Vivo S19 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 30 May 2024 16:56:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: చైనాలో లాంచైన Vivo S19, Vivo S19 Pro https://www.91mobiles.com/telugu/vivo-s19-vivo-s19-pro-launched-in-china/ Thu, 30 May 2024 16:56:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=11812 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో ఎస్19 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo S19 మరియు Vivo S19 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 16జిబి ర్యామ్, 1.5కే డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లలో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల ధర, లభ్యత మరియు పూర్తి […]

The post Vivo: చైనాలో లాంచైన Vivo S19, Vivo S19 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో వివో ఎస్19 సిరీస్ లాంచ్
  • లైనప్‌: వివో ఎస్19, ఎస్19 ప్రో
  • 50ఎంపి సెల్ఫీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో ఎస్19 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo S19 మరియు Vivo S19 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 16జిబి ర్యామ్, 1.5కే డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లలో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo S19 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo S19 లో 6.78-ఇంచ్ ఫ్లాట్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo S19 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo S19 డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo S19 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo S19 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉ్ననాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo S19 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo S19 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఎన్ఎఫ్‌సీ, ఐపీ64 సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Vivo S19 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo S19 Pro లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo S19 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo S19 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo S19 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo S19 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Vivo S19 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo S19 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68/69 సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Vivo S19, Vivo S19 Pro ధరలు

Vivo S19 8జిబి + 256జిబి వేరియంట్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.28,700)

Vivo S19 12జిబి + 256జిబి వేరియంట్ ధర 2699 యువాన్లు (సుమారు రూ.31,000)

Vivo S19 12జిబి + 512జిబి మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,450)

Vivo S19 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3299 యువాన్లు (సుమారు రూ.37,900).

Vivo S19 డివైజ్ మిస్టీ బ్లూ, బ్లాసమ్ పీచ్, పైన్ స్మోక్ ఇంక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo S19 Pro 8జిబి + 256జిబి వేరియంట్ ధర 3299 యువాన్లు (సుమారు రూ.37,900)

Vivo S19 Pro 12జిబి + 256జిబి మోడల్ ధర 3499 యువాన్లు (సుమారు రూ.40,200)

Vivo S19 Pro 12జిబి + 512జిబి వేరియంట్ ధర 3799 యువాన్లు (సుమారు రూ.42,500)

Vivo S19 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.45,950).

Vivo S19 Pro స్మార్ట్‌ఫోన్ మిస్టీ బ్లూ, మౌంటెయిన్ గ్రీన్, స్వార్డ్ షాడో గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Vivo: చైనాలో లాంచైన Vivo S19, Vivo S19 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లీకైన S19, S19 Pro పోస్టర్, డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-s19-s19-pro-poster-design-specs-leaked/ Wed, 22 May 2024 10:05:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=11659 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో S19, S19 Pro అనే డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఎస్19 సిరీస్ యొక్క పోస్టర్ లీక్ అయ్యింది. దీంతో డివైజెస్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. సరికొత్త లుక్ తో ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు అర్థమవుతోంది. బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. ఓసారి ఎస్19 సిరీస్ పోస్టర్ […]

The post Vivo: లీకైన S19, S19 Pro పోస్టర్, డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo S19 సిరీస్ లాంచ్
  • తాజాగా లీకైన పోస్టర్
  • కొత్త డిజైన్ తో వస్తోన్న లైనప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో S19, S19 Pro అనే డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఎస్19 సిరీస్ యొక్క పోస్టర్ లీక్ అయ్యింది. దీంతో డివైజెస్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. సరికొత్త లుక్ తో ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు అర్థమవుతోంది. బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. ఓసారి ఎస్19 సిరీస్ పోస్టర్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Vivo S19 సిరీస్ పోస్టర్ (లీక్)

Vivo S19 సిరీస్ యొక్క పోస్టర్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో ఈ లైనప్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. ప్రధానమైన మార్పులతో ఈ సిరీస్ వస్తోంది. కెమెరా మాడ్యూల్ లుక్ పూర్తిగా మారిపోయింది.

టిప్‌స్టర్ classmate Wu Datou ఎస్19 సిరీస్ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ లీక్ ద్వారా అఫీషియల్ మార్కెటింగ్ పోస్టర్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Vivo S19 సిరీస్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ గమనిస్తే, గత మోడల్ తో పోల్చితే కెమెరా మాడ్యూల్ విభిన్నంగా ఉంది. ఓవల్ షేప్ లో మాడ్యూల్ ఉంది.

పోస్టర్ లో Vivo S19 మరియు Vivo S19 Pro పేర్లు పేర్కొనబడి లేవు. కానీ, ఈ రెండు ఫోన్లు ఇదే డిజైన్ తో రానున్నాయని సమాచారం.

Vivo S19, Vivo S19 Pro స్పెసిఫికేషన్స్

లీక్ ప్రకారం, Vivo S19 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

ఇంకా Vivo S19 Pro లో 50ఎంపి టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. ఇది 50ఎక్స్ జూమ్ ఫీచర్ తో వస్తోంది. ఇందులో సోని ఐఎంఎక్స్816 సెన్సర్ ని వాడే అవకాశం ఉంది. మూడో కెమెరాగా 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Vivo S19 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

స్టాండర్డ్ మోడల్ Vivo S19 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ ఓఐఎస్ కెమెరా ఉంటాయి.

Vivo S19 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

The post Vivo: లీకైన S19, S19 Pro పోస్టర్, డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo S19: గీక్‌బెంచ్ పై లిస్టైన వివో ఎస్19 స్మార్ట్‌ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-s19-listed-on-geekbench/ Tue, 21 May 2024 05:47:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=11638 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo S19, Vivo S19e మరియు Vivo S19 Pro అనే డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి గీక్‌బెంచ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo S19 గీక్‌బెంచ్ వివరాలు Vivo S19 డివైజ్ […]

The post Vivo S19: గీక్‌బెంచ్ పై లిస్టైన వివో ఎస్19 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo S19 లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2364A
  • లైనప్‌లో వస్తోన్న S19, S19e, S19 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo S19, Vivo S19e మరియు Vivo S19 Pro అనే డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి గీక్‌బెంచ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo S19 గీక్‌బెంచ్ వివరాలు

Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై V2364A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇప్పుడు గీక్‌బెంచ్ 5.5.1 బెంచ్‌మార్క్ టెస్ట్ స్కోరింగ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo S19 డివైజ్ సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 920 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3414 పాయింట్లు స్కోర్ చేసింది. లిస్టింగ్‌ని బట్టి, ఈ హ్యాండ్సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo S19 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి. చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40GHz.

Vivo S19 స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

కొన్ని రోజుల క్రితం Vivo S19 Pro కూడా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, మాలి-జీ715-ఇమ్మోర్టాలిస్ ఎంసీ11 జీపీయూ రివీల్ అయ్యాయి.

3సీ సర్టిఫికేషన్ ద్వారా 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. దీంతో ప్రో వేరియంట్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు స్పష్టమైంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే అన్ని వేరియంట్స్ యొక్క లాంచ్ తేదీ మరియు ఇతర వివరాల ప్రకటన ఉండవచ్చు.

Vivo S18 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo S18 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.9 యాస్పెక్ట్ రేషియో, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo S18 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo S18 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా అందించారు.

సాఫ్ట్‌వేర్: Vivo S18 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Vivo S18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo S18 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

సెక్యూరిటీ: Vivo S18 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

The post Vivo S19: గీక్‌బెంచ్ పై లిస్టైన వివో ఎస్19 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>