Xiaomi Book Air 13 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 28 Oct 2022 14:02:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 13.3-ఇంచ్ OLED డిస్ప్లే తో లాంచ్ అయిన Xiaomi Book Air 13: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-book-air-13-launched-china-price-specs/ Sat, 29 Oct 2022 04:35:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=3132 హైలైట్స్ Xiaomi Book Air 13 ని చైనాలో లాంచ్ చేసిన షావోమీ సంస్థ రెడ్మీ 12 సిరీస్ ఫోన్లతో పాటు లాంచ్ అయిన Xiaomi Book Air 13 ఇంటెల్ 12వ తరం సీపీయూ, 360-డిగ్రీ ఫ్లిప్ డిజైన్ తో వచ్చిన Xiaomi Book Air 13 Xiaomi Book Air 13 నోట్ బుక్ ని షావోమీ కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. రెడ్మీ 12 సిరీస్ ఫోన్లతో పాటు Xiaomi Book Air […]

The post 13.3-ఇంచ్ OLED డిస్ప్లే తో లాంచ్ అయిన Xiaomi Book Air 13: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Xiaomi Book Air 13 ని చైనాలో లాంచ్ చేసిన షావోమీ సంస్థ
  • రెడ్మీ 12 సిరీస్ ఫోన్లతో పాటు లాంచ్ అయిన Xiaomi Book Air 13
  • ఇంటెల్ 12వ తరం సీపీయూ, 360-డిగ్రీ ఫ్లిప్ డిజైన్ తో వచ్చిన Xiaomi Book Air 13

Xiaomi Book Air 13 నోట్ బుక్ ని షావోమీ కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. రెడ్మీ 12 సిరