Vivo TWS 3e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 04 Dec 2023 10:14:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-s18-series-china-launch-date-confirmed/ Mon, 04 Dec 2023 10:10:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=9094 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి Vivo S18 సిరీస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Vivo S18 లైనప్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 14 వ తేదీన Vivo S18 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18e Vivo S18 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. […]

The post Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo S18 సిరీస్
  • డిసెంబర్ 14 న ఎంట్రీ ఇవ్వనున్న Vivo S18
  • Vivo S18 తో పాటు లాంచ్ కానున్న Vivo TWS 3e

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి Vivo S18 సిరీస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Vivo S18 లైనప్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 14 వ తేదీన Vivo S18 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18e Vivo S18 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ

 

  • Vivo S18 సిరీస్ డిసెంబర్ 14 వ తేదీన చైనాలో లాంచ్ కానుందని వివో సంస్థ వెల్లడించింది.
  • సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా డిసెంబర్ 14 న మధ్యాహ్నం 2 గంటల నుంచి Vivo S18 సిరీస్ లాంచ్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
  • ఇప్పటికే Vivo S18 సిరీస్ ప్రీ-బుకింగ్స్ టీమాల్, జేడి.కామ్ పై మొదలయ్యాయి.
  • ఇంకా Vivo S18 సిరీస్ ఈవెంట్ లో Vivo TWS 3e కూడా లాంచ్ కానుందని సమాచారం.

Vivo S18 స్పెసిఫికేషన్స్

Vivo S18 సిరీస్ బ్యాటరీ మరియు చిప్సెట్ వివరాలు జేడీ.కామ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.

  • చిప్సెట్: Vivo S18 సిరీస్ లోని ప్రో వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎంపీ11 జీపీయూ ని ఈ చిప్సెట్ తో జత చేశారు. స్టాండర్డ్ వేరియంట్ Vivo S18 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo S18 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo S18 Pro డివైజ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్ 920 సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, ఒక టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు వివో చైనా ప్రెసిడెంట్ తెలిపారు. Vivo S18 Pro లో డ్యూయల్ సాఫ్ట్ లైట్ గల 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Vivo S18 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>