Vivo X90S - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 26 Jun 2023 09:35:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.78-ఇంచ్ AMOLED డిస్ప్లే, Dimensity 9200+ చిప్‌తో లాంచైన Vivo X90s https://www.91mobiles.com/telugu/vivo-x90s-launched-china-price-specs-availability/ Mon, 26 Jun 2023 09:35:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=6921 Vivo కొత్త X90 సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo X90S ను చైనాలో విడుదల చేసింది. X90 సిరీస్‌లో ఇది నాల్గవ డివైజ్. కంపెనీ ఇదివరకు Vivo X90, X90 Pro మరియు X90 Pro+ 5Gలను గత సంవత్సరం చైనాలో లాంచ్ చేసింది. స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుతే, కొత్తగా లాంచ్ చేసిన, Vivo X90S ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డివైజ్ మధ్యలో ఒక పంచ్-హోల్ కటౌట్‌ను […]

The post 6.78-ఇంచ్ AMOLED డిస్ప్లే, Dimensity 9200+ చిప్‌తో లాంచైన Vivo X90s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన Vivo X90s
  • Vivo X90s ధర CNY 4,699 (సుమారు రూ.48,755)
  • సియన్ బ్లాక్, రెడ్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

Vivo కొత్త X90 సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo X90S ను చైనాలో విడుదల చేసింది. X90 సిరీస్‌లో ఇది నాల్గవ డివైజ్. కంపెనీ ఇదివరకు Vivo X90, X90 Pro మరియు X90 Pro+ 5Gలను గత సంవత్సరం చైనాలో లాంచ్ చేసింది. స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుతే, కొత్తగా లాంచ్ చేసిన, Vivo X90S ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

డివైజ్ మధ్యలో ఒక పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది, ఇది సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 12GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు Wi-Fi 7 సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. X90S యొక్క ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Vivo X90s ధర, లభ్యత

సియన్, బ్లాక్, రెడ్, వైట్ కలర్ ఆప్షన్స్ లో Vivo X90s స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధర CNY 3,999 (సుమారు రూ.45,353) గా ఉంది. మరోవైపు 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 4,299 (సుమారు రూ.48,755), CNY 4,699 (సుమారు రూ.53,300) గా ఉన్నాయి. జూన్ 30 వ తేదీ నుంచి చైనాలో ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంటుంది. భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Vivo X90S స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: Vivo X90S లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo X90S స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo X90S డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Vivo X90S స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo X90S స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఓఐఎస్ తో కూడిన సోని ఐఎంఎక్స్633 లెన్స్ తో వచ్చింది.
  • బ్యాటరీ: Vivo X90S డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4810 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X90S స్మార్ట్ ఫోన్ లో 5జీ, వై-ఫై 7, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్-లాక్ సపోర్ట్ ఉంటాయి.

The post 6.78-ఇంచ్ AMOLED డిస్ప్లే, Dimensity 9200+ చిప్‌తో లాంచైన Vivo X90s first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Vivo X90s లాంచ్ తేదీ, కెమెరా ఇమేజ్ https://www.91mobiles.com/telugu/vivo-x90s-camera-images-launch-date-revealed/ Tue, 20 Jun 2023 09:04:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=6851 Vivo తన Vivo X90s స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది. ఈ పరికరం జూన్ 26న చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లాంచ్ తేదీతో సహా ఫోన్‌లో కనిపించే కెమెరా యొక్క కొన్ని చిత్ర నమూనాలను కూడా పంచుకున్నారు, అందులో ఫోటో నాణ్యత ప్రదర్శించబడింది. మీరు పోస్ట్‌లో మరింత భాగస్వామ్యం చేసిన చిత్రాలు మరియు ఇతర వివరాలను చదవవచ్చు. Vivo X90s కెమెరా విశేషాలు Vivo X90s స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ ని Vivo […]

The post రివీలైన Vivo X90s లాంచ్ తేదీ, కెమెరా ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 26 న చైనాలో లాంచ్ కానున్న Vivo X90s
  • వివో టెక్షర్ కలర్ ని కెమెరాకి యాడ్ చేయనున్న కంపెనీ
  • డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో రానున్న డివైజ్

Vivo తన Vivo X90s స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది. ఈ పరికరం జూన్ 26న చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లాంచ్ తేదీతో సహా ఫోన్‌లో కనిపించే కెమెరా యొక్క కొన్ని చిత్ర నమూనాలను కూడా పంచుకున్నారు, అందులో ఫోటో నాణ్యత ప్రదర్శించబడింది. మీరు పోస్ట్‌లో మరింత భాగస్వామ్యం చేసిన చిత్రాలు మరియు ఇతర వివరాలను చదవవచ్చు.

