Vivo V25 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 15 Sep 2022 08:33:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Dimensity 900 చిప్, 50MP కెమెరా, 44W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Vivo V25: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత https://www.91mobiles.com/telugu/vivo-v25-launched-india-price-specs-availability/ Thu, 15 Sep 2022 08:32:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=2354 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన Vivo V25, నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 900, 50ఎంపి సెల్ఫీ సెన్సర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు భారత్ లో Vivo V25 ధర రూ.27,999 నుంచి ప్రారంభం భారత్ లో Vivo V25 లాంచ్ అయ్యింది. ఇది వీ-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్. ఇటీవలె […]

The post Dimensity 900 చిప్, 50MP కెమెరా, 44W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Vivo V25: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Vivo V25, నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 900, 50ఎంపి సెల్ఫీ సెన్సర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో Vivo V25 ధర రూ.27,999 నుంచి ప్రారంభం

భారత్ లో Vivo V25 లాంచ్ అయ్యింది. ఇది వీ-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్. ఇటీవలె వివో నుంచి వివో వీ25 ప్రో ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. Vivo V25 విషయానికి వస్తే, ఇందులో వాటర్ డ్రాప్ నాచ్, సెల్ఫీ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ట్రిపుల్ రియర్ కెమెరా, యూనిక్ గ్రేడియంట్ డిజైన్ ఉన్నాయి.

Vivo V25 ఫోన్ కలర్ చేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. వివో వీ25 ప్రో లో కూడా ఇలాంటి బ్యాక్ ప్యానెల్ ని మనం చూశాం. Vivo V25 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, 50ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ కలిగి ఉంది. భారత్ లో Vivo V25 ధర, ప్రీ-బుకింగ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

భారత్ లో Vivo V25 ధర, ప్రీ-బుకింగ్ వివరాలు

Vivo V25 8జిబి + 128జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది. 12జిబి + 256జిబి ధర రూ.31,999 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్సెట్ సర్ఫింగ్ బ్లూ, ఎలిగెంట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో వస్తోంది. Vivo V25 ఫోన్ ని ఫ్లిప్ కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్, వివో వెబ్ సైట్ ద్వారా నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ఫోన్ ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అదనంగా రూ.2,000 డిస్కౌంట్ కూడా లభించనుంది.

Vivo V25 సేల్ డేట్ ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అదే తేదీ నుంచి Vivo V25 సేల్ కి వచ్చే అవకాశం ఉంది.

Vivo V25 స్పెసిఫికేషన్స్

Vivo V25 లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, మెమొరీ ఎక్స్‌పాన్షన్ వయా ఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్ టచ్ 12 కస్టమ్ స్కిన్, 8జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo V25 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Vivo V25 లో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. రియర్ కెమెరాలో నైట్ మోడ్, పొట్రెయిట్, సూపర్-మ్యాక్రో, హై రెజుల్యూషన్, పనోరమా, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్-లాప్స్, ప్రో, ఏఆర్ స్టికర్స్, వ్లాగ్ మోడ్, డాక్యుమెంట్స్, డబుల్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

The post Dimensity 900 చిప్, 50MP కెమెరా, 44W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Vivo V25: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V25 5G, V25e 4G గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v25-v25e-live-images-design-revealed/ Sat, 13 Aug 2022 16:14:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=1667 హైలైట్స్: లీకైన వివో వీ25, వివో వీ25ఈ లైవ్ ఇమేజెస్, రియర్ డిజైన్ ట్రిపుల్ కెమెరాలు, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో రానున్న ఫోన్స్? ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న వివో వీ25 స్మార్ట్ ఫోన్ ఆగస్టు 17 న వివో వీ25, వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో సిద్ధమవుతోంది. వీటిని భారత్ తో పాటు గ్లోబల్ గా కూడా లాంచ్ చేయాలని […]

