Vivo T3 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 12 Sep 2024 15:27:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/#respond Thu, 12 Sep 2024 15:27:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=13464 Vivo నుంచి కొన్ని రోజుల క్రితం Vivo T3 Pro ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రూ.24,999 ధరతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 3డీ అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో మరొక ఫోన్ Motorola Edge 50 Fusion కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ […]

The post Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

Vivo నుంచి కొన్ని రోజుల క్రితం Vivo T3 Pro ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రూ.24,999 ధరతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 3డీ అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో మరొక ఫోన్ Motorola Edge 50 Fusion కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఫోన్ల యొక్క పెర్ఫామెన్స్‌ను పోల్చి చూసి, రెండింట్లో ఏది శక్తివంతమైన ఫోన్ అనే విషయాన్ని తెలుసుకుందాం.

గీక్‌బెంచ్

ఈ టెస్ట్ కోసం రెండు ఫోన్ల యొక్క టాప్ మోడల్స్‌ను వినియోగించాం. Vivo T3 Pro 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. Motorola Edge 50 Fusion 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో వివో టీ3 ప్రో 1147 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3117 పాయింట్లు స్కోర్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2945 పాయింట్లు స్కోర్ చేసింది.

వివో టీ3 ప్రో డివైజ్ యాప్ లోడ్, జనరల్ స్క్రోలింగ్, గేమింగ్, వీడియో రికార్డింగ్ వంటి పనులను ఎక్కువ ఎఫిషియంట్ గా చేస్తుంది. తక్కువ ర్యామ్ కన్ఫిగరేషన్ ఉన్నప్పటికీ వివో మంచి స్కోర్ నమోదు చేసింది.

విజేత: Vivo T3 Pro

అంటుటు

వివో టీ3 ప్రో యొక్క అంటుటు స్కోర్ 8,12,119 గా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అంటుటు స్కోర్ 6,20,648 గా ఉంది. ఈ టెస్టులో అత్యధిక పాయింట్లు సాధించిన వివో టీ3 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కంటే మేటిగా నిలిచింది.

విజేత: Vivo T3 Pro

సీపీయూ థ్రాటిల్

సీపీయూ థ్రాటిల్ టెస్ట్ కోసం మేం బర్నవుట్ యాప్ వినియోగించాం. గతంలో ఈ టెస్టులో మోటోరోలా ఫోన్ రియల్మీ 13 ప్లస్ మీద పైచేయి సాధించింది. ఇప్పుడు కూడా తన డామినేషన్ ను చూపించింది.

వివో టీ3 ప్రో డివైజ్ బర్నవుట్ టెస్ట్ లో 67.9 పర్సెంట్ స్టెబిలిటీని చూపించింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజ్ 76.5 పర్సెంట్ స్టెబిలిటీని చూపించింది.

విజేత: Motorola Edge 50 Fusion

గేమింగ్

మేం జరిపిన గేమింగ్ టెస్ట్ లో.. వివో టీ3 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో 30 నిమిషాల పాటు బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను ఆడాం. ఈ సమయంలో టెంపరేచర్ ను గమనించాం.

బీజీఎంఐ రౌండ్ తర్వాత, వివో టీ3 ప్రో టెంపరేచర్ 3.8 డిగ్రీలు పెరిగింది. మరోవైపు, ఎడ్జ్ 50 ఫ్యూజన్ టెంపరేచర్ 7.5 డిగ్రీలు పెరిగింది. 30 నిమిషాల పాటు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాక, టీ3 ప్రో డివైజ్ టెంపరేచర్ 3.1 డిగ్రీలు పెరిగగా, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ యొక్క టెంపరేచర్ 7.2 డిగ్రీలు పెరిగింది.

వివో టీ3 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేలను అందించారు. దీంతో గేమింగ్ టైమ్‌లో మిస్‌టచెస్ చోటుచేసుకున్నాయి. వివో టీ3 ప్రో ఎక్స్‌ట్రిమ్+ ఫ్రేమ్ రేట్స్ (90ఎఫ్‌పీఎస్) ను స్మూథ్ గ్రాఫిక్స్ పై ఆఫర్ చేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులో లేదు. మేం జరిపిన టెస్టుల్లో వివో టీ3 ప్రో ఫ్రేమ్ రేట్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి.

విజేత: Vivo T3 Pro

ఏది బెటర్?

మేం జరిపిన టెస్టులను బట్టి, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ కల్గిన Vivo T3 Pro విజేతగా నిలిచింది. పెర్ఫామెన్స్ బాగా ఉండాలని భావించే వారికి వివో టీ3 ప్రో మంచి ఎంపిక అవుతుంది. అయితే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

ఇంకా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కు 3 ఏళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి. కానీ, టీ3 ప్రో కి మాత్రం 2 ఏళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి.

ఈ రెండు ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఉజ్వల్ శర్మ, ఆదిత్యా పాండే

The post Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/feed/ 0
Vivo T3 Pro 5G: నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-first-sale-from-today-know-the-price-offers/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-first-sale-from-today-know-the-price-offers/#respond Tue, 03 Sep 2024 09:31:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13318 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Pro 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ యొక్క సేల్ నేడు (సెప్టెంబర్ 3) న మొదలైంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్‌ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ సేల్‌లో భాగంగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓసారి Vivo T3 Pro 5G యొక్క […]

The post Vivo T3 Pro 5G: నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు Vivo T3 Pro 5G ఫస్ట్ సేల్
  • 12 గంటలకు సేల్ ప్రారంభం
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Pro 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ యొక్క సేల్ నేడు (సెప్టెంబర్ 3) న మొదలైంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్‌ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ సేల్‌లో భాగంగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓసారి Vivo T3 Pro 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G ధర, ఆఫర్లు

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. 8జిబి + 256జిబి మోడల్ ధరు రూ.26,999 గా నిర్ణయించారు.