Vivo X90s కెమెరా విశేషాలు

Vivo X90s స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ ని Vivo వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ మేనేజర్ ఆఫ్ ప్రొడక్ట్ స్ట్రాటజీ, జియా జింగ్‌డాంగ్ షేర్ చేశారు. ఈ ఇమేజెస్ చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo లో కనిపించాయి. ఈ డివైజ్ లో మెరుగైన ఫోటోగ్రఫీని అందించనున్నారని సమాచారం. జియా జింగ్‌డన్ ప్రకారం, ముందుగా X-సిరీస్‌లో 2 కలర్ వేరియంట్స్ ఇవ్వబడ్డాయి. జీస్ నుండి వివిడ్ కలర్ మరియు నేచురల్ కలర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కంపెనీ వివో టెక్చర్ కలర్‌ను కూడా జోడించబోతోంది. ఇది క్లాసిక్ ఫిల్మ్ కెమెరా నుండి ప్రేరణ పొందిందని చెబుతున్నారు.

అన్ని ఇమేజెస్ ని గమనిస్తే ఎంతో చక్కగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి వివరాలు చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో పైన పేర్కొన్న సాంకేతికత యొక్క ఉపయోగం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఫోటోగ్రఫీ ప్రేమికులైతే, ఈ కెమెరా మీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పవచ్చు.

Vivo X90s స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo X90s స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1260*2800 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X90s స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ ఉంటుంది. మిగతా ఫీచర్లు వివో ఎక్స్90 మాదిరే ఉంటాయని సమాచారం.
  • స్టోరేజీ: Vivo X90s స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo X90s స్మార్ట్ ఫోన్ లో 4810 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
  • కనెక్టివిటీ: Vivo X90s డివైజ్ లో వై-ఫై 7, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ ఉంటాయి.
  • ఓఎస్: Vivo X90s స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్3.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • సెక్యూరిటీ: భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించనున్నారు. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అఫీషియల్ గా రివీల్ కానున్నాయి.

The post రివీలైన Vivo X90s లాంచ్ తేదీ, కెమెరా ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తోన్న Vivo X90s; అఫీషియల్‌గా రివీలైన డిజైన్! https://www.91mobiles.com/telugu/vivo-x90s-design-officially-revealed/ Thu, 15 Jun 2023 09:09:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=6785 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo X90s డివైజ్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ ని వివో కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియర్ ప్యానెల్ డిజైన్ ని వివో రివీల్ చేసింది. దీని ద్వారా వైట్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యింది. Vivo X90s డివైజ్ లో ఇతర ఎక్స్90 సిరీస్ డివైజెస్ లో మాదిరి కెమెరా మాడ్యూల్ ఉంది. Vivo X90s ఫోన్ ట్రిపుల్ […]

The post ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తోన్న Vivo X90s; అఫీషియల్‌గా రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వైట్ కలర్ ఆప్షన్ లో లభించనున్న Vivo X90s
  • ఇతర ఎక్స్90 సిరీస్ డివైజెస్ మాదిరే ఉన్న Vivo X90s డిజైన్
  • జీస్-ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo X90s డివైజ్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ ని వివో కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియర్ ప్యానెల్ డిజైన్ ని వివో రివీల్ చేసింది. దీని ద్వారా వైట్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యింది. Vivo X90s డివైజ్ లో ఇతర ఎక్స్90 సిరీస్ డివైజెస్ లో మాదిరి కెమెరా మాడ్యూల్ ఉంది. Vivo X90s ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది.

Vivo X90s డివైజ్ జీస్-ట్యూన్డ్ ఆప్టిక్స్ మరియు టీ* కోటింగ్ తో వస్తోంది. అయితే ఫోన్ లాంచ్ తేదీ ఎప్పుడో వివో ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఒక టిప్‌స్టర్ ద్వారా Vivo X90s స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు బయటకు వచ్చాయి.

ఇది కూడా చదవండి: గీక్‌బెంచ్ పై కనిపించిన Realme Narzo 60 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Vivo X90s లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్

వివో సంస్థ Vivo X90s ఫ్లాగ్షిప్ లాంచ్ చైనాలో ఉండనుందని కన్ఫర్మ్ చేసింది. ఈ డివైజ్ చైనాలో త్వరలోనే లాంచ్ కానుంది. వివో ఇంకా గ్లోబల్ రిలీజ్ పై ప్రకటన చేయలేదు. అయితే Vivo X90s డివైజ్ ని రివీల్ చేసింది. దీంతో భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ రివీల్ అయ్యింది. వైట్ రియర్ ప్యానెల్ గ్లాస్ బ్యాక్ తో కనిపిస్తోంది.

Vivo X90s కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే ఈ ఫోన్ జూన్ లో లాంచ్ కానుందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. టిప్‌స్టర్స్ మరియు TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ తెలుసుకుందాం.

