Vivo T3 Pro vs iQOO Z9s Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 31 Aug 2024 07:46:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo T3 Pro vs iQOO Z9s Pro: రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్? https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-iqoo-z9s-pro-comparison-which-is-better-option/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-iqoo-z9s-pro-comparison-which-is-better-option/#respond Fri, 30 Aug 2024 17:31:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=13266 గతేడాది లాంచైన వివో టీ2 ప్రో కి సక్సెసర్ గా Vivo T3 Pro భారత్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. మరోవైపు, దీనికి పోటీగా iQOO Z9s Pro రంగంలోకి దిగింది. ఈ ఆర్టికల్ లో మేం Vivo T3 Pro ని iQOO Z9s Pro తో ప్రతీ విభాగంలో పోల్చి చూసి, ఒకవేళ మీ బడ్జెట్ రూ.25,000 లోపు అయితే, రెండింట్లో ఏది మీకు బెటర్ […]

The post Vivo T3 Pro vs iQOO Z9s Pro: రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్? first appeared on 91Mobiles Telugu.

]]>

గతేడాది లాంచైన వివో టీ2 ప్రో కి సక్సెసర్ గా Vivo T3 Pro భారత్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. మరోవైపు, దీనికి పోటీగా iQOO Z9s Pro రంగంలోకి దిగింది. ఈ ఆర్టికల్ లో మేం Vivo T3 Pro ని iQOO Z9s Pro తో ప్రతీ విభాగంలో పోల్చి చూసి, ఒకవేళ మీ బడ్జెట్ రూ.25,000 లోపు అయితే, రెండింట్లో ఏది మీకు బెటర్ అనే విషయం తెలియజేస్తాం. కాబట్టి, మీరు ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదివి అన్ని వివరాలను తెలుసుకోండి.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ వివో టీ3 ప్రో ఐకూ జెడ్9ఎస్ ప్రో
డిస్ప్లే 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 388పీపీఐ, 1080×2392 రెజుల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, షాట్ జెన్సేషన్ 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 388 పీపీఐ, 1080×2392 రెజుల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, షాట్ జెన్సేషన్
చుట్టుకొలత 163.7 x 75 x 7.9 మిల్లీమీటర్లు 163.7 x 75 x 7.9 మిల్లీమీటర్లు
బరువు 184/190 గ్రాములు 184/190 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ 14 ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ 14
రియర్ కెమెరా 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్
ఫ్రంట్ కెమెరా 16ఎంపి కెమెరా 16ఎంపి కెమెరా
వీడియో 4కే/30ఎఫ్‌పీఎస్ 4కే/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
బ్యాటరీ, చార్జింగ్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్
స్టోరేజీ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ
కలర్స్ శాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ ఫ్లాంబాయంట్ ఆరెంజ్, లక్స్ మార్బుల్

 

Vivo T3 Pro vs iQOO Z9s Pro: భారత్‌లో ధర

వివో టీ3 ప్రో ఐకూ జెడ్9ఎస్ ప్రో
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999
12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999

 

Vivo T3 Pro vs iQOO Z9s Pro: డిజైన్

వివో టీ3 ప్రో మరియు ఐకూ జెడ్9ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్లు ఐడెంటికల్ డిజైన్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా కర్వ్డ్ బాడీ, మెటల్ ఫ్రేమ్ తో వచ్చాయి. రియర్ ప్యానెల్ పై స్క్వేర్ కెమెరా ఐల్యాండ్ ఉంటుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో కర్వ్డ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

వివో టీ3 ప్రో మరియు ఐకూ జెడ్9ఎస్ ప్రో ఫోన్ల యొక్క బ్యాక్ ప్యానెల్ వీగన్ లెదర్ తో తయారైంది. ఆరెంజ్ కలర్ లో గోల్డ్ ఫ్రేమ్ తో వచ్చింది.

ఐకూ జెడ్9ఎస్ ప్రో డివైజ్ ఫ్లాంబాయంట్ ఆరెంజ్, లక్స్ మార్బుల్ కలర్స్ లో లభిస్తుంది. మరోవైపు, వివో టీ3 ప్రో శాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: డిస్ప్లే

వివో టీ3 ప్రో మరియు ఐకూ జెడ్ 9ఎస్ ప్రో ఫోన్లు దాదాపుగా ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, షాట్ జెన్సేషన్ గ్లాస్ ఉన్నాయి.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: పెర్ఫామెన్స్

ఈ రెండు ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. అయితే ఇక్కడ వివో టీ3 ప్రో పై ఐకూ జెడ్9ఎస్ ప్రో కి ఉన్న ఒక అడ్వాంటేజీ ఉంది. అదే ర్యామ్ కెపాసిటీ. ఐకూ జెడ్9ఎస్ ప్రో డివైజ్ 12జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో వచ్చింది. కానీ, వివో టీ3 ప్రో మాత్రం 8జిబి ర్యామ్ ఆప్షన్ ని ఆఫర్ చేస్తుంది.

