Vivo Y76s (t1 version) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 18 Nov 2022 08:18:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Dimensity 700 చిప్, 50MP డ్యూయల్ కెమెరాస్ తో లాంచ్ అయిన Vivo Y76s (t1 version) https://www.91mobiles.com/telugu/vivo-y76s-t1-version-launched-china-price-specs/ Fri, 18 Nov 2022 08:18:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=3524 హైలైట్స్ చైనాలో లాంచ్ అయిన Vivo Y76s (t1 version) స్మార్ట్ ఫోన్ గతేడాది వచ్చిన Vivo Y76s కి కొత్త వర్షన్ గా వచ్చిన Vivo Y76s (t1 version) 6.58-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తాజాగా చైనాలో Vivo Y76s (t1 version) ఫోన్ ని లాంచ్ చేసింది. […]

The post Dimensity 700 చిప్, 50MP డ్యూయల్ కెమెరాస్ తో లాంచ్ అయిన Vivo Y76s (t1 version) first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన Vivo Y76s (t1 version) స్మార్ట్ ఫోన్
  • గతేడాది వచ్చిన Vivo Y76s కి కొత్త వర్షన్ గా వచ్చిన Vivo Y76s (t1 version)
  • 6.58-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తాజాగా చైనాలో Vivo Y76s (t1 version) ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది గతేడాది వచ్చిన Vivo Y76s కి కొత్త వర్షన్. ఈ కొత్త వై-సిరీస్ ఫోన్ డిజైన్ పరంగా గత మోడల్ మాదిరే ఉంది కానీ, డిఫరెంట్ హార్డ్‌వేర్ తో వస్తోంది. ఫోన్ కర్వ్డ్ బ్యాక్, ఫ్రేమ్ తో వస్తోంది. ప్రాసెసర్ కూడా మారింది.

Vivo Y76s (t1 version) చైనాలో 3 కలర్ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యింది. అయితే సింగిల్ స్టోరేజీ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఓసారి Vivo Y76s (t1 version) యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Vivo Y76s (t1 version) ధర, స్పెసిఫికేషన్స్

Vivo Y76s (t1 version) 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర CNY 1899 (సుమారు రూ.21,800). స్టార్ డైమండ్ వైట్, గెలాక్సీ వైట్, స్టారీ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, Vivo Y76s (t1 version) 6.58-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఈ స్క్రీన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్ప్లే పై వాటర్ డ్రాప్ నాచ్ ఉంది.

Vivo Y76s (t1 version) లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 50 ఎంపి మెయిన్ కెమెరా, 2 ఎంపి సెకండరీ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y76s (t1 version) లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అమర్చారు. గతేడాది వచ్చిన Vivo Y76s లో డైమెన్సిటీ 810 చిప్సెట్ వాడారు. దీన్ని బట్టి t1 version పెర్ఫామెన్స్ విషయంలో డౌన్ గ్రేడ్ కాబడిందని చెప్పాలి. 12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Vivo Y76s (t1 version) లో 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ 163.84 మిల్లీ మీటర్ల పొడవు, 75.00 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.79 మిల్లీ మీటర్ల మందం, 175 గ్రాముల బరువు ఉంటుంది. Vivo Y76s (t1 version) ఆండ్రాయిడ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

భారత్ లో Vivo Y76s (t1 version) లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియదు. కంపెనీ నుంచి ఈ విషయమై ఓ ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ డివైజ్ భారత్ కి వస్తే గనుక, సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో మిగతా బ్రాండ్స్ బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్లను అందిస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dimensity 700 చిప్, 50MP డ్యూయల్ కెమెరాస్ తో లాంచ్ అయిన Vivo Y76s (t1 version) first appeared on 91Mobiles Telugu.

]]>