Xiaomi 12 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 01 Mar 2023 05:52:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Price Drop: Xiaomi 12 Pro స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు https://www.91mobiles.com/telugu/xiaomi-12-pro-price-drop-bank-offers-exchange-benefits/ Wed, 01 Mar 2023 05:52:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=5158 భారత్ లో Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేశాక, చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమి గతేడాది వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ Xiaomi 12 Pro పై ధరను భారీగా తగ్గించింది. Xiaomi 13 Pro లాంచ్ సమయంలోనే Xiaomi 12 Pro ధరను రూ.10,000 తగ్గించనున్నామని కంపెనీ తెలిపింది. సరే, ఓసారి Xiaomi 12 Pro తగ్గిన ధర, ఆఫర్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి. భారత్ లో తగ్గిన Xiaomi […]

The post Price Drop: Xiaomi 12 Pro స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించిన షావోమి సంస్థ
  • ఇటీవలె భారత్ లో Xiaomi 13 Pro లాంచైన నేపథ్యంలో గత మోడల్ పై రూ.10,000 తగ్గింపు
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ తో వచ్చిన Xiaomi 12 Pro

భారత్ లో Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేశాక, చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమి గతేడాది వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ Xiaomi 12 Pro పై ధరను భారీగా తగ్గించింది. Xiaomi 13 Pro లాంచ్ సమయంలోనే Xiaomi 12 Pro ధరను రూ.10,000 తగ్గించనున్నామని కంపెనీ తెలిపింది. సరే, ఓసారి Xiaomi 12 Pro తగ్గిన ధర, ఆఫర్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో తగ్గిన Xiaomi 12 Pro ధర, ఆఫర్లు

Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి+256జిబి మోడల్ భారత్ లో రూ.62,999 ధరతో లాంచ్ అయ్యింది. 12జిబి+256జిబి వేరియంట్ రూ.66,999 తో మార్కెట్ లోకి వచ్చింది. అయితే Xiaomi 13 Pro ధరను రివీల్ చేసిన తర్వాత Xiaomi 12 Pro ధరను తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం Xiaomi 12 Pro ఫోన్ బేస్ వేరియంట్ రూ.52,999 ధరకు, టాప్-ఎండ్ వేరియంట్ రూ.56,999 ధరకు లభిస్తున్నాయి.

మరోవైపు Xiaomi సంస్థ Xiaomi 12 Pro కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇందులో భాగంగా ఫోన్ ని HDFC బ్యాంక్ కార్డ్ తో కొనేవారికి రూ.3,000 డిస్కౌంట్ లభించనుంది. లేదంటే దీని బదులుగా రూ.3,000 ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర మరింత తగ్గనుంది.

Xiaomi 12 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ లో 6.73-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+ ఉన్నాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్707 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి 2x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Xiaomi 12 Pro డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. పవర్ బ్యాకప్ కోసం 4600mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 120W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఇంటెలిజెంట్ స్మార్ట్ చార్జింగ్ చిప్సెట్ తో వచ్చింది. Xiaomi 12 Pro డివైజ్ ని కొనాలని భావించే వారు ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, ఆఫర్ వివరాలను తెలుసుకుని మీకు తగినదైతే కొనుగోలు చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Price Drop: Xiaomi 12 Pro స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు first appeared on 91Mobiles Telugu.

]]>