Vivo V25e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 Aug 2022 11:02:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Helio G99 చిప్సెట్, 64MP కెమెరాతో లాంచ్ అయిన Vivo V25e స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-v25e-launched-price-specs/ Tue, 30 Aug 2022 11:02:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=2011 హైలైట్స్: అఫీషియల్ గా లాంచ్ అయిన Vivo V25e స్మార్ట్ ఫోన్ 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ ఓఎస్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు Vivo V25e ధర RM 1,399 (దాదాపు రూ.25,000) భారత్ లో వివో వీ25 ప్రో లాంచ్ చేశాక, వివో కంపెనీ Vivo V25e ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. ప్రో […]

The post MediaTek Helio G99 చిప్సెట్, 64MP కెమెరాతో లాంచ్ అయిన Vivo V25e స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అఫీషియల్ గా లాంచ్ అయిన Vivo V25e స్మార్ట్ ఫోన్
  • 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ ఓఎస్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • Vivo V25e ధర RM 1,399 (దాదాపు రూ.25,000)

భారత్ లో వివో వీ25 ప్రో లాంచ్ చేశాక, వివో కంపెనీ Vivo V25e ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. ప్రో మోడల్ కంటే తక్కువ లెవెల్ ఫోన్ ఈ Vivo V25e. ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. Vivo V25e బ్యాక్ ప్యానెల్ గ్రేడియంట్ డిజైన్ తో వస్తోంది. దీంతో ఫోన్ లుక్ చాలా బాగుంది.

Vivo V25e లో 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo V25e ధర, స్పెసిఫికేషన్స్

Vivo V25e ధర RM 1,399 గా ఉంది. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.25,000. ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియాలో అందుబాటులో ఉంది. త్వరలో గ్లోబల్ గా అందుబాటులోకి రానుంది. ఇప్పుడు కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సన్‌లైట్ గోల్డ్, డైమండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Vivo V25e లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, హెచ్డీఆర్ 10+, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo V25e ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్భీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. కాగా ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ని అమర్చారు. Vivo V25e స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు. ఇప్పుడు బ్యాటరీ విభాగం పై కన్నేద్దాం. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo V25e లో ఓఐఎస్ తో కూడిన 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. 2 ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో ముందు వైపున 32 ఎంపి కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ పొడవు 159.20 ఎంఎం, వెడల్పు 74.20 ఎంఎం, మందం 7.79 ఎంఎం. కాగా ఈ ఫోన్ బరువు 183 గ్రాములు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post MediaTek Helio G99 చిప్సెట్, 64MP కెమెరాతో లాంచ్ అయిన Vivo V25e స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Vivo V25e స్పెసిఫికేషన్స్, రెండర్స్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v25e-specs-renders-leaked-before-launch/ Fri, 19 Aug 2022 05:31:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=1775 హైలైట్స్: నెట్టింట్లో ప్రత్యక్షమైన వివో వీ25ఈ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో రానున్న వివో వీ25ఈ వివో వీ25ఈ కి సంబంధించిన ఒక కొత్త లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా ఫోన్ యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్ బయటకు […]

The post లాంచ్ కి ముందు లీకైన Vivo V25e స్పెసిఫికేషన్స్, రెండర్స్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన వివో వీ25ఈ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్
  • 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో రానున్న వివో వీ25ఈ

వివో వీ25ఈ కి సంబంధించిన ఒక కొత్త లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా ఫోన్ యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. వివో వీ25 5జీ, వివో వీ25ఈ లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చిన కొన్ని రోజులకే తాజా లీక్ బయటకు వచ్చింది. మరోవైపు వివో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో వీ25 ప్రో ని భారత్ లో లాంచ్ చేసింది. ఇంకా వీ25 సిరీస్ ఫోన్స్ రావాల్సి ఉంది. ఈలోపు, 91మొబైల్స్ హిందీ వివో వీ25ఈ కి సంబంధించిన రెండర్స్, క్రిటికల్ స్పెసిఫికేషన్స్ ను టిప్ స్టర్ సుదాన్శు అంభోరే సాయంతో వెలికి తీసింది.

అయితే వివో వీ25ఈ స్మార్ట్ ఫోన్ యొక్క భారత ఎంట్రీ పై సదరు కంపెనీ ఇంకా మౌనంగానే ఉంది. కానీ, వచ్చే నెలలో ఫోన్ భారత గడ్డపై అడుగు పెట్టనున్నట్లు అంచనా వేస్తున్నారు. మరి త్వరలో భారత్ లో లాంచ్ కానున్న వివో వీ25ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం పదండి.

Vivo V25e డిజైన్, కలర్ ఆప్షన్స్ (లీక్డ్)

 

లీక్ ని బట్టి, వివో వీ25ఈ స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. అవి: బంగారు వర్ణం, నలుపు రంగు. ఇక డిజైన్ విశేషాలను చూస్తే, వివో వీ25ఈ లో వాటర్ డ్రాప్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్, ఫోన్ వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ తో కూడిన భారీ యూనిట్, ఎల్ఈడీ ఫ్లాష్, బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో వివో బ్రాండింగ్ ఉన్నాయి. వివో వీ25ఈ చూడటానికి వివో వీ25 మాదిరి కనిపిస్తోంది. వెనుక నుంచైతే ఇది మరింత సమానమైన పోలికలను కలిగి ఉంది.

