Vivo Y55s 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:41:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo Y55s 5G https://www.91mobiles.com/telugu/vivo-y55s-launched-taiwan-price-specs-color-options/ Fri, 20 Jan 2023 08:27:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=4582 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తాజాగా తైవాన్ లో Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 2021 డిసెంబర్ లో వచ్చిన Vivo Y55s కి ఇది సక్సెసర్ గా వచ్చింది. ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5జీ చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y55s 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post 50ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo Y55s 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తైవాన్ లో లాంచైన Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్
  • ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, భారీ బ్యాటరీ, 5జీ చిప్, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • 2021 లో వచ్చిన Vivo Y55s కి సక్సెసర్ గా వస్తోన్న Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తాజాగా తైవాన్ లో Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 2021 డిసెంబర్ లో వచ్చిన Vivo Y55s కి ఇది సక్సెసర్ గా వచ్చింది. ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5జీ చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y55s 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y55s 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, టియర్ డ్రాప్ నాచ్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 1080*2408 పిక్సెల్స్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్, 90.6 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో ఉంటాయి. ఈ ఫోన్ లో కుడివైపున పవర్ బటన్ ఉంది. ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేయబడి ఉంది.

Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్స్ కూడా 128జిబి స్టోరేజీతో వస్తున్నాయి. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఇప్పుడు Vivo Y55s 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం.

Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరాలు ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తాయి.

Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే, చైనీస్ వేరియంట్ మాదిరే ఉన్నాయి. ఇకపోతే 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న తొలి వివో స్మార్ట్ ఫోన్ గా చైనీస్ వేరియంట్ నిలిచింది. ఇదొక్క తేడా తప్పితే రెండు మోడల్స్ ఫీచర్లన్నీ సేమ్ టు సేమ్.

Vivo Y55s 5G ధర, లభ్యత

Vivo Y55s 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర తైవాన్ లో NTD 7,990 గా ఉంది. ఇక 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర NTD 8,490 గా నిర్ణయించారు. ఈ ఫోన్ గెలాక్సీ బ్లూ మరియు స్టార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo Y55s 5G first appeared on 91Mobiles Telugu.

]]>