Vodafone Idea Rs 2999 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Dec 2022 15:05:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 850GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ ప్లాన్ తీసుకొచ్చిన Vodafone Idea https://www.91mobiles.com/telugu/vodafone-idea-introduces-new-yearly-plan/ Sun, 11 Dec 2022 03:35:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=3919 హైలైట్స్ తన కస్టమర్ల కోసం కొత్త యాన్యువల్ ప్లాన్ తీసుకొచ్చిన Vodafone Idea ఈ ప్యాక్ తో 850జిబి హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్, 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న వొడాఫోన్ ఐడియా Vodafone Idea అందిస్తోన్న ఏడాది కాలపరిమితి గల ఈ ప్యాక్ ధర రూ.2,999 Vodafone Idea తన కస్టమర్ల కోసం 365 రోజుల వ్యాలిడిటీ గల సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఇప్పటికే Vodafone Idea మూడు ఏడాది వ్యాలిడిటీ […]

The post 850GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ ప్లాన్ తీసుకొచ్చిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • తన కస్టమర్ల కోసం కొత్త యాన్యువల్ ప్లాన్ తీసుకొచ్చిన Vodafone Idea
  • ఈ ప్యాక్ తో 850జిబి హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్, 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న వొడాఫోన్ ఐడియా
  • Vodafone Idea అందిస్తోన్న ఏడాది కాలపరిమితి గల ఈ ప్యాక్ ధర రూ.2,999

Vodafone Idea తన కస్టమర్ల కోసం 365 రోజుల వ్యాలిడిటీ గల సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఇప్పటికే Vodafone Idea మూడు ఏడాది వ్యాలిడిటీ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. అవి: రూ.3099, రూ.2,899, రూ.1799 ప్లాన్స్. తాజాగా రూ.2,999 ఏడాది ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ Vodafone Idea అధికార వెబ్ సైట్ కనిపిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ఇంకా మరెన్నో ప్రయోజనాలు లభిస్తాయి. పదండి, ఈ ప్లాన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vodafone Idea రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ

Vodafone Idea తన భారతీయ కస్టమర్ల కోసం రూ.2,999 విలువగల ఏడాది రీచార్జ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 850జిబి డేటా లభిస్తుంది. అలాగే 365 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అంతేకాదండోయ్, ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు పైన తెలిపిన ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

Vodafone Idea రూ.2,999 ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే తన యూజర్లకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వీఐ మూవీస్ మరియు వీఐ టీవీ సిరీస్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా అన్ని ప్రీమియమ్ ఫిల్మ్స్, ఒరిజినల్ ప్రొగ్రామింగ్, లైవ్ టీవీ, న్యూస్ మరియు మరెన్నింటినో వీఐ మూవీస్ మరియు టీవీ క్లాసిక్ యాప్స్ ద్వారా పొందవచ్చు.

ఈ ప్లాన్ ద్వారా బింజ్ ఆన్ నైట్ పెర్క్స్ కూడా వస్తాయి. అంటే, రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచితంగా డేటాను వాడుకోవచ్చు. ప్లాన్ నుంచి ఎటువంటి డేటా చార్జెస్ ఉండవు.

ఈ ప్లాన్ ద్వారా మీకు అందించబడిన 850 జిబి డేటా పూర్తయిపోతే, మీరు మరొక యాడ్-ఆన్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవచ్చు. లేదంటే 1ఎంబి కి రూ.50 పైసలు చార్జ్ అవుతాయి. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లిమిట్ పూర్తయ్యాక, మీరు పంపే ప్రతీ లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.50 పైసలు వసూలు చేయబడతాయి.

Vodafone Idea తాజాగా తన వినియోగదారుల కోసం తీసుకొచ్చిన రూ.2,999 విలువ గల ప్లాన్ వివరాలను మీకు అందజేశాం. ఓసారి ఏయే ప్రయోజనాలు వస్తున్నాయో చూసి మీకు ధర నచ్చితే గనుక రీచార్జ్ చేసుకోండి. ఒక ఏడాది పాటు నిశ్చింతగా రీచార్జ్ గోల లేకుండా హ్యాపీగా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 850GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ ప్లాన్ తీసుకొచ్చిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>