Vivo V25e Specs

  • 64ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, ఓఐఎస్ సపోర్ట్
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 64ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ వివో వీ25ఈ స్మార్ట్ ఫోన్లో ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ని ఈ ఫోన్లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. అయితే, వివో వీ25ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియదు. త్వరలోనే ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. అప్పుడు స్పెసిఫికేషన్స్ పై పూర్తి స్పష్టత వస్తుంది.

The post లాంచ్ కి ముందు లీకైన Vivo V25e స్పెసిఫికేషన్స్, రెండర్స్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V25 5G, V25e 4G గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v25-v25e-live-images-design-revealed/ Sat, 13 Aug 2022 16:14:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=1667 హైలైట్స్: లీకైన వివో వీ25, వివో వీ25ఈ లైవ్ ఇమేజెస్, రియర్ డిజైన్ ట్రిపుల్ కెమెరాలు, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో రానున్న ఫోన్స్? ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న వివో వీ25 స్మార్ట్ ఫోన్ ఆగస్టు 17 న వివో వీ25, వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో సిద్ధమవుతోంది. వీటిని భారత్ తో పాటు గ్లోబల్ గా కూడా లాంచ్ చేయాలని […]

The post లీకైన Vivo V25 5G, V25e 4G గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన వివో వీ25, వివో వీ25ఈ లైవ్ ఇమేజెస్, రియర్ డిజైన్
  • ట్రిపుల్ కెమెరాలు, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో రానున్న ఫోన్స్?
  • ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న వివో వీ25 స్మార్ట్ ఫోన్

ఆగస్టు 17 న వివో వీ25, వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో సిద్ధమవుతోంది. వీటిని భారత్ తో పాటు గ్లోబల్ గా కూడా లాంచ్ చేయాలని వివో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే వీటితో పాటు, వివో వీ25ఈ అనే మోడల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఓ వైపు లాంచ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో, వివో వీ25, వివో వీ25ఈ ఫోన్స్ యొక్క లైవ్ ఇమేజెస్ ని టిప్ స్టర్ పారస్ గుగ్లాని సాయంతో 91మొబైల్స్ బయటకు తీసుకొచ్చింది. ఇక వీటిలో వివో వీ25ఈ 4జీ ఎల్టీఈ మోడల్ అని తెలుస్తోంది.

వివో కంపెనీ వీ25ఈ మోడల్ ని భారత్ లో లాంచ్ చేస్తుందో లేదో ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ ఫోన్ కి సంబంధించి ఎటువంటి రూమర్లు వినిపించడం లేదు. ఊహాగానాలను బట్టి, ఇది 4జీ వేరియంట్ అని తెలుస్తున్న కారణంగా, వీ25 సిరీస్ లో ఇదే తక్కువ ధర కలిగిన మోడల్ అని స్పష్టమవుతోంది.

Vivo V25, Vivo V25e డిజైన్

 

వివో వీ25 ఫోన్ సన్‌రైజ్ గోల్డ్, డైమండ్ బ్లాక్ రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక వివో వీ25ఈ ఆరెంజ్, బ్లాక్ కలర్స్ ఆప్షన్స్ లో దొరుకుతుంది. బయట నుంచి చూస్తే రెండు ఫోన్లు కూడా ఒకే రకమైన డిజైన్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. హార్డ్‌వేర్ లో ఏమైనా మార్పులు ఉండే అవకాశముంది. వివో వీ25 ఫోన్ యొక్క సన్‌రైజ్ గోల్డ్ ఆప్షన్ కలర్-చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉండే అవకాశముంది. వివో వీ23 సిరీస్ లో కూడా ఈ కలర్-చేంజింగ్ ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే.

వివో వీ25, వివో వీ25ఈ ఫోన్స్ రెండూ ఒకే రకమైన డిజైన్ లాంగ్వేజ్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై ఒక భారీ కెమెరా ఐల్యాండ్, ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రెండు ఫోన్లలో లెన్స్ అమరిక ఒకే విధంగా ఉంది. అయితే ఫ్రంట్ డిజైన్ కి సంబంధించిన వివరాలు ఏమీ తెలియలేదు. అయితే ఊహాగానాలను బట్టి, ఈ ఫోన్లు పంచ్-హోల్ కటౌట్, నాచ్ ఉండే అవకాశముంది. నాచ్ లో రెండు కెమెరాలు ఉంటాయని అంచనా.

Vivo V25 స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రస్తుతం వివో వీ25ఈ గురించి ఎక్కువగా వివరాలు బయటకు రాలేదు. కానీ వివో వీ25 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. అవేంటో చూద్దాం పదండి. ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, 8జిబి ర్యామ్, 64ఎంపి ప్రైమరీ కెమెరా (ఓఐఎస్), అల్ట్రావైడ్ కెమెరా, డెప్త్ సెన్సర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వివో వీ25 లో ఉండే అవకాశముంది.

The post లీకైన Vivo V25 5G, V25e 4G గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>