Vivo V40e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Sep 2024 08:45:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/#respond Wed, 25 Sep 2024 08:45:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=13735 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ భారత్ లో విడుదలైంది. ఈ ఫోన్ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 16జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7300 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo […]

The post Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Vivo V40e విడుదల
  • డైమెన్సిటీ 7300 చిప్సెట్
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ భారత్ లో విడుదలైంది. ఈ ఫోన్ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 16జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7300 చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40e ధర, లభ్యత

Vivo V40e స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.28,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.30,999 గా పెట్టారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికార వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్‌కి వస్తోంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ పై 10 శాతం డిస్కౌంట్ లేదా 10 శాతం ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు. అంతేకాదు, 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

Vivo V40e డిజైన్

Vivo V40e స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, ఆరా లైట్ ఉన్నాయి. ముందువైపు 3డీ కర్వ్డ్ డిజైన్ ఉంది. ఈ ఫోన్ 0.749 సెంటీమీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ రాయల్ బ్రాంజ్ మరియు మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo V40e స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40e లో 6.77-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ ట్రూ కలర్స్, 2392*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 93.3% స్క్రీన్ టు బాడీ రేషియో, 8,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

చిప్సెట్: Vivo V40e స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40e స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo V40e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ప్రొఫెషనల్ నైట్ పొట్రెయిట్ ఓఐఎస్+ఈఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఐ ఏఎఫ్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo V40e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo V40e స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Vivo V40e: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-launched-india-50mp-camera-8gb-ram/feed/ 0
Vivo V40e భారత్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-date-confirmed-via-teaser/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-date-confirmed-via-teaser/#respond Fri, 20 Sep 2024 08:58:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=13649 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలవుతుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఫోన్ భారతగడ్డపై అడుగుపెట్టనుంది. కాగా, ఇప్పటికే వీ సిరీస్ లో వివో వీ40, వీ40 ప్రో లాంచ్ అయ్యాయి. ఈ లైనప్ లో […]

The post Vivo V40e భారత్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40e విడుదల
  • సెప్టెంబర్ 25న అఫీషియల్ లాంచ్
  • టీజర్ విడుదల చేసిన కంపెనీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలవుతుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఫోన్ భారతగడ్డపై అడుగుపెట్టనుంది. కాగా, ఇప్పటికే వీ సిరీస్ లో వివో వీ40, వీ40 ప్రో లాంచ్ అయ్యాయి. ఈ లైనప్ లో Vivo V40e మూడవ ఫోన్.

Vivo V40e భారత మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు

Vivo V40e స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోయే తేదీని కంపెనీ టీజర్ ద్వారా ప్రకటించింది.

Vivo V40e డివైజ్ సెప్టెంబర్ 25వ తేదీన లాంచ్ అవుతుందని టీజర్ లో కంపెనీ పేర్కొంది.

ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Vivo V40e సేల్ కి రానుంది. గతంలో వివో వీ30ఈ కూడా ఇదే వేదిక ద్వారా అమ్మకానికి వచ్చింది.

Vivo V40e డిజైన్

Vivo V40e స్మార్ట్‌ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్ మైక్రోసైట్ ద్వారా తెలిసాయి. రాయల్ బ్రాంజ్ మరియు మింట్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. వీటితో పాటు ఆరా లైట్ ఎల్ఈడీ ఉంటుంది.

Vivo V40e ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, 3డీ కర్వ్డ్ డిజైన్ అందించారు. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ 0.749 సెంటీమీటర్ల మందం ఉంటుందని తెలుస్తోంది. అలాగే బరువు 183 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V40e డివైజ్ గత మోడల్ తో పోల్చితే డిఫరెంట్ డిజైన్ కలిగి ఉంటుంది. గత మోడల్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉండేది.

Vivo V40e స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

డిస్ప్లే: Vivo V40e లో 6.77-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ ట్రూ కలర్స్, 2392*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 93.3 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 8,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉంటాయి.

