Vivo Y11 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Apr 2023 14:01:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.51-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో లాంచైన Vivo Y11 4G https://www.91mobiles.com/telugu/vivo-y11-4g-launched-china-price-specs-availability/ Mon, 03 Apr 2023 14:01:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=5719 Vivo సంస్థ మెల్లగా తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. కంపెనీ వై-సిరీస్ లో తన లైనప్ ని విస్తృతం చేస్తోంది. తాజాగా చైనాలో Vivo Y11 4G డివైజ్ ని లాంచ్ చేసింది. Vivo Y11 4G డివైజ్ పాలి కార్బొనేట్ బ్యాక్ మరియు ఫ్రేమ్ తో వచ్చింది. 2022 నుంచి లాంచ్ అవుతోన్న ఫోన్ల మాదిరిగానే Vivo Y11 4G ఫ్లాట్ రియర్ ప్యానెల్ మరియు ఫ్రేమ్ ని కలిగి […]

The post 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.51-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో లాంచైన Vivo Y11 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y11 4G స్మార్ట్ ఫోన్
  • 8ఎంపి కెమెరా, మీడియాటెక్ ప్రాసెసర్ తో వచ్చిన Vivo Y11 4G
  • 4జిబి/6జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించనున్న డివైజ్

Vivo సంస్థ మెల్లగా తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. కంపెనీ వై-సిరీస్ లో తన లైనప్ ని విస్తృతం చేస్తోంది. తాజాగా చైనాలో Vivo Y11 4G డివైజ్ ని లాంచ్ చేసింది. Vivo Y11 4G డివైజ్ పాలి కార్బొనేట్ బ్యాక్ మరియు ఫ్రేమ్ తో వచ్చింది. 2022 నుంచి లాంచ్ అవుతోన్న ఫోన్ల మాదిరిగానే Vivo Y11 4G ఫ్లాట్ రియర్ ప్యానెల్ మరియు ఫ్రేమ్ ని కలిగి ఉంది.

ఫోన్ ముందు వైపు వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఇది ఫోన్ కి ఓల్డ్ లుక్ తీసుకొచ్చింది. చైనాకి బయటి మార్కెట్స్ లో Vivo Y11 4G ఫోన్ లాంచ్ కి సంబంధించిన వివరాలను వివో ఖరారు చేయలేదు. ఈలోపు Vivo Y11 4G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y11 4G ధర, స్పెసిఫికేషన్స్

  • 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 4జిబి/6జిబి ర్యామ్, 2జిబి వర్చువల్ ర్యామ్
  • 64జిబి స్టోరేజీ
  • మీడియాటెక్ ప్రాసెసర్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్

Vivo Y11 4G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ మోడల్ 4జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ 6జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 2జిబి వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో వస్తోంది. ఇప్పటికైతే వివో ఈ ఫోన్ ధరను ప్రకటించలేదు.

Vivo Y11 4G రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుందని కంపెనీ తెలిపింది. అవి: ఒబ్సిడియన్ బ్లాక్ మరియు ఐస్ బ్లూ. రెండు కలర్స్ కూడా మ్యాట్ ఫినిష్ తో వస్తున్నాయి.

Vivo Y11 4G స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటాయి. ఈ డివైజ్ కి సంబంధించిన ప్రాసెసర్ పేరు కంపెనీ వెల్లడించలేదు. Vivo Y11 4G లో 8ఎంపి రియర్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి కెమెరా ఉంటుంది.

Vivo Y11 4G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ డివైజ్ లో మైక్రో-యూఎస్బీ పోర్ట్ అందించారు. ఈ ఫోన్ సింగిల్ చార్జ్ పై 28 రోజుల స్టాండ్ బై టైమ్ ని అందిస్తుంది. ఇకపోతే ఫోన్ 8.49 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

Vivo Y11 4G డివైజ్ ప్రాసెసర్ వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. కంపెనీ నుంచి ధర మరియు లభ్యతకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.51-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో లాంచైన Vivo Y11 4G first appeared on 91Mobiles Telugu.

]]>