Vivo T2 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Apr 2024 08:49:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y27, Vivo T2 5G ఫోన్ల ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y27-vivo-t2-5g-price-drop-know-the-details/ Thu, 01 Feb 2024 18:26:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=10038 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా తన స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. మూడు స్మార్ట్‌ఫోన్ల ధరలను వివో తగ్గించింది. వీటిలో Vivo Y27, Vivo T2 5G 6gb, Vivo T2 5G 8gb మోడల్స్ ఉన్నాయి. ఈ డివైజెస్ పై రూ.1,000 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్లు కొనాలని భావిస్తున్న వారికి మంచి అవకాశమని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల కొత్త ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo Y27 ధర […]

The post Vivo Y27, Vivo T2 5G ఫోన్ల ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
  • Vivo Y27 పై రూ.1000 తగ్గింపు
  • Vivo T2 5G పై రూ.1000 తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా తన స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. మూడు స్మార్ట్‌ఫోన్ల ధరలను వివో తగ్గించింది. వీటిలో Vivo Y27, Vivo T2 5G 6gb, Vivo T2 5G 8gb మోడల్స్ ఉన్నాయి. ఈ డివైజెస్ పై రూ.1,000 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్లు కొనాలని భావిస్తున్న వారికి మంచి అవకాశమని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల కొత్త ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y27 ధర

  • Vivo Y27 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారతీయ మార్కెట్ లో రూ.12,999 గా ఉంది.
  • Vivo Y27 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.11,999 కి చేరుకుంది. అంటే రూ.1,000 డిస్కౌంట్ యూజర్ కి లభిస్తుంది.

Vivo T2 5G 6GB వేరియంట్ ధర

Vivo T2 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.16,999 గా ఉంది. రూ.1,000 డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.15,999 కి చేరుకుంది.

Vivo T2 5G 8GB వేరియంట్ ధర

Vivo T2 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.18,999 గా ఉంది. రూ.1,000 డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.17,999 కి చేరుకుంది.

Vivo Y27 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది.
  • రియర్ కెమెరా: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: Vivo Y27 4G డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
  • చిప్సెట్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ, ర్యామ్: Vivo Y27 4G డివైజ్ లో 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y27 4G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.0, వై-ఫై 2.4 గిగాహెర్ట్జ్/5 గిగాహెర్ట్జ్, టైప్-సీ పోర్ట్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
  • డైమెన్షన్స్: Vivo Y27 4G డివైజ్ 8.07 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo T2 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo T2 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే తో ఈ ఫోన్ వచ్చింది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2 5G 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • కెమెరా: Vivo T2 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, ఒక ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Vivo T2 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo T2 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కలర్ ఆప్షన్స్: Vivo T2 5G వెలాసిటీ వేవ్ మరియు నైట్రో బ్లేజ్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Vivo T2 5G డివైజ్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.80 మిల్లీ మీటర్ల మందం, 172 గ్రాముల బరువు ఉంటుంది.
  • కనెక్టివిటీ: Vivo T2 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y27, Vivo T2 5G ఫోన్ల ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! https://www.91mobiles.com/telugu/vivo-t2-pro-5g-to-launch-soon-with-mediatek-dimensity-7200-processor/ Fri, 08 Sep 2023 07:58:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7921 Vivo ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో T2 5G మరియు T2x 5G స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు T2 సిరీస్‌లో కొత్త ‘ప్రో’ వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. మునుపటి మోడళ్లతో పోల్చితే, ప్రో వెర్షన్ మరింత శక్తివంతమైనది మరియు ఖరీదైనది. Vivo T2 5G మరియు T2x 5G రెండూ రూ. 21,000 లోపు ధరను కలిగి ఉన్నాయి. మరి Vivo T2 Pro డివైజ్ ధర ఎంత ఉంటుందో చూడాలి. అభివృద్ధి […]

The post త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • T2 Pro వర్షన్ పై పని చేస్తున్న Vivo
  • అంటుటు పై హైస్కోర్ చేసినట్లు సమాచారం
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న డివైజ్

Vivo ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో T2 5G మరియు T2x 5G స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు T2 సిరీస్‌లో కొత్త ‘ప్రో’ వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. మునుపటి మోడళ్లతో పోల్చితే, ప్రో వెర్షన్ మరింత శక్తివంతమైనది మరియు ఖరీదైనది. Vivo T2 5G మరియు T2x 5G రెండూ రూ. 21,000 లోపు ధరను కలిగి ఉన్నాయి. మరి Vivo T2 Pro డివైజ్ ధర ఎంత ఉంటుందో చూడాలి.

