Vivo X200 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Oct 2024 11:39:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/ https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/#respond Mon, 07 Oct 2024 11:29:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=13949 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఎక్స్-సిరీస్ లో తన తదుపరి లైనప్ ను పరిచయం చేయనుంది. Vivo X200 పేరుతో రాబోతున్న ఈ సిరీస్ లో Vivo X200, X200 Pro మరియు X200 Pro Mini అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క చైనా మార్కెట్ ధర, డిజైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం. Vivo X200 […]

The post Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X200 సిరీస్ విడుదల
  • లైనప్‌లో వస్తోన్న Vivo X200, Pro, Pro Mini
  • తాజాగా లీకైన ఎక్స్200 సిరీస్ వివరాలు

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఎక్స్-సిరీస్ లో తన తదుపరి లైనప్ ను పరిచయం చేయనుంది. Vivo X200 పేరుతో రాబోతున్న ఈ సిరీస్ లో Vivo X200, X200 Pro మరియు X200 Pro Mini అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క చైనా మార్కెట్ ధర, డిజైన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం.

Vivo X200 ధర (లీక్)

వివో ఎక్స్200 నాలుగు వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 12జిబి+256జిబి వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.47,800) గా ఉంటుంది.

16జిబి+256జిబి వేరియంట్ ధర 4,299 యువాన్లు (సుమారు రూ.51,433) గా ఉంటుందని సమాచారం.

16జిబి+512జిబి మోడల్ ధర 4599 యువాన్లు (సుమారు రూ.55,027) గా ఉంటుంది. 16జిబి+1టిబి వేరియంట్ ధర 5099 యువాన్లు (సుమారు రూ.61,000) గా ఉంటుంది.

Vivo X200 బ్లాక్, వైట్, బ్లూ మరియు టైటానియమ్ వంటి రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Vivo X200 Pro Mini ధర వివరాలు

Vivo X200 Pro Mini డివైజ్ యొక్క 12జిబి+256జిబి మోడల్ ధర 4599 యువాన్లు (సుమారు రూ.55,000), 16జిబి+256జిబి మోడల్ ధరను 4899 యువాన్లుగా ఉంది. దీన్ని భారతీయ కరెన్సీలో రూ.58,000 గా చెప్పవచ్చు. 16జిబి+512జిబి మోడల్ ధర 5199 యువాన్లు (సుమారు రూ.62,201) గా ఉంటుంది.

Vivo X200 Pro Mini డివైజ్ బ్లాక్, వైట్, గ్రీన్ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X200 Pro ధర వివరాలు

Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 16జిబి+256జిబి మోడల్ ధరను 5199 (సుమారు రూ.62,194) గా ఉంటుంది. 16జిబి+512జిబి వేరియంట్ ధర 5499 యువాన్లు (సుమారు రూ.65,783) గా ఉంటుంది.

శాటిలైట్ ఎడిషన్ 16జిబి+512జిబి మోడల్ ధర 5699 యువాన్లు (సుమారు రూ.68,183) గా ఉంటుంది. 16జిబి+1టిబి మోడల్ ధర 6199 యువాన్లు (సుమారు రూ.74,159) గా ఉంటుంది.

Vivo X200 Pro డివైజ్ బ్లాక్, వైట్, బ్లూ మరియు టైటానియమ్ కలర్స్ లో లాంచ్ అవుతుంది.

Vivo X200 సిరీస్ డిజైన్

Vivo X200 Pro Mini డివైజ్ చిన్నగా ఉంటుంది. ఇక అన్ని వేరియంట్స్ లో రియర్ కెమెరా సెటప్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది.

Vivo X200 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo X200 Pro Mini లో 6.3-ఇంచ్ 120 హెర్ట్జ్ ఎల్టీపీవో 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఓఎస్, ఒరిజిన్ఓఎస్ 5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-818 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, జీస్ 200ఎంపి 3ఎక్స్ జూమ్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

మినీ వేరియంట్ లో ఇంకా 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 5700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇంకా ఈ ఫోన్ లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

వివో ఎక్స్200 ప్రో వేరియంట్ లో 6.7-ఇంచ్ లేదా 6.8-ఇంచ్ స్క్రీన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ68/69 రేటింగ్ ఉండవచ్చు.

వివో ఎక్స్200 మోడల్ 90 వాట్ వైర్డ్ చార్జింగ్, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6-ఇంచ్ స్క్రీన్ తో వచ్చే అవకాశం ఉంది.