Vivo X90s స్పెసిఫికేషన్స్ (లీక్స్)

  • డిస్ప్లే: Vivo X90s లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 2800*1280 పిక్సెల్స్, కర్వ్డ్ స్క్రీన్, హోల్-పంచ్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo X90s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుందని సమాచారం. దీనికి తోడు వివో వీ2 ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ఐఎస్‌పీ) చిప్ కూడా ఉండనుంది.
  • కెమెరా: Vivo X90s డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo X90s స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4690 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఇది కూడా చదవండి: త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy M34 5G

The post ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తోన్న Vivo X90s; అఫీషియల్‌గా రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo X90S లాంచ్ టైమ్‌లైన్, iQOO 11S లాంచ్ తేదీ! https://www.91mobiles.com/telugu/vivo-x90s-launch-timeline-iqoo-11s-launch-date-leaked/ Tue, 06 Jun 2023 13:55:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=6645 X100 సిరీస్ ని లాంచ్ చేసే పనిలో వివో ఉందన్న రూమర్ల మధ్యలో, టిప్‌స్టర్స్ ద్వారా Vivo X90S లాంచ్ గురించి సమాచారం బయటకు వచ్చింది. మరోవైపు మరొక టిప్‌స్టర్ ద్వారా iQOO 11S టైమ్ లైన్ గురించి కూడా హింట్ వచ్చింది. మరి ఈ రెండు ఫోన్లు ఎప్పుడు లాంచ్ కానున్నాయి? టిప్‌స్టర్స్ నుంచి లీకైన సమాచారం ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. Vivo X90S లాంచ్ టైమ్‌లైన్ (రూమర్స్) చైనీస్ మైక్రో బ్లాగింగ్ […]

The post లీకైన Vivo X90S లాంచ్ టైమ్‌లైన్, iQOO 11S లాంచ్ తేదీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo X90S
  • వచ్చే నెలలో చైనాలో లాంచ్ కానున్న iQOO 11S
  • డివైజెస్ గురించి రావాల్సి ఉన్న అధికార ప్రకటన

X100 సిరీస్ ని లాంచ్ చేసే పనిలో వివో ఉందన్న రూమర్ల మధ్యలో, టిప్‌స్టర్స్ ద్వారా Vivo X90S లాంచ్ గురించి సమాచారం బయటకు వచ్చింది. మరోవైపు మరొక టిప్‌స్టర్ ద్వారా iQOO 11S టైమ్ లైన్ గురించి కూడా హింట్ వచ్చింది. మరి ఈ రెండు ఫోన్లు ఎప్పుడు లాంచ్ కానున్నాయి? టిప్‌స్టర్స్ నుంచి లీకైన సమాచారం ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

Vivo X90S లాంచ్ టైమ్‌లైన్ (రూమర్స్)

చైనీస్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ వీబో పై, ఒక టిప్‌స్టర్ Vivo X90S కి సంబంధించిన సమాచారం వెల్లడించారు. దాని ప్రకారం, ఈ డివైజ్ చైనాలో ఈ నెలలోనే లాంచ్ కానుందని సమాచారం. అయితే, కచ్చితమైన తేదీని మాత్రం పేర్కొనలేదు. ఇంకా కంపెనీ నుంచి కూడా అధికార ప్రకటన ఏదీ రాలేదు.

ఎక్స్90 సిరీస్ లో భాగంగా రాబోవు Vivo X90S డివైజ్ లాంచ్ కానుంది. ఇకపోతే ఇటీవలె భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ అయ్యింది. అయితే, Vivo X90S డివైజ్ భారత మార్కెట్ లోకి వస్తుందో లేదో ఇంకా తెలియదు.

రీసెంట్ గా Vivo X90S స్మార్ట్ ఫోన్ TENAA వెబ్ సైట్ పై కనిపించింది. Vivo X90S డివైజ్ డిజైన్ ఇతర ఎక్స్90 సిరీస్ స్మార్ట్ ఫోన్ల మాదిరే ఉండనుంది.

Vivo X90S స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo X90S లో 6.78-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo X90S లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయని అంచనా.
  • సెల్ఫీ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Vivo X90S లో 32ఎంపి కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • చిప్సెట్: Vivo X90S డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుంది. ఇది 3.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
  • స్టోరేజీ: Vivo X90S స్మార్ట్ ఫోన్ 8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.
  • ఓఎస్: Vivo X90S స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • బ్యాటరీ: Vivo X90S స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4590 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

iQOO 11S లాంచ్ తేదీ (రూమర్స్)

iQOO 11S స్మార్ట్ ఫోన్ జూన్ లేదా జులై మాసాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీబో పై టిప్‌స్టర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, iQOO 11S జూన్ 8 న చైనాలో అఫీషియల్ గా లాంచ్ కానుంది. అయితే కంపెనీ దీనిపై అధికార ప్రకటన చేయాల్సి ఉంది.

iQOO 11S స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: iQOO 11S లో 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.
  • వెనుక కెమెరా: iQOO 11S లో 50ఎంపి మెయిన్ కెమెరా, వీ2 ఐఎస్‌పీ ఇమేజింగ్ సిస్టమ్ ఉండనున్నాయి.
  • చిప్సెట్: iQOO 11S లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఇది ఓవర్‌క్లాక్డ్ వర్షన్ అని తెలుస్తోంది.
  • స్టోరేజీ: iQOO 11S 8జిబి/12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: iQOO 11S స్మార్ట్ ఫోన్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్ ఎంత బ్యాటరీ కెపాసిటీతో వస్తుందో తెలియదు.

The post లీకైన Vivo X90S లాంచ్ టైమ్‌లైన్, iQOO 11S లాంచ్ తేదీ! first appeared on 91Mobiles Telugu.

]]>