The post లీకైన Vivo V25 5G, V25e 4G గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన వివో వీ25, వివో వీ25ఈ లైవ్ ఇమేజెస్, రియర్ డిజైన్
  • ట్రిపుల్ కెమెరాలు, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో రానున్న ఫోన్స్?
  • ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న వివో వీ25 స్మార్ట్ ఫోన్

ఆగస్టు 17 న వివో వీ25, వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో సిద్ధమవుతోంది. వీటిని భారత్ తో పాటు గ్లోబల్ గా కూడా లాంచ్ చేయాలని వివో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే వీటితో పాటు, వివో వీ25ఈ అనే మోడల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఓ వైపు లాంచ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో, వివో వీ25, వివో వీ25ఈ ఫోన్స్ యొక్క లైవ్ ఇమేజెస్ ని టిప్ స్టర్ పారస్ గుగ్లాని సాయంతో 91మొబైల్స్ బయటకు తీసుకొచ్చింది. ఇక వీటిలో వివో వీ25ఈ 4జీ ఎల్టీఈ మోడల్ అని తెలుస్తోంది.

వివో కంపెనీ వీ25ఈ మోడల్ ని భారత్ లో లాంచ్ చేస్తుందో లేదో ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ ఫోన్ కి సంబంధించి ఎటువంటి రూమర్లు వినిపించడం లేదు. ఊహాగానాలను బట్టి, ఇది 4జీ వేరియంట్ అని తెలుస్తున్న కారణంగా, వీ25 సిరీస్ లో ఇదే తక్కువ ధర కలిగిన మోడల్ అని స్పష్టమవుతోంది.

Vivo V25, Vivo V25e డిజైన్

 

వివో వీ25 ఫోన్ సన్‌రైజ్ గోల్డ్, డైమండ్ బ్లాక్ రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక వివో వీ25ఈ ఆరెంజ్, బ్లాక్ కలర్స్ ఆప్షన్స్ లో దొరుకుతుంది. బయట నుంచి చూస్తే రెండు ఫోన్లు కూడా ఒకే రకమైన డిజైన్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. హార్డ్‌వేర్ లో ఏమైనా మార్పులు ఉండే అవకాశముంది. వివో వీ25 ఫోన్ యొక్క సన్‌రైజ్ గోల్డ్ ఆప్షన్ కలర్-చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉండే అవకాశముంది. వివో వీ23 సిరీస్ లో కూడా ఈ కలర్-చేంజింగ్ ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే.

వివో వీ25, వివో వీ25ఈ ఫోన్స్ రెండూ ఒకే రకమైన డిజైన్ లాంగ్వేజ్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై ఒక భారీ కెమెరా ఐల్యాండ్, ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రెండు ఫోన్లలో లెన్స్ అమరిక ఒకే విధంగా ఉంది. అయితే ఫ్రంట్ డిజైన్ కి సంబంధించిన వివరాలు ఏమీ తెలియలేదు. అయితే ఊహాగానాలను బట్టి, ఈ ఫోన్లు పంచ్-హోల్ కటౌట్, నాచ్ ఉండే అవకాశముంది. నాచ్ లో రెండు కెమెరాలు ఉంటాయని అంచనా.

Vivo V25 స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రస్తుతం వివో వీ25ఈ గురించి ఎక్కువగా వివరాలు బయటకు రాలేదు. కానీ వివో వీ25 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. అవేంటో చూద్దాం పదండి. ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, 8జిబి ర్యామ్, 64ఎంపి ప్రైమరీ కెమెరా (ఓఐఎస్), అల్ట్రావైడ్ కెమెరా, డెప్త్ సెన్సర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వివో వీ25 లో ఉండే అవకాశముంది.