అభివృద్ధి దశలో ఉన్న Vivo T2 Pro

  • టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం, Vivo T2 సిరీస్ యొక్క ప్రో వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ AnTuTuలో స్మార్ట్‌ఫోన్ 600,000 స్కోర్ చేసినట్లు సమాాచారం.
  • Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO ఇటీవల భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో Z7 ప్రోని విడుదల చేసింది. ఇది రూ.23,999తో ప్రారంభమయ్యే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. Vivo T2 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా అదే కోవలోకి వస్తుందని భావిస్తున్నారు.
  • Vivo కొత్త T2 స్మార్ట్‌ఫోన్‌ను 8GB RAM + 128GB మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్‌లలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రత్యేకంగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
  • లాంచ్ వివరాల విషయానికొస్తే, ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ త్వరలోనే ప్రకటన వస్తుందని మేం భావిస్తున్నాం.
  • మేము పైన పేర్కొన్నట్లుగా, ప్రో వేరియంట్ ప్రస్తుత T2 లైనప్ కంటే మెరుగైన స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లతో వస్తుంది. Vivo T2 5G మరియు T2x 5G స్పెసిఫికేషన్స్ పై ఓసారి కన్నేయండి.

Vivo T2 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T2 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది.
  • ప్రాసెసర్: Vivo T2 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2 5G డివైజ్ 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్, ఈఐఎస్ కెమెరా, 2ఎంపి డొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo T2 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo T2x 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది.
  • ప్రాసెసర్: Vivo T2x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2x 5G డివైజ్ 4జిబి + 128జిబి, 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T2x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo T2x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T2x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-t2-5g-vs-oneplus-nord-ce-3-lite-5g-which-is-value-for-money-device/ Tue, 11 Apr 2023 14:36:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=5834 వివో సంస్థ భారత్ లో Vivo T2 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.20 వేల బడ్జెట్ లో మార్కెట్ లోకి వచ్చింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రీసెంట్ గా లాంచైన OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ కి పోటీ ఇవ్వనుంది. రెండు ఫోన్లు కూడా ఒకటి కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చాయి. ఇక్కడ మీకోసం రెండు ఫోన్ల యొక్క ధర, స్పెసిఫికేషన్స్, […]

The post Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.20 వేల బడ్జెట్ లో లభిస్తోన్న రెండు వివో మరియు వన్‌ప్లస్ ఫోన్లు
  • క్వాల్కమ్ 5జీ ప్రాసెసర్ తో వచ్చిన రెండు ఫోన్లు
  • రెండింట్లో ఏది ఉత్తమమైన ఆప్షనో తెలుసుకోండి

వివో సంస్థ భారత్ లో Vivo T2 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.20 వేల బడ్జెట్ లో మార్కెట్ లోకి వచ్చింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రీసెంట్ గా లాంచైన OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ కి పోటీ ఇవ్వనుంది. రెండు ఫోన్లు కూడా ఒకటి కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చాయి. ఇక్కడ మీకోసం రెండు ఫోన్ల యొక్క ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్లను పోల్చుతున్నాం.

Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర మరియు లాంచ్ ఆఫర్లు

  • Vivo T2 5G ప్రారంభ ధర రూ.18,999
  • OnePlus Nord CE 3 Lite 5G ప్రారంభ ధర రూ.19,999

రెండు వేరియంట్లో అందుబాటులో ఉన్న Vivo T2 5G. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.18,999. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.20,999.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ ని కూడా రెండు వేరియంట్లో కొనుగోలు చేయవచ్చు. 8జిబి ర్యామ్ + 128జిబి బేస్ వేరియంట్ ధర రూ.19,999. 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.

ఏప్రిల్ 18 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా వివో ఫోన్ సేల్ మొదలవుతుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ లావాదేవీలపై రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

మరోవైపు వన్‌ప్లస్ ఫోన్ ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే వీలుంది. ఈ ఫోన్ పై కూడా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ లభించనుంది.

Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్

Vivo T2 5G, OnePlus Nord CE 3 Lite 5G ఫోన్లు దాదాపుగా ఒకే రకమైన డిజైన్ ని కలిగి ఉంది. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై రెండు కెమెరా రింగ్స్ ఉంటాయి. వివో ఫోన్ కెమెరా రింగ్ హైలైటెడ్ ప్యానెల్ లో ఉండగా, వన్‌ప్లస్ ఫోన్ ప్యానెల్ ని కలిగి లేదు. వివో ఫోన్ లో ఎల్ఈడీ ఫ్లాష్ మరియు సెకండరీ లెన్స్ కలిసి ఉన్నాయి. వన్‌ప్లస్ డివైజ్ లో ఎల్ఈడీ ఫ్లాష్ వేరుగా ఉంది.