మేం జరిపిన టెస్టింగ్ లో, ఏయే ఫోన్లు ఎంత స్కోర్ చేశాయో క్రింద అందించాం. ఓసారి చూడండి.

టెస్ట్ పేరు వివో టీ3 ప్రో ఐకూ జెడ్9ఎస్ ప్రో
అంటుటు 8,12,119 8,03,223
గీక్‌బెంచ్ సింగిల్-కోర్ 1,147 1,131
గీక్‌బెంచ్ మల్టీ-కోర్ 3,117 3,074

Vivo T3 Pro vs iQOO Z9s Pro: కెమెరాలు

కెమెరా విభాగంలో, రెండు ఫోన్లు కూడా ఒకే విధమైన కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్లలో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ వాడారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్లలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రెండు ఫోన్లలో ఏ ఫోన్‌ని మీరు ఎంచుకున్నా సరే, మీకు ఒకే విధమైన ఫోటోగ్రఫీ ఫలితాలు వస్తాయి.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: బ్యాటరీ, చార్జింగ్

ఈ రెండు ఫోన్లలో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. కానీ, మా టెస్టింగ్ లో పెర్ఫామెన్స్ విషయంలో చాలా తేడా ఉంది. ఆ వివరాలు చూద్దాం.

వివో టీ3 ప్రో మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 15 గంటల, 52 నిమిషాల వరకు పని చేసింది. మరోవైపు, ఐకూ జెడ్9ఎస్ ప్రో డివైజ్ 14 గంటల, 22 నిమిషాల వరకు పని చేసింది.

చార్జింగ్ విషయానికి వస్తే, వివో టీ3 ప్రో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాల సమయం తీసుకుంది. మరోవైపు, ఐకూ జెడ్9ఎస్ ప్రో కి 39 నిమిషాల సమయం పట్టింది.

వివో టీ3 ప్రో లో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియో చూస్తే, 2 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. మరోవైపు, ఐకూ జెడ్9ఎస్ లో 3 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది.

Vivo T3 Pro vs iQOO Z9s Pro: సాఫ్ట్‌వేర్

రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. ఈ రెండు ఫోన్లకు రెండేళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. అంటే ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 వరకు అప్డేట్స్ పొందుతాయి.

రెండు ఫోన్లు 45 ప్రీ-ఇన్‌స్టాల్డ్ థర్డ్-పార్టీ యాప్స్ తో వస్తున్నాయి. మీరు గనుక వీటిని వద్దనుకుంటే, రిమూవ్ చేసుకోవచ్చు. ఇకపోతే, వివో టీ3 ప్రో మరియు ఐకూ జెడ్9ఎస్ ప్రో ఫోన్లు ఏఐ ఫీచర్స్ తో వచ్చాయి. ఇందులో భాగంగా, ఏఐ ఫోటో ఎన్హాన్స్, ఏఐ ఎరేజ్ ఫీచర్లను అందించారు.

ఏది బెటర్?

Vivo T3 Pro, iQOO Z9s Pro ఫోన్లను పోల్చి చూశాక, రెండు ఫోన్లు కూడా ప్రతీ విభాగంలో ఒకే విధమైన పెర్ఫామెన్స్ చూపించాయి. అయితే, రెండు ఫోన్లలో కొన్ని ముఖ్యమూన తేడాలు ఉన్నాయి.

వివో టీ3 ప్రో యొక్క బ్యాటరీ మరియు పెర్ఫామెన్స్ యొక్క బెంచ్‌మార్క్ రిజల్ట్స్, ఐకూ జెడ్9ఎస్ ప్రో కంటే బాగున్నాయి. మరోవైపు, ఐకూ జెడ్9ఎస్ ప్రో ఎక్కువ ర్యామ్ ఆప్షన్స్ ఆఫర్ చేస్తోంది. వివో టీ3 ప్రో కంటే తక్కువ సమయంలో ఐకూ జెడ్9ఎస్ ప్రో బ్యాటరీ చార్జ్ అవుతుంది.

మీకు గనుక పెర్ఫామెన్స్, బ్యాటరీ లైఫ్ ముఖ్యమైతే వివో టీ3 ప్రో ఎంచుకోండి. కానీ, ఎక్కువ ర్యామ్ మరియు త్వరగా ఫోన్ చార్జ్ అవ్వాలంటే ఐకూ జెడ్9ఎస్ ప్రో ఎంపిక చేసుకోండి.

The post Vivo T3 Pro vs iQOO Z9s Pro: రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-iqoo-z9s-pro-comparison-which-is-better-option/feed/ 0