కెమెరా: Vivo V40e లో 50ఎంపి సోని ఓఐఎస్ ప్రొటెయిట్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఐ ఏఎఫ్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై ఆరా లైట్ కూడా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo V40e స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V40e స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post Vivo V40e భారత్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-date-confirmed-via-teaser/feed/ 0
Vivo V40e: లీకైన వివో వీ40 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-timeline-key-specs-design-leaked/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-timeline-key-specs-design-leaked/#respond Mon, 16 Sep 2024 06:06:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13495 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ40-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఇప్పటికే V40, V40 Pro ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo V40e కూడా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇదివరకే ఈ ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా, వివో వీ40ఈ యొక్క లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Vivo […]

The post Vivo V40e: లీకైన వివో వీ40 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40e విడుదల
  • సెప్టెంబర్ ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ40-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఇప్పటికే V40, V40 Pro ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo V40e కూడా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇదివరకే ఈ ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా, వివో వీ40ఈ యొక్క లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo V40e లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Vivo V40e యొక్క ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని MySmartPrice వెబ్‌సైట్ రివీల్ చేసింది.

లీక్ ప్రకారం, Vivo V40e డివైజ్ సెప్టెంబర్ ఆఖర్లో లాంచ్ అవుతుందని సమాచారం. ఇంకా డివైజ్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు.

Vivo V40e డిజైన్ (లీక్)

లీకైన Vivo V40e స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ ను గమనిస్తే, రాయల్ బ్రాంజ్ కలర్ లో డివైజ్ కనిపించింది. ఇతర కలర్ వేరియంట్స్ కూడా ఉంటాయి.

డిజైన్ విషయానికి వస్తే, Vivo V40e లో ఓవర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ బ్యాక్ ప్యానెల్ పై ఉంటుంది. ఆరా లైట్ ఎల్ఈడీ కూడా అందిస్తున్నారు.

ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, 3డీ కర్వ్డ్ డిస్ప్లేను ఈ ఫోన్ లో అందించినట్లు అర్థమవుతోంది. ఓవరాల్‌గా, Vivo V40e చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

Vivo V40e స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo V40e లో ఉండే డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు. అయితే ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V40e లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40e డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Vivo V40e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరాలు ఉంటాయి. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40e లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo V40e డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో రానుంది.

The post Vivo V40e: లీకైన వివో వీ40 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-timeline-key-specs-design-leaked/feed/ 0
Vivo V40e: BIS, Geekbench సర్టిఫికేషన్స్ పొందిన వివో వీ40ఈ, త్వరలో భారత్‌లో లాంచ్ https://www.91mobiles.com/telugu/vivo-v40e-received-bis-and-geekbench-certifications-india-launch-soon/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-received-bis-and-geekbench-certifications-india-launch-soon/#respond Mon, 12 Aug 2024 08:33:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=12947 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో వీ40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది. మరోవైపు, బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కూడా Vivo V40e లిస్ట్ […]

The post Vivo V40e: BIS, Geekbench సర్టిఫికేషన్స్ పొందిన వివో వీ40ఈ, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40e విడుదల
  • బీఐఎస్ మోడల్ నంబర్ V2403
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో వీ40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది. మరోవైపు, బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కూడా Vivo V40e లిస్ట్ అయ్యింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo V40e బీఐఎస్ లిస్టింగ్

వివో నుంచి త్వరలో రాబోవు ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ BIS పై V2403 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఐఎంఈఐ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై ఇదే మోడల్ నంబర్ తో Vivo V40e లిస్ట్ అయ్యింది.

V2422 అనే మరో మోడల్ నంబర్ కూడా బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. ఐఎంఈఐ డేటాబేస్ ప్రకారం, ఇది Vivo Y200 Plus 5G అని తెలుస్తోంది.

ఇక, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

బీఐఎస్

Vivo V40e గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo V40e స్మార్ట్‌ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై V2403 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo V40e స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1028 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2938 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo V40e లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. ఈ చిప్‌కు మాలి జీ615 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్ ను జత చేశారు.

గీక్‌బెంచ్‌ వివరాల ప్రకారం, Vivo V40e లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

ఇంకా ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్

Vivo V40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40 5G లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్ (2800*1260 పిక్సెల్స్), అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo V40 5G 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo V40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ జీస్ లెన్స్, ఆరాలైట్ ఫీచర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo V40 5G తో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo V40e: BIS, Geekbench సర్టిఫికేషన్స్ పొందిన వివో వీ40ఈ, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-received-bis-and-geekbench-certifications-india-launch-soon/feed/ 0