Vivo Y35m 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 29 May 2023 09:45:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డైమెన్సిటీ 6020 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y35+ 5G, Y35m+ 5G https://www.91mobiles.com/telugu/vivo-y35-plus-5g-vivo-y35m-plus-5g-launched-china-price-specs/ Mon, 29 May 2023 08:17:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=6519 ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో, కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్లు Vivo Y35+ 5G, Y35m+ 5G ని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ విషయాల్లో తప్పితే ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉన్నాయి. Vivo Y35+ 5G, Y35m+ 5G స్మార్ట్ ఫోన్లలో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, […]

The post 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డైమెన్సిటీ 6020 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y35+ 5G, Y35m+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y35+ 5G, Y35m+ 5G
  • 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చిన ఫోన్లు
  • గ్లోబల్ మార్కెట్స్ లో లభ్యతపై ఇంకా రాని ప్రకటన

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో, కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్లు Vivo Y35+ 5G, Y35m+ 5G ని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ విషయాల్లో తప్పితే ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉన్నాయి. Vivo Y35+ 5G, Y35m+ 5G స్మార్ట్ ఫోన్లలో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

Vivo Y35+ 5G, Y35m+ 5G ధరలు, లభ్యత

Vivo Y35+ 5G డివైజ్ స్టార్ రింగ్ బ్లాక్, సాల్ట్ లేక్ బ్లూ మరియు నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y35+ 5G బేస్ మోడల్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,399 (సుమారు రూ.16,400) గా ఉంది. ఇక 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ.18,700) గా ఉంది. టాప్ మోడల్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ.21,000) గా ఉంది. ఈ ఫోన్ ని వివో అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా చైనాలో కొనుగోలు చేయవచ్చు.

Vivo Y35m+ 5G స్టార్ రింగ్ బ్లాక్, రిపుల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 1599 (సుమారు రూ.18,700) మరియు CNY 1799 (సుమారు రూ.21,000) గా ఉన్నాయి. అయితే వివో సంస్థ ఈ డివైజెస్ యొక్క ఇతర మార్కెట్స్ లభ్యత గురించి ప్రకటన చేయలేదు.

Vivo Y35+ 5G, Y35m+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.44-ఇంచ్ డిస్ప్లే
  • ఐపీఎస్ ప్యానెల్

Vivo Y35+ 5G, Y35m+ 5G ఫోన్లలో 6.44-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2388*1080 పిక్సెల్ రెజుల్యూషన్), 19:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్

  • డైమెన్సిటీ 7020 చిప్

Vivo Y35+ 5G, Y35m+ 5G స్మార్ట్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ

  • 8జిబి
  • 128జిబి/256జిబి

Vivo Y35+ 5G, Y35m+ 5G స్మార్ట్ ఫోన్లలో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo Y35+ 5G, Y35m+ 5G ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 10ఎక్స్ డిజిటల్ జూమ్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

  • 5000 ఎంఏహెచ్
  • 15 వాట్

ఈ ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇవి 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి.

The post 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డైమెన్సిటీ 6020 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y35+ 5G, Y35m+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y35m 5G https://www.91mobiles.com/telugu/vivo-y35m-5g-device-launched-china-price-specs/ Mon, 02 Jan 2023 15:11:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4293 హైలైట్స్ చైనాలో లాంచైన Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Vivo Y35m 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో కొత్త వై-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y35m 5G ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది వివో. మీడియాటెక్ చిప్సెట్ తో Vivo Y35m 5G స్మార్ట్ […]

The post MediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y35m 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Vivo Y35m 5G
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో కొత్త వై-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y35m 5G ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది వివో. మీడియాటెక్ చిప్సెట్ తో Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ లాంచైంది. అయితే ఈ ఫోన్ చైనాకు బయటి మార్కెట్స్ లో లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియదు. కంపెనీ ఇంకా ఆ వివరాలను ప్రకటించాల్సి ఉంది.

Vivo Y35m 5G ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. వివిధ స్టోరేజీ కన్ఫిగరేషన్స్ తో లాంచైంది. టాప్ ఎండ్ మోడల్ 8జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. సరే ఓసారి Vivo Y35m 5G యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం.

Vivo Y35m 5G ధర మరియు స్పెసిఫికేషన్స్

Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ అయిన 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1399 యువాన్లు (సుమారు రూ.16,700). 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1599 యువాన్లు (సుమారు రూ.19,100). ఇక 8జిబి + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1699 యువాన్లు (సుమారు రూ.20,300).

Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: స్టారీ బ్లాక్, స్టార్ ఆరెంజ్. Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ పాలికార్పొనేట్ బాడీతో తయారైంది. ఈ ఫోన్ 6.51-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ రెజుల్యూషన్ (720*1600 పిక్సెల్స్), 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది.

Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.

Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. Vivo Y35m 5G లో 8జిబి వరకు ర్యామ్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Vivo Y35m 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo Y35m 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ ఫారెస్ట్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Vivo Y35m 5G స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్ లాక్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y35m 5G first appeared on 91Mobiles Telugu.

]]>