Vivo Y35 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 Aug 2022 07:36:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB RAM, 50MP CAMERA, 44W ఫాస్ట్ చార్జింగ్ తో భారత్ లో లాంచ్ అయిన Vivo Y35 https://www.91mobiles.com/telugu/vivo-y35-launched-in-india-price-specs/ Tue, 30 Aug 2022 07:36:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=2000 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Vivo Y35 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 44వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు భారత్ లో Vivo Y35 ధర రూ.18,499 Vivo Y35 ఇండియా లాంచ్: Vivo Y35 అనే కొత్త స్మార్ట్ ఫోన్ ని వివో కంపెనీ భారత్ లో నేడు లాంచ్ చేసింది. రూ.18,499 ధరతో ఈ ఫోన్ లాంచ్ […]

The post 8GB RAM, 50MP CAMERA, 44W ఫాస్ట్ చార్జింగ్ తో భారత్ లో లాంచ్ అయిన Vivo Y35 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Vivo Y35
  • 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 44వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో Vivo Y35 ధర రూ.18,499

Vivo Y35 ఇండియా లాంచ్: Vivo Y35 అనే కొత్త స్మార్ట్ ఫోన్ ని వివో కంపెనీ భారత్ లో నేడు లాంచ్ చేసింది. రూ.18,499 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Vivo Y35 స్పెసిఫికేషన్స్

Vivo Y35 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఇది 2408*1080 రెజుల్యూషన్ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్లో ఫ్లాట్ ఫ్రేమ్, 2.5 కర్వ్డ్ గ్లాస్, ఆంటీ-గ్లేర్ సర్ఫేస్ ఉన్నాయి. ఏజీ సర్ఫేస్ ఫింగర్ ప్రింట్ ని అట్రాక్ట్ చేయదు. దీంతో ఫోన్ లుక్ ఎప్పుడూ బాగుంటుంది.

Vivo Y35 ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 పై పని చేస్తుంది. ఇక ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ను వాడారు. ఇది 6 నానోమీటర్ ప్లాట్ఫామ్ పై తయారైన ఆక్టాకోర్ ప్రాసెసర్. 2.4 గిగాహెర్ట్జ్ స్పీడ్ ని ఈ ప్రాసెసర్ కలిగి ఉంది. Vivo Y35 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్ ఈ ఫోన్లో ఉంది.

Vivo Y35 లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఎఫ్/1.8 అపర్చర్), 2ఎంపి బొకే లెన్స్ (ఎఫ్/2.4 అపర్చర్), 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. Vivo Y35 లో సెల్పీలు, వీడియో కాల్స్ కొరకు 16 ఎంపి కెమెరా ను అమర్చారు. Vivo Y35 డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కొరకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు. పవర్ కొరకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y35 ధర, విక్రయం

Vivo Y35 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇది 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభించనుంది. దీని ధర రూ.18,499. అగేట్ బ్లాక్, డాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్, వన్ కార్డ్ యూజర్లు Vivo Y35 కొనుగోలు పై రూ.1000 డిస్కౌంట్ పొందుతారు. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వివో ఇండియా ఆన్ లైన్ స్టోర్స్ మరియు ఆఫ్ లైన్ రిటైలర్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post 8GB RAM, 50MP CAMERA, 44W ఫాస్ట్ చార్జింగ్ తో భారత్ లో లాంచ్ అయిన Vivo Y35 first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్ డ్రాగన్ 680 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y35 https://www.91mobiles.com/telugu/vivo-y35-india-launch-teased-price-specs/ Tue, 23 Aug 2022 15:47:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=1852 హైలైట్స్: త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్న వివో వై35 4జీ స్మార్ట్ ఫోన్ లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తెస్తున్న ఫోన్ వివో వై35 స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు వివో వై35 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ […]

The post స్నాప్ డ్రాగన్ 680 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y35 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్న వివో వై35 4జీ స్మార్ట్ ఫోన్
  • లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తెస్తున్న ఫోన్ వివో వై35
  • స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

వివో వై35 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో రెడీ అవుతోంది. ముంబైకి చెందిన రిటైలర్ మహేశ్ టెలీకామ్ వివో వై35 కి సంబంధించిన టీజర్ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా బయటకు వదిలింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ఫష్టమైంది. ఈ పోస్టర్ ద్వారా ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్, ముఖ్యమైన ఫీచర్లు ఏంటో తెలిశాయి. ఈ నెల మొదట్లో ఇండోనేషియాలో లాంచ్ అయిన ఫోన్, వివో వై35 ఫోన్ ఒకటేనని 91మొబైల్స్ కన్ఫర్మ్ చేస్తోంది. 4జీ కనెక్టివిటీ తో వస్తున్న ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Vivo Y35 స్పెసిఫికేషన్స్

వివో వై35 లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ను అమర్చారు. 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఆప్షన్ ఇందులో ఉంది. ఈ హ్యాండ్సెట్ లో 50 ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

వివో వై35 లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16 ఎంపి కెమెరాను అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆఫ్ లైన్ మార్కెట్స్ ద్వారా ఈ ఫోన్ విక్రయించబడుతుంది.

Vivo Y35 ఇండియా లాంచ్

పోస్టర్ ద్వారా వివో వై35 ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే వివో ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. అలాగే భారత్ లో వివో వై35 ధరకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఇంకా లేదు. ఇండోనేషియాలో IDR 33,99,000 (దాదాపు రూ.18,500) గా ఈ ఫోన్ ధర ఉంది.

ప్రైస్‌బాబా నివేదిక ప్రకారం, వివో వై35 ఫోన్ ని ఎస్బీఐ, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ.1,000 క్యాష్ బ్యాక్ లభించనుందని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, గ్యాడ్జెట్, టెలీకామ్, ఆటోమొబైల్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post స్నాప్ డ్రాగన్ 680 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y35 first appeared on 91Mobiles Telugu.

]]>