Vivo Y100i Power - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Dec 2023 05:29:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 6 Gen 1 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y100i Power https://www.91mobiles.com/telugu/vivo-y100i-power-featuring-snapdragon-6-gen-1-chip-launched-china-price-specs/ Tue, 26 Dec 2023 05:27:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=9427 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Y100 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y100i Power పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y100i Power డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Snapdragon 6 Gen 1 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y100i Power first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y100i Power
  • 6,000mAh బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Vivo Y100i Power ధర 2,099 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Y100 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y100i Power పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y100i Power డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y100i Power ధర, కలర్ ఆప్షన్స్

  • Vivo Y100i Power స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో చూద్దాం.
  • Vivo Y100i Power 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 2,099 యువాన్లు (సుమారు రూ.24,437) గా నిర్ణయించారు.
  • Vivo Y100i Power డివైజ్ బ్లాక్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y100i Power స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y100i Power లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ (1080*2388 పిక్సెల్స్), ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y100i Power లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y100i Power లో 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ 12జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo Y100i Power లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo Y100i Power లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y100i Power స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y100i Power లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post Snapdragon 6 Gen 1 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y100i Power first appeared on 91Mobiles Telugu.

]]>