Vivo Y78+ 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 29 May 2023 12:11:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 64ఎంపి కెమెరా, 16జిబి ర్యామ్ తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y78 5G https://www.91mobiles.com/telugu/vivo-y78-5g-launched-globally-specs-color-options-other-details/ Mon, 29 May 2023 12:11:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=6524 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ ని మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ తో కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ ని సదరు సంస్థ గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే కొన్ని మార్పులతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. మరి ఆ మార్పులు, ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo Y78 5G స్పెసిఫికేషన్స్ డిస్ప్లే 6.64-ఇంచ్ […]

The post 64ఎంపి కెమెరా, 16జిబి ర్యామ్ తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y78 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సింగపూర్ లో లాంచ్ అయిన Vivo Y78 5G
  • 16ఎంపి ఫ్రంట్, 64ఎంపి రియర్ కెమెరాలతో వచ్చిన డివైజ్
  • Vivo Y78 5G ధర రూ.20,000 గా ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ ని మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ తో కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ ని సదరు సంస్థ గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే కొన్ని మార్పులతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. మరి ఆ మార్పులు, ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y78 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.64-ఇంచ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ ఉన్నాయి.

ప్రాసెసర్, ఓఎస్

  • స్నాప్ డ్రాగన్ 695 చిప్
  • ఆండ్రాయిడ్ 13

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ

  • 8జిబి ఇంటర్నల్ ర్యామ్
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • 256జిబి స్టోరేజీ

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో ఎక్స్‌టెండబుల్ ర్యామ్ టెక్నాలజీని అందించారు. దీని ద్వారా 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని పొందవచ్చు. అంటే 8జిబి ఇంటర్నల్ ర్యామ్ తో కలుపుకుని మొత్తం 16జిబి యూజర్ కి లభిస్తుంది. 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా విభాగం

  • 64ఎంపి మెయిన్ కెమెరా
  • 2ఎంపి సెకండరీ లెన్స్

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వచ్చింది. ఇంకా 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్
  • 44 వాట్

Vivo Y78 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y78 5G ధర

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ వివో సింగపూర్ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. అయితే ఫోన్ ధరను గురించి ఇంకా కంపెనీ నుంచి సమాచారం బయటకు రాలేదు. ఫ్లేర్ బ్లాక్ మరియు డ్రీమీ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభించనుంది. అయితే Vivo Y78 5G డివైజ్ ధర రూ.20,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ధర వివరాలను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే డివైజ్ ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి కూడా అందుబాటులోకి రానుంది.

The post 64ఎంపి కెమెరా, 16జిబి ర్యామ్ తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y78 5G first appeared on 91Mobiles Telugu.

]]>
మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y78-5g-launched-china-price-specs/ Thu, 11 May 2023 15:47:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=6262 Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇదొక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. ఈ చిప్సెట్ డైమెన్సిటీ 930 కి రీబ్యాడ్జ్ వర్షన్ అని సమాచారం. Vivo Y78 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. డ్యూయల్ రియర్ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ […]

The post మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y78 5G స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Vivo Y78 ధర CNY 1399 (సుమారు రూ.16,600)

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇదొక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. ఈ చిప్సెట్ డైమెన్సిటీ 930 కి రీబ్యాడ్జ్ వర్షన్ అని సమాచారం. Vivo Y78 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. డ్యూయల్ రియర్ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూనిక్ గ్రేడియంట్ డిజైన్ కలిగిన బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

సరే, ఓసారి Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y78 5G ధర, సేల్ వివరాలు

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ 8జిబి+128జిబి యూనిట్ ధర CNY 1399 (సుమారు రూ.16,600) గా ఉంది. అయితే 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి వేరియంట్స్ ధరలు ఇంకా తెలియలేదు. ఈ ఫోన్ బ్లాక్, జేడ్ పార్సెలిన్ బ్లూ మరియు ఫీనిక్స్ ఫెదర్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y78 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2388*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 91.06 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 394 పీపీఐ, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 7020 చిప్
  • 12జిబి ర్యామ్
  • 256జిబి స్టోరేజీ

Vivo Y78 5G హ్యాండ్సెట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఈ వివో ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • 2ఎంపి బొకే సెన్సర్

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బెకే సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, కనెక్టివిటీ

  • 5000 ఎంఏహెచ్
  • 5జీ, 4జీ వొల్టీ

Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. Vivo Y78 5G లో 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది.

The post మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78+ 5G https://www.91mobiles.com/telugu/vivo-y78-plus-launched-china-price-specifications/ Mon, 24 Apr 2023 09:44:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=6008 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన స్వదేశం చైనాలో కొత్త 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y78+ 5G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ 12జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 50ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y78+ 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం. పదండి. Vivo Y78+ 5G స్పెసిఫికేషన్స్ డిస్ప్లే 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే 120 […]

The post 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y78+ 5G డివైజ్
  • 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న స్మార్ట్ ఫోన్
  • అందుబాటులో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన స్వదేశం చైనాలో కొత్త 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y78+ 5G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ 12జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 50ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y78+ 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం. పదండి.

Vivo Y78+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo Y78+ 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 16.7 మిలియన్ కలర్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ మరియు చిప్సెట్

  • ఒరిజిన్ఓఎస్ 3
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్

Vivo Y78+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో 619 జీపీయూ వాడారు.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ సెన్సర్

Vivo Y78+ 5G ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్
సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y78+ 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ మోడ్ 5జీ, 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వచ్చింది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo Y78+ 5G ధర

Vivo Y78+ 5G స్మార్ట్ ఫోన్ మొత్తం 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి + 128జిబి వేరియంట్ ధర 1599 యువాన్లు (సుమారు రూ.19,000), 8జిబి + 256జిబి వేరియంట్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.21,300) మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర 1999 యువాన్లు (సుమారు రూ.23,500) గా ఉంది. భారత్ లో లాంచ్ అయితే గనుక, ఈ ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>