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Vivo T3 Pro 5G సేల్ ప్రారంభమైంది.

Vivo T3 Pro 5G పై లాంచ్ డిస్కౌంట్ కూడా ఉంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ యూజర్లకు రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ తో పాటు, రూ.3,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. 3 నుంచి 6 నెలల కాలపరిమితితో ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ శాండ్‌స్టోన్ ఆరెంజ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo T3 Pro 5G బేస్ మోడల్ లాంచ్ ధర రూ.24,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తో రూ.21,999 కే సొంతం చేసుకోవచ్చు. టాప్ మోడల్ లాంచ్ ధర రూ.26,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తో రూ.23,999 కే లభిస్తుంది.

Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Pro 5G లో 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని అంటుటు స్కోర్ 812119 పాయింట్లుగా ఉంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ సాయంతో 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. రెండేళ్ళు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Vivo T3 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Pro 5G లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమ్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, వెట్ టచ్ టెక్నాలజీ, ఐపీ64 ప్రొటెక్షన్ ఉన్నాయి.

The post Vivo T3 Pro 5G: నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-first-sale-from-today-know-the-price-offers/feed/ 0
Vivo T3 Pro 5G: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన వివో టీ3 ప్రో 5జీ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-launched-india-snapdragon-7-gen-3-chipset/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-launched-india-snapdragon-7-gen-3-chipset/#respond Tue, 27 Aug 2024 07:55:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=13181 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo T3 […]

The post Vivo T3 Pro 5G: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన వివో టీ3 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo T3 Pro 5G లాంచ్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G ధర, లభ్యత

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంది.

Vivo T3 Pro 5G ఫోన్ శాండ్‌స్టోన్ ఆరెంజ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కార్డులపై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ని వరుసగా రూ.21,999 మరియు రూ.23,999 కే సొంతం చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్ కాకుండా, రూ.3,000 ఫ్లాట్ ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. అలాగే 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ లో Vivo T3 Pro 5G సేల్ మొదలవుతుంది.

Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Pro 5G లో 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని అంటుటు స్కోర్ 812119 పాయింట్లుగా ఉంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ సాయంతో 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. రెండేళ్ళు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Vivo T3 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Pro 5G లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమ్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, వెట్ టచ్ టెక్నాలజీ, ఐపీ64 ప్రొటెక్షన్ ఉన్నాయి.

The post Vivo T3 Pro 5G: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన వివో టీ3 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-launched-india-snapdragon-7-gen-3-chipset/feed/ 0
Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-india-launch-date-confirmed/#respond Tue, 20 Aug 2024 11:03:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13064 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Pro 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 27వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో టీ3 ప్రో 5జీ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం. […]

The post Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo T3 Pro 5G లాంచ్ ఖరారు
  • ఆగస్టు 27న భారత్ లో విడుదల
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా డివైజ్ సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Pro 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 27వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో టీ3 ప్రో 5జీ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 27వ తేదీన లాంచ్ అవుతోంది.

ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదలవుతుంది. ఇప్పటికే ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో మైక్రోసైట్ ద్వారా దర్శనమిస్తోంది.

కొత్త టీజర్ లో Vivo T3 Pro 5G ఆరెంజ్ కలర్ మరియు 3డీ కర్వ్ అమోలెడ్ డిస్ప్లేతో కనిపిస్తోంది.

బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతోన్న iQOO Z9s Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వివో టీ3 ప్రో 5జీ వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి మరియు అంచనా)

డిస్ప్లే: Vivo T3 Pro 5G లో 3డీ కర్వ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo T3 Pro 5G లో స్నాప్‌డ్రాగన్ చిప్ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్ ఉంటుందని అంచనా.

కెమెరా: Vivo T3 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 సెన్సర్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: Vivo T3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 Pro 5G లో ఐపీ64 రేటింగ్ ఉంటుంది. ఇంకా 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-india-launch-date-confirmed/feed/ 0
Vivo T3 Pro 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన వివో టీ3 ప్రో 5జీ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-listed-on-geekbench-know-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-listed-on-geekbench-know-details/#respond Thu, 15 Aug 2024 17:32:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13015 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇప్పటికే Vivo T3 5G కొనుగోలుకి అందుబాటులో ఉంది. మార్చిలో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీనికి సక్సెసర్‌గా Vivo T3 Pro 5G వస్తోంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం. Vivo […]

The post Vivo T3 Pro 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన వివో టీ3 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 Pro 5G లాంచ్
  • మోడల్ నంబర్ V2404
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇప్పటికే Vivo T3 5G కొనుగోలుకి అందుబాటులో ఉంది. మార్చిలో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీనికి సక్సెసర్‌గా Vivo T3 Pro 5G వస్తోంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు

Vivo T3 Pro 5G డివైజ్ గీక్‌బెంచ్ పై V2404 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. సింగిల్-కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1147 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 3117 పాయింట్లు స్కోర్ చేసింది. మేం జరిపిన టెస్టింగ్ లో Vivo T3 Pro 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1188 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2652 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo T3 Pro 5G లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

కెమెరా: Vivo T3 Pro 5G లో 50ఎంపి సోని సెన్సర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బ్యాటరీ: Vivo T3 Pro 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుందని సమాచారం.

The post Vivo T3 Pro 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన వివో టీ3 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-listed-on-geekbench-know-details/feed/ 0