Vivo Y03t - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 23 Aug 2024 18:22:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y03t: గ్లోబల్‌గా లాంచైన చవక ఫోన్ వివో వై03టీ https://www.91mobiles.com/telugu/vivo-globally-launched-low-budget-phone-y03t/ https://www.91mobiles.com/telugu/vivo-globally-launched-low-budget-phone-y03t/#respond Fri, 23 Aug 2024 18:22:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13138 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా గ్లోబల్ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y03t పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్, 8జిబి వరకు ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo Y03t స్పెసిఫికేషన్స్ […]

The post Vivo Y03t: గ్లోబల్‌గా లాంచైన చవక ఫోన్ వివో వై03టీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Vivo Y03t లాంచ్
  • యూనిఎస్ఓసీ టీ612 చిప్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా గ్లోబల్ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y03t పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్, 8జిబి వరకు ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y03t స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y03t స్మార్ట్‌ఫోన్‌లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 70% ఎన్టీఎస్‌సీ కలర్ శాచురేషన్, 528నిట్స్ పీక్ బ్రైట్నెస్, కెపాసిటివ్ మల్టీ-టచ్ ఫీచర్ ఉంటాయి.

చిప్సెట్: Vivo Y03t లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ ఉంది. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y03t డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y03t లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y03t లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo Y03t ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y03t లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y03t లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ అందించారు.

బరువు, చుట్టుకొలత: Vivo Y03t స్మార్ట్‌ఫోన్ లో 163.63 మి.మీ పొడవు, 75.58 మి.మీ వెడల్పు, 8.39 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo Y03t ధర

Vivo Y03t డివైజ్ కంపెనీ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. షాపీ ఫిలిప్పైన్స్ సైట్ లో ఈ ఫోన్ ధర PHP 4,399 గా ఉంది. మన కరెన్సీలో ఇది సుమారు రూ.6,530.

Vivo Y03t డివైస్ స్పేస్ బ్లాక్ మరియు జెమ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Vivo Y03t: గ్లోబల్‌గా లాంచైన చవక ఫోన్ వివో వై03టీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-globally-launched-low-budget-phone-y03t/feed/ 0