రానున్నట్లు తెలిపింది. ఈ డిస్ప్లే 1.5 కే రెజుల్యూషన్ ని కలిగి ఉంటుందని సమాచారం. అయితే డిస్ప్లే సైజ్ వివరాలు ఇంకా తెలియలేదు. గత రిపోర్ట్స్ ద్వారా Vivo S17 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలిసింది.

కెమెరా మరియు బ్యాటరీ

  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo S17 మరియు Vivo S17 Pro డివైజెస్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766వి ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో రానుంది. దీంతో పాటు 12 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్633 టెలీఫోటో లెన్స్ కూడా ఉంటుందని అంచనా.

Vivo S17 సిరీస్ అన్ని రియర్ కెమెరాల సమాచారం పూర్తిగా తెలియలేదు. Vivo S17 సిరీస్ స్మార్ట్ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Vivo S17, S17 Pro ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-s17-series-specifications-leaked-before-launch/ Mon, 27 Mar 2023 13:20:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=5596 వివో సంస్థ కొన్ని రోజుల క్రితం చైనాలో Vivo S16 సిరీస్ ని లాంచ్ చేసింది. భారత్ లో ఈ సిరీస్ ని Vivo V27 సిరీస్ పేరుతో తీసుకొచ్చారు. ఇప్పుడు కంపెనీ నుంచి Vivo S17 సిరీస్ రానున్నట్లు సమాచారం. Tech Outlook వెబ్ సైట్ కథనం ప్రకారం, Vivo S17 సిరీస్ లో మొత్తం మూడు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S17, Vivo S17e, Vivo S17 Pro. సరే, తాజాగా […]

The post లీకైన Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 మూడో త్రైమాసికంలో లాంచ్ కానున్న Vivo S17 సిరీస్
  • Vivo S17 సిరీస్ లో భాగంగా రానున్న 3 స్మార్ట్ ఫోన్స్
  • సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తోన్న Vivo S17 సిరీస్

వివో సంస్థ కొన్ని రోజుల క్రితం చైనాలో Vivo S16 సిరీస్ ని లాంచ్ చేసింది. భారత్ లో ఈ సిరీస్ ని Vivo V27 సిరీస్ పేరుతో తీసుకొచ్చారు. ఇప్పుడు కంపెనీ నుంచి Vivo S17 సిరీస్ రానున్నట్లు సమాచారం. Tech Outlook వెబ్ సైట్ కథనం ప్రకారం, Vivo S17 సిరీస్ లో మొత్తం మూడు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S17, Vivo S17e, Vivo S17 Pro. సరే, తాజాగా లీకైన Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

లీకైన Vivo S17 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్

Vivo S17 సిరీస్ మిడ్-రేంజ్ కొనుగోలుదారులని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు. తొలుత ఈ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో వేరే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే టెక్ ఔట్‌లుక్ ప్రకారం, S17, S17 Pro, S17e డివైజెస్ వరుసగా V2283A, V2284A, V2285A అనే మోడల్ నంబర్లను కలిగి ఉన్నాయి. ఈ లైనప్ లోని కొన్ని మోడల్స్ ని చైనాకి బయట ఇతర మార్కెట్స్ లో Vivo V29 సిరీస్ పేరుతో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. రిపోర్ట్ ద్వారా Vivo S17 సిరీస్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్లు కూడా రివీల్ అయ్యాయి.

Vivo S17 సిరీస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్నట్లు సమాచారం. అలాగే 3 మోడల్స్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే ని కలిగి ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదండోయ్, ఈ ఫోన్లు కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు సమాచారం. Vivo S17 సిరీస్ 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేయనుంది.

Vivo S17 హ్యాండ్సెట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి వేరియంట్స్ లో లభించనుంది. అంతేకాదు, Vivo S17 Pro లైనప్ 16జిబి వరకు ర్యామ్ ని ఆఫర్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో రానున్నట్లు సమాచారం. ఇప్పటికైతే, కెమెరా సెన్సర్స్ కి సంబంధించిన సమాచారం తెలియదు.

2023 మూడో త్రైమాసికంలో Vivo S17 సిరీస్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. దీనర్థం, జులై మరియు సెప్టెంబర్ మధ్యలో చైనాలో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇక భారత్ లో ఇదే సిరీస్ Vivo V29 సిరీస్ గా వచ్చేందుకు సమయం పట్టనుంది. అయితే వివో కంపెనీ నుంచి దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ఏ విషయం కచ్చితంగా చెప్పలేం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>