Vivo Y75 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Sep 2022 12:27:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన Vivo https://www.91mobiles.com/telugu/vivo-ganesh-chaturthi-offers-huge-discounts/ Thu, 01 Sep 2022 12:27:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=2045 హైలైట్స్: పలు ఫోన్లపై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన వివో Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై ఆఫర్ వర్తింపు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉండనున్న వివో గణేశ్ చతుర్థి ఆఫర్ Vivo కంపెనీ వినాయక చవితి పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ తో వచ్చింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఈ ఆఫర్ ఉపయోగపడనుంది. తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Vivo V25 Pro, […]

The post Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన Vivo first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • పలు ఫోన్లపై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన వివో
  • Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై ఆఫర్ వర్తింపు
  • సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉండనున్న వివో గణేశ్ చతుర్థి ఆఫర్

Vivo కంపెనీ వినాయక చవితి పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ తో వచ్చింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఈ ఆఫర్ ఉపయోగపడనుంది. తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Vivo V25 Pro, Vivo X80, Vivo Y75 పై గణేశ్ చతుర్థి పండుగ సందర్భంగా వివో కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్స్ లేటెస్ట్ టెక్నీలజీ, సూపర్ స్పెసిఫికేషన్స్, కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చాయి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్స్ లో ఉత్తమమైన ఫోటోగ్రఫీ నాణ్యత, ఐ-ఏఎఫ్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ వివో స్మార్ట్ ఫోన్స్ పై అందుబాటులో ఉన్న గణేశ్ చతుర్థి ఆఫర్స్ యొక్క వివరాలను ఇక్కడ అందజేస్తున్నాం.

Vivo గణేశ్ చతుర్థి ఆఫర్

వివో ప్రకటించిన గణేశ్ చతుర్థి ఆఫర్ లో భాగంగా కంపెనీ వివో వీ25 ప్రో, ఎక్స్80, వై75 ఫోన్లను ఐసీఐసీఐ, కొటక్ మహింద్రా, ఎస్‌బీఐ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ తో కొంటే ప్రయోజనాలు లభించనున్నాయి.

Vivo X80 series, V25 Pro, Y75 పై డిస్కౌంట్

వివో ఎక్స్80 సిరీస్ పై రూ.4000 డిస్కౌంట్ లభించనుంది. వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ పై రూ.3500 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక వివో వై75 ఫోన్ కొనుగోలు పై రూ.1500 డిస్కౌంట్ వస్తుంది.

Vivo V25 Pro

ఈ స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఓఐఎస్ తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ చేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ తో తయారైంది. 120 హెర్ట్జ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 32ఎంపి ఆటో ఫోకస్ కెమెరా ఇందులో ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్ ఇందులో అమర్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4830ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Vivo Y75

వివో వై75 స్మార్ట్ ఫోన్లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, డ్యూయల్ సిమ్, టైప్-సీ పోర్ట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Vivo X80

వివో ఎక్స్80 ని కూడా ఈ గణేశ్ చతుర్థి ఆఫర్ లో తక్కువ రేటుకే కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్80 స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్, ప్రీమియమ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్లో జైస్ గింబల్ సపోర్ట్ పోట్రెయిట్ కెమెరా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ను ఈ ఫోన్లో అమర్చారు. 50ఎంపి అల్ట్రా సెన్సింగ్ ఐఎంఎక్స్866 ప్రైమరీ కెమెరా ఈ ఫోన్లో ఉంది. అలాగే ఈ ఫోన్లో ఉత్తమ ఫోటోగ్రఫీ కొరకు ప్రో-ఇమేజింగ్ వీ1+ చిప్ ని అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన Vivo first appeared on 91Mobiles Telugu.

]]>