The post లీకైన Vivo V25 5G, V25e 4G గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V25 ఫస్ట్ లుక్ ని టీజ్ చేసిన విరాట్ కోహ్లీ https://www.91mobiles.com/telugu/vivo-v25-teased-by-virat-launch-likely-in-august/ Wed, 27 Jul 2022 11:48:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=1291 హైలైట్స్: వివో వీ25 ని టీజ్ చేసిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ విరాట్ చేతిలో కనిపించిన దాన్ని బట్టి, నీలం రంగులో, డ్యూయల్ కెమెరాలతో కనిపిస్తోన్న వివో వీ25 ఆగస్టు 18 న భారత్ లో లాంచ్ కానున్న వివో వీ25 గతేడాది వివో వీ23 లాంచ్ చేసిన వివో, త్వరలో భారత్ లో వివో వీ25 ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ ఉండనున్నాయి. అవి […]

The post Vivo V25 ఫస్ట్ లుక్ ని టీజ్ చేసిన విరాట్ కోహ్లీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • వివో వీ25 ని టీజ్ చేసిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ
  • విరాట్ చేతిలో కనిపించిన దాన్ని బట్టి, నీలం రంగులో, డ్యూయల్ కెమెరాలతో కనిపిస్తోన్న వివో వీ25
  • ఆగస్టు 18 న భారత్ లో లాంచ్ కానున్న వివో వీ25

గతేడాది వివో వీ23 లాంచ్ చేసిన వివో, త్వరలో భారత్ లో వివో వీ25 ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ ఉండనున్నాయి. అవి వివో వీ25, వివో వీ25ఈ మరియు వివో వీ25 ప్రో. వచ్చే నెలలో స్టాండర్డ్ వేరియంట్ వివో వీ25 భారత్ లో లాంచ్ అవ్వనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. సరిగ్గా చెప్పాలంటే, ఆగస్టు 18 న లాంచ్ ఉంటుందని ప్రముఖ టిప్ స్టర్ యోగేశ్ బ్రార్ చెప్పాడు. ఇక మనం అనౌన్స్ మెంట్ కోసం వేచి చూస్తున్న సమయంలో, వివో వీ25 సడెన్ గా ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది.

వివో వీ25 ఫోన్ కనిపించింది ఏకంగా, విరాట్ కోహ్లీ చేతిలోనే. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండీ “మై ఫేవరెట్ షేడ్ ఆప్ బ్లూ” అని విరాట్ ఆ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. వివో వీ25 ని వాడుతూ తాను తీసుకున్న ఫోటోను విరాట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇంక అంతే, వివో వీ25 అన్ అఫీషియల్ గా భారత్ లో ఎంట్రీ ఇచ్చినట్లైంది.

బయటపడిన Vivo V25 బ్యాక్ ప్యానెల్

వివో వీ25 ఫోన్ విరాట్ కోహ్లీ చేతిలో కనిపించింది. విరాట్ చేతిలో కనిపిస్తోన్న ఫోన్ రంగు బ్లూ షేడ్ కలిగి ఉంది. విరాట్ చేతిలో ఉన్నప్పుడు ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ మనకు కనిపిస్తోంది. చూస్తుంటే, ఫోన్ లుక్ వివో ఎస్15 ప్రో ని పోలి ఉంది. వివో ఎస్ 15 ప్రో కొన్ని నెలల క్రితం చైనాలో లాంచ్ అయ్యింది. వివో వీ25 ఫోన్ వివో ఎస్15 ప్రో కి రీబ్రాండ్ అని తెలుస్తోంది. ఎందుకంటే, వివో వీ12 మరియు వివో వీ12 ప్రో కూడా వివో వీ23, వివో వీ23 ప్రో గా రీబ్రాండ్ అయి వచ్చాయి.

Vivo S15 Pro స్పెసిఫికేషన్స్

వివో వీ25, వివో ఎస్15 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ కాబట్టి ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశముంది. 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ బైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉండనున్నాయి.

ఈ హ్యాండ్సెట్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోందని అంచనా. ఇక ఇప్పుడు కెమెరా విభాగం పై ఓ కన్నేద్దాం. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే 12ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో ముందు వైపున 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ డివైజ్ లో స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

The post Vivo V25 ఫస్ట్ లుక్ ని టీజ్ చేసిన విరాట్ కోహ్లీ first appeared on 91Mobiles Telugu.

]]>