Vivo Y78m (t1) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 11 Oct 2023 13:01:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 చైనాలో లాంచైన Vivo Y78 (t1), Y78m (t1) https://www.91mobiles.com/telugu/vivo-y78-t1-y78m-t1-launched-china-price-specs-availability/ Wed, 11 Oct 2023 13:01:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=8347 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తాజాగా చైనాలో రెండు కొత్త వై-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Vivo Y78 (t1) మరియు Vivo Y78m (t1). ఈ రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ లో-బడ్జెట్ చిప్ వాడారు. డైమెన్సిటీ 6020 చిప్ ని ఈ ఫోన్లలో ఎక్విప్ చేశారు. ఇది చవకైన 5జీ ప్రాసెసర్. ప్రస్తుతానికి ఈ రెండు ఫోన్లు చైనా మార్కెట్ కే పరిమితం కానున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ పై ఇంకా క్లారిటీ […]

The post చైనాలో లాంచైన Vivo Y78 (t1), Y78m (t1) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 12జిబి ర్యామ్ తో వచ్చిన Vivo Y78 (t1), Y78m (t1)
  • రెండు డివైజెస్ లోనూ ఎక్విప్ అయిన డైమెన్సిటీ చిప్
  • చైనాలో ఈ డివైజెస్ ధర రూ.22,800

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తాజాగా చైనాలో రెండు కొత్త వై-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Vivo Y78 (t1) మరియు Vivo Y78m (t1). ఈ రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ లో-బడ్జెట్ చిప్ వాడారు. డైమెన్సిటీ 6020 చిప్ ని ఈ ఫోన్లలో ఎక్విప్ చేశారు. ఇది చవకైన 5జీ ప్రాసెసర్. ప్రస్తుతానికి ఈ రెండు ఫోన్లు చైనా మార్కెట్ కే పరిమితం కానున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Vivo Y78 (t1), Vivo Y78m (t1) ధర

చైనాలో Vivo Y78 (t1), Vivo Y78m (t1) 5జీ స్మార్ట్ ఫోన్లు సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ తో వచ్చాయి. వీటి ధర RMB 1,999 (సుమారు రూ.22,800) ఉంది. ఈ రెండు ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతాయా? లేదా? అనే విషయం ఇంకా తెలియదు. సరే, ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y78 (t1) 5G, Vivo Y78m (t1) 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y78 (t1), Vivo Y78m (t1) ఫోన్లలో 6.64-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2388*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y78 (t1), Vivo Y78m (t1) డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Vivo Y78 (t1), Vivo Y78m (t1) ఫోన్లలో 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: రెండు ఫోన్లలోనూ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: ఈ రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: ఈ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: ఈ రెండు ఫోన్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్-సిమ్, 5జీ, వై-ఫఐ, బ్లూటూత్ 5.1, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post చైనాలో లాంచైన Vivo Y78 (t1), Y78m (t1) first appeared on 91Mobiles Telugu.

]]>