Vivo Y100 GT - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Jan 2024 17:03:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y100 GT: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వై100 జీటీ https://www.91mobiles.com/telugu/vivo-y100-gt-google-play-console-listing-key-specs/ Wed, 10 Jan 2024 17:03:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=9663 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y100 GT డివైజ్ ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Vivo Y100 GT గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Vivo Y100 GT కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, రెండర్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo Y100 GT స్మార్ట్‌ఫోన్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్, రెండర్స్ […]

The post Vivo Y100 GT: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వై100 జీటీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 GT
  • కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8200

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y100 GT డివైజ్ ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Vivo Y100 GT గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Vivo Y100 GT కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, రెండర్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo Y100 GT స్మార్ట్‌ఫోన్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్, రెండర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y100 GT గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

  • PD2314 అనే మోడల్ నంబర్ తో Vivo Y100 GT డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • రెండర్స్ ని గమనిస్తే, Vivo Y100 GT లో బెజెల్స్ సన్నగా ఉన్నాయి. ఇంకా ముందు వైపున, పంచ్-హోల్ కటౌట్ మరియు కర్వ్డ్ డిస్ప్లే ఉన్నాయి.
  • గూగుల్ ప్లే కన్సోల్ పైకి Vivo Y100 GT డివైజ్ వచ్చిందంటే, త్వరలోనే లాంచ్ కూడా ఉంటుందని అంచనా వేయవచ్చు.
  • రానున్న కొన్ని వారాల్లో Vivo Y100 GT కి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Vivo Y100 GT స్పెసిఫికేషన్స్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)

  • డిస్ప్లే: లిస్టింగ్ ప్రకారం, Vivo Y100 GT లో 1080*2388 పిక్సెల్ డెన్సిటీ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయని తెలుస్తోంది.
  • ప్రాసెసర్: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై Vivo Y100 GT డివైజ్ మీడియాటెక్ ఎంటీ6896 ప్రాసెసర్ తో లిస్ట్ అయ్యింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది.
  • ర్యామ్: Vivo Y100 GT డివైజ్ 12జిబి ర్యామ్ తో లిస్టింగ్ పై కనిపించింది.
  • ఓఎస్: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Vivo Y100 GT డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో కనిపించింది.

Vivo Y100i 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y100i 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.3 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y100i 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y100i 5G లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. 12జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో యూజర్ కి మొత్తం 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo Y100i 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y100i 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y100i 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ54 రేటింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo Y100 GT: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వై100 జీటీ first appeared on 91Mobiles Telugu.

]]>