Xiaomi 14 SE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 01 May 2024 08:09:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Xiaomi: వచ్చే నెలలో Xiaomi 14 SE భారత్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/xiaomi-14-se-might-launch-india-next-month/ Wed, 01 May 2024 06:08:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=11288 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi కొన్ని రోజుల క్రితం Xiaomi 14, 14 Ultra ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు Xiaomi 14 SE డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ వచ్చే నెల భారత్ లో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఇకపోతే, షావోమి 14 ఎస్ఈ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి ఇండియా లాంచ్ […]

The post Xiaomi: వచ్చే నెలలో Xiaomi 14 SE భారత్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi 14 SE లాంచ్
  • CiVi 4 Pro కి రీబ్రాండ్ వర్షన్?
  • ధర సుమారు రూ.50,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi కొన్ని రోజుల క్రితం Xiaomi 14, 14 Ultra ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు Xiaomi 14 SE డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ వచ్చే నెల భారత్ లో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఇకపోతే, షావోమి 14 ఎస్ఈ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి ఇండియా లాంచ్ టైమ్‌లైన్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

Xiaomi 14 SE ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Xiaomi 14 SE స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ షేర్ చేశారు. 2024 జూన్ నెలలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ చెప్పారు. ధర రూ.50,000 వద్ద ఉంటుందని అంచనా వేశారు. చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న Xiaomi CIVI 4 Pro కి రీబ్రాండ్ వర్షన్‌గా Xiaomi 14 SE వస్తున్నట్లు సమాచారం.

Xiaomi 14 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Xiaomi 14 SE లో 6.55-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2750*1236 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Xiaomi 14 SE లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ఓఎస్: Xiaomi 14 SE ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 SE డివైజ్ లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14 SE లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Xiaomi 14 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

కనెక్టివిటీ: Xiaomi 14 SE లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Xiaomi: వచ్చే నెలలో Xiaomi 14 SE భారత్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>