ఈ రెండు వివో మరియు వన్‌ప్లస్ ఫోన్లు ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్స్, ఫ్లాట్ డిజైన్ కలిగి ఉన్నాయి. వివో ఫోన్ లో పవర్ బటన్, వాల్యూమ్ బటన్ కుడివైపున ఉన్నాయి. వన్‌ప్లస్ లో ఎడమవైపున ఉన్నాయి. రెండు ఫోన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఫోన్ మరియు స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి.

డిస్ప్లే

  • అమోలెడ్ డిస్ప్లే ప్యానెల్
  • ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

Vivo T2 డివైజ్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus Nord CE 3 Lite డివైజ్ లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజీ

వివో టీ2 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619జిబి జీపీయూ అందించారు. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీ పెంచుకోవచ్చు. వన్‌ప్లస్ గురించి చూస్తే ఈ ఫోన్ లో సేమ్ క్వాల్కమ్ ప్రాసెసర్ వాడారు. డివైజ్ 8జిబి ర్యామ్, 128/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్

రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి. అయితే వన్‌ప్లస్ డివైజ్ ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో రాగా, వివో మాత్రం ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో వచ్చింది.

కెమెరా

వన్‌ప్లస్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో లెన్సెస్ ఉన్నాయి. వివో డివైజ్ లో 64ఎంపి రియర్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ మరియు చార్జింగ్

వివో టీ2 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉణ్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా బాక్స్ లో చార్జర్ తో వస్తున్నాయి.

5జీ సపోర్ట్

రెండు ఫోన్లు కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. వివో ఫోన్ 8 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ ఫోన్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఏ ఫోన్ బాగుంది?

రెండు ఫోన్లు కూడా చక్కటి ఫీచర్లతో బాగానే ఉన్నాయి. అయితే వివో ఫోన్ కంటే వన్‌ప్లస్ రూ.1000 అధిక ధర కలిగి ఉంది. వివో లో 64ఎంపి కెమెరా ఉండగా, వన్‌ప్లస్ లో 108ఎంపి కెమెరా ఉంది. ఈ సెన్సర్ వన్‌ప్లస్ కి బిగ్ ప్లస్ కానుంది. అలాగే వన్‌ప్లస్ లో 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండగా, వివో లో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే వివో ఫోన్ అమోలెడ్ డిస్ప్లే తో రాగా, వన్‌ప్లస్ మాత్రం ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్ డ్రాగన్ 695 చిప్, 64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Vivo T2 5G https://www.91mobiles.com/telugu/vivo-t2-5g-launched-india-price-specs-availability/ Tue, 11 Apr 2023 06:54:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=5821 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో నేడు భారత్ లో Vivo T2 5G మరియు Vivo T2x డివైజెస్ ని లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ ఫోన్లు ధరలు అందుబాటులోనే ఉండనున్నాయి. ఈ ఆర్టికల్ లో Vivo T2 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 64ఎంపి రియర్ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో […]

The post స్నాప్ డ్రాగన్ 695 చిప్, 64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Vivo T2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Vivo T2 5G స్మార్ట్ ఫోన్
  • 6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించనున్న డివైజ్
  • వెలాసిటీ వేవ్, నైట్రో బ్లేజ్ కలర్ ఆప్షన్స్ తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో నేడు భారత్ లో Vivo T2 5G మరియు Vivo T2x డివైజెస్ ని లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ ఫోన్లు ధరలు అందుబాటులోనే ఉండనున్నాయి. ఈ ఆర్టికల్ లో Vivo T2 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 64ఎంపి రియర్ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో Vivo T2 5G మార్కెట్ లోకి వచ్చింది.

భారత్ లో Vivo T2 5G ధర

Vivo T2 5G డివైజ్ 6జిబి/128జిబి మరియు 8జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. వెలాసిటీ వేవ్ మరియు నైట్రో బ్లేజ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ని వివో ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 18 నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు వివో ఇండియా వెబ్ సైట్ ద్వారా Vivo T2 5G సేల్ మొదలవుతుంది.

Vivo T2 5G స్పెసిఫికేషన్స్

  • 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 6జిబి/8జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 64ఎంపి, 16ఎంపి కెమెరాస్

Vivo T2 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే తో ఈ ఫోన్ వచ్చింది. ఈ డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. వెలాసిటీ వేవ్ మరియు నైట్రో బ్లేజ్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo T2 5G డివైజ్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.80 మిల్లీ మీటర్ల మందం, 172 గ్రాముల బరువు ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo T2 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, ఒక ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్ డ్రాగన్ 695 చిప్, 64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Vivo T2 5G first appeared on 91Mobiles Telugu.

]]>