Vivo Y75 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 21 Dec 2022 14:13:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y75 4G స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/vivo-y75-4g-discount-sale-bank-offers/ Wed, 21 Dec 2022 14:13:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=4119 హైలైట్స్ Vivo Y75 4G ధరను తగ్గించిన వివో సంస్థ రూ.1000 వరకు ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్స్ ద్వారా రూ.1,500 క్యాష్‌బ్యాక్ మీడియాటెక్ హీలియో జీ96 చిప్, 8జిబి ర్యామ్, 6.44-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చిన Vivo Y75 4G ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తాజాగా Vivo Y75 4G ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైలర్ మహేశ్ టెలీకామ్ వెల్లడించింది. ఈ ఆఫర్ […]

The post Vivo Y75 4G స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Vivo Y75 4G ధరను తగ్గించిన వివో సంస్థ
  • రూ.1000 వరకు ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్స్ ద్వారా రూ.1,500 క్యాష్‌బ్యాక్
  • మీడియాటెక్ హీలియో జీ96 చిప్, 8జిబి ర్యామ్, 6.44-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చిన Vivo Y75 4G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తాజాగా Vivo Y75 4G ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైలర్ మహేశ్ టెలీకామ్ వెల్లడించింది. ఈ ఆఫర్ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. రూ.1000 డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.19,999 కి లభిస్తుంది. డిస్కౌంట్ లేకుండా ఈ ఫోన్ ధర రూ.20,999 గా ఉంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

భారత్ లో Vivo Y75 4G ధర

Vivo Y75 4G ఫోన్ రూ.20,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇది 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ గల సింగిల్ వేరియంట్ లోనే లభ్యమవుతుంది. ప్రస్తుతం రూ.1000 ధర తగ్గింపుతో ఫోన్ రూ.19,999 కే లభిస్తోంది. ఆఫ్‌లైన్ రిటైలర్ మహేశ్ టెలీకామ్ ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.1,500 క్యాష్ బ్యాక్ లభించనుంది.

Vivo Y75 4G స్పెసిఫికేషన్స్

Vivo Y75 4G స్మార్ట్ ఫోన్ 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు. ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 4జిబి వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. Vivo Y75 4G డివైజ్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo Y75 4G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, డ్యూయల్ సిమ్, టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Vivo Y75 4G ఫోన్ 160.87 మిల్లీ మీటర్ల పొడవు, 74.28 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.41 మిల్లీ మీటర్ల మందం, 172 గ్రాముల బరువు ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4050 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y75 4G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మైక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 44ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Vivo Y75 4G స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>