The post Vivo X200, X200 Pro Mini, X200 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, చైనా మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-x200-x200-pro-mini-x200-pro-design-specs-price-leaked/feed/ 0
Vivo X200 Pro: లాంచ్‌కి ముందు లీకైన వివో ఎక్స్200 ప్రో స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-x200-pro-specs-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/vivo-x200-pro-specs-leaked-before-launch/#respond Tue, 03 Sep 2024 10:32:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=13321 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ X200 ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్‌లో Vivo X200, Vivo X200 Plus మరియు Vivo X200 Pro అనే మోడల్స్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Vivo X200 Pro యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Vivo X200 Pro స్పెసిఫికేషన్స్ (లీక్) టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన వివరాలు, త్వరలో చైనాలో లాంచ్ […]

The post Vivo X200 Pro: లాంచ్‌కి ముందు లీకైన వివో ఎక్స్200 ప్రో స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X200 Pro లాంచ్
  • అక్టోబర్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • 1.5కే 8టీ ఎల్టీపీవో క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ X200 ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్‌లో Vivo X200, Vivo X200 Plus మరియు Vivo X200 Pro అనే మోడల్స్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Vivo X200 Pro యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo X200 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన వివరాలు, త్వరలో చైనాలో లాంచ్ కాబోయే ఫ్లాగ్షిప్‌ ఫోన్‌వేనని అర్థమవుతోంది. అయితే ఫేరును టిప్‌స్టర్ పేర్కొనలేదు.

డిస్ప్లే: లీక్ ప్రకారం, Vivo X200 Pro లో 1.5కే 8టీ ఎల్టీపీవో ఐఎస్ఓ-డెప్త్ మైక్రో క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్, అల్ట్రా-న్యారో బెజెస్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింటర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి. గత రిపోర్ట్ ప్రకారం, వివో ఎక్స్200 ప్రో లో 6.7-ఇంచ్ ఓఎల్‌ఈడీ ప్యానెల్ ఉంటుందని సమాచారం.

కెమెరా: Vivo X200 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి 22ఎన్ఎమ్ సోని ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 200ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. ఈ టెలీఫోటో లెన్స్ లో అడ్వాన్స్డ్ జూమ్ మరియు టెలీఫోటో మ్యాక్రో షూటింగ్ ఫీచర్స్ ఉంటాయి.

చిప్సెట్: Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉంటుంది.

బ్యాటరీ: Vivo X200 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇతర ఫీచర్లు: లీక్ ప్రకారం, Vivo X200 Pro డివైజ్ ఐపీ68/69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo X100, X100 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo X100 సిరీస్ లోని రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ వినియోగించారు.

కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.

బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.

ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

The post Vivo X200 Pro: లాంచ్‌కి ముందు లీకైన వివో ఎక్స్200 ప్రో స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-x200-pro-specs-leaked-before-launch/feed/ 0
Vivo X200 Pro: లీకైన వివో ఎక్స్200 ప్రో డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-x200-pro-design-specs-leaked/ https://www.91mobiles.com/telugu/vivo-x200-pro-design-specs-leaked/#respond Fri, 21 Jun 2024 16:04:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=12165 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో X200 ఫ్లాగ్షిప్ సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo X200 మరియు Vivo X200 Pro అనే రెండు మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇంకా ఈ ఫోన్ల యొక్క అధికార లాంచ్ ప్రకటన రాలేదు. అయితే ఈలోపు ఓ లీక్‌స్టర్ ద్వారా Vivo X200 Pro యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Vivo […]

The post Vivo X200 Pro: లీకైన వివో ఎక్స్200 ప్రో డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X200 సిరీస్ లాంచ్
  • 1.5కే కర్వ్డ్ డిస్ప్లే
  • డైమెన్సిటీ 9400 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో X200 ఫ్లాగ్షిప్ సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo X200 మరియు Vivo X200 Pro అనే రెండు మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇంకా ఈ ఫోన్ల యొక్క అధికార లాంచ్ ప్రకటన రాలేదు. అయితే ఈలోపు ఓ లీక్‌స్టర్ ద్వారా Vivo X200 Pro యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo X200 Pro లీకైన వివరాలు

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Vivo X200 Pro యొక్క వివరాలను మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేశారు.

లీక్ ప్రకారం, Vivo X200 Pro డివైజ్ మేజర్ అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 6.7 లేదా 6.8 ఇంచుల సైజ్ ఉంటుందని సమాచారం.

Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ తో లాంచ్ కానుంది. ఈ ప్రాసెసర్ అక్టోబర్ లో లాంచ్ అవుతుంది.

Vivo X200 Pro డివైజ్ సింగిల్-పాయింట్ అల్ట్రాసోనిక్ అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో సిలికాన్ బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నట్లు సమాచారం.

Vivo X200 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో పెరిస్కోప్ లెన్స్ ఉంటుంది. 50ఎంపి సెన్సర్స్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.

Vivo X100 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo X100 Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo X100 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ వినియోగించారు.

కెమెరా: Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.

బ్యాటరీ: Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.

ఓఎస్: Vivo X100 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo X100 Pro లో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి..

కలర్ ఆప్షన్స్: Vivo X100 Pro బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Vivo X200 Pro: లీకైన వివో ఎక్స్200 ప్రో డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-x200-pro-design-specs-leaked/feed/ 0