Vivo Y01A - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 15 Nov 2022 11:05:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y01A ని లాంచ్ చేసిన వివో https://www.91mobiles.com/telugu/vivo-y01a-launched-thailand-price-specs/ Tue, 15 Nov 2022 11:05:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=3443 హైలైట్స్ థాయిలాండ్ లో లాంచ్ అయిన Vivo Y01A స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 8ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Vivo Y01A ధర THB 3,999 (సుమారు రూ.9,100) ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో తాజాగా Vivo Y01A అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇదొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్. Vivo Y01A ప్రస్తుతం థాయిలాండ్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. […]

The post బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y01A ని లాంచ్ చేసిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • థాయిలాండ్ లో లాంచ్ అయిన Vivo Y01A స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 8ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • Vivo Y01A ధర THB 3,999 (సుమారు రూ.9,100)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో తాజాగా Vivo Y01A అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇదొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్. Vivo Y01A ప్రస్తుతం థాయిలాండ్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ ధర దాదాపు రూ.9 వేలుగా ఉంది. Vivo Y01A స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 8 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. Vivo Y01A యొక్క ఇతర స్పెసిఫికేషన్స్, ధర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Vivo Y01A స్పెసిఫికేషన్స్

Vivo Y01A యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే గనుక ఇందులో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్ అందించారు. ఫోన్ యొక్క స్కీన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. స్క్రీన్ కి మూడు వైపులా బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. వి ఆకారంలో నాచ్ ని ఈ డిస్ప్లేలో అందించారు. ఈ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Vivo Y01A 163.96 మిల్లీ మీటర్ల పొడవు, 75.2 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.28 మిల్లీ మీటర్ల మందం, 178 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo Y01A ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఓఎస్ ఉంది కాబట్టి, అన్ని గూగుల్ గో యాప్స్ ని వాడుకోవచ్చు. అది కూడా తక్కువ ర్యామ్ మరియు స్టోరేజీ తో ఈ యాప్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ని వాడారు.

Vivo Y01A స్మార్ట్ ఫోన్ లో సింగిల్ రియర్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఇది 8 మెగా పిక్సెల్ షూటర్. దీనికి తోడు ఒక ఫ్లాష్ లైట్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

Vivo Y01A లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ సౌకర్యం ఉన్నాయి. బ్లూటూత్, వై-ఫై, ఫేస్ అన్‌లాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది.

Vivo Y01A ధర

Vivo Y01A స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ లో థాయిలాండ్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 2జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. Vivo Y01A ధర THB 3,999 (సుమారు రూ.9,100) గా ఉంది. సఫైర్ బ్లూ, ఎలిగెంట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y01A ని లాంచ్ చేసిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>