Vivo X200 Pro Mini - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Oct 2024 11:39:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/ https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/#respond Mon, 07 Oct 2024 11:29:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=13949 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఎక్స్-సిరీస్ లో తన తదుపరి లైనప్ ను పరిచయం చేయనుంది. Vivo X200 పేరుతో రాబోతున్న ఈ సిరీస్ లో Vivo X200, X200 Pro మరియు X200 Pro Mini అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క చైనా మార్కెట్ ధర, డిజైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం. Vivo X200 […]

The post Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X200 సిరీస్ విడుదల
  • లైనప్‌లో వస్తోన్న Vivo X200, Pro, Pro Mini
  • తాజాగా లీకైన ఎక్స్200 సిరీస్ వివరాలు

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఎక్స్-సిరీస్ లో తన తదుపరి లైనప్ ను పరిచయం చేయనుంది. Vivo X200 పేరుతో రాబోతున్న ఈ సిరీస్ లో Vivo X200, X200 Pro మరియు X200 Pro Mini అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క చైనా మార్కెట్ ధర, డిజైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం.

Vivo X200 ధర (లీక్)

వివో ఎక్స్200 నాలుగు వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 12జిబి+256జిబి వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.47,800) గా ఉంటుంది.

16జిబి+256జిబి వేరియంట్ ధర 4,299 యువాన్లు (సుమారు రూ.51,433) గా ఉంటుందని సమాచారం.

16జిబి+512జిబి మోడల్ ధర 4599 యువాన్లు (సుమారు రూ.55,027) గా ఉంటుంది. 16జిబి+1టిబి వేరియంట్ ధర 5099 యువాన్లు (సుమారు రూ.61,000) గా ఉంటుంది.

Vivo X200 బ్లాక్, వైట్, బ్లూ మరియు టైటానియమ్ వంటి రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Vivo X200 Pro Mini ధర వివరాలు

Vivo X200 Pro Mini డివైజ్ యొక్క 12జిబి+256జిబి మోడల్ ధర 4599 యువాన్లు (సుమారు రూ.55,000), 16జిబి+256జిబి మోడల్ ధరను 4899 యువాన్లుగా ఉంది. దీన్ని భారతీయ కరెన్సీలో రూ.58,000 గా చెప్పవచ్చు. 16జిబి+512జిబి మోడల్ ధర 5199 యువాన్లు (సుమారు రూ.62,201) గా ఉంటుంది.

Vivo X200 Pro Mini డివైజ్ బ్లాక్, వైట్, గ్రీన్ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X200 Pro ధర వివరాలు

Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 16జిబి+256జిబి మోడల్ ధరను 5199 (సుమారు రూ.62,194) గా ఉంటుంది. 16జిబి+512జిబి వేరియంట్ ధర 5499 యువాన్లు (సుమారు రూ.65,783) గా ఉంటుంది.

శాటిలైట్ ఎడిషన్ 16జిబి+512జిబి మోడల్ ధర 5699 యువాన్లు (సుమారు రూ.68,183) గా ఉంటుంది. 16జిబి+1టిబి మోడల్ ధర 6199 యువాన్లు (సుమారు రూ.74,159) గా ఉంటుంది.

Vivo X200 Pro డివైజ్ బ్లాక్, వైట్, బ్లూ మరియు టైటానియమ్ కలర్స్ లో లాంచ్ అవుతుంది.

Vivo X200 సిరీస్ డిజైన్

Vivo X200 Pro Mini డివైజ్ చిన్నగా ఉంటుంది. ఇక అన్ని వేరియంట్స్ లో రియర్ కెమెరా సెటప్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది.

Vivo X200 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo X200 Pro Mini లో 6.3-ఇంచ్ 120 హెర్ట్జ్ ఎల్టీపీవో 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఓఎస్, ఒరిజిన్ఓఎస్ 5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-818 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, జీస్ 200ఎంపి 3ఎక్స్ జూమ్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

మినీ వేరియంట్ లో ఇంకా 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 5700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇంకా ఈ ఫోన్ లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

వివో ఎక్స్200 ప్రో వేరియంట్ లో 6.7-ఇంచ్ లేదా 6.8-ఇంచ్ స్క్రీన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ68/69 రేటింగ్ ఉండవచ్చు.

వివో ఎక్స్200 మోడల్ 90 వాట్ వైర్డ్ చార్జింగ్, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6-ఇంచ్ స్క్రీన్ తో వచ్చే అవకాశం ఉంది.

The post Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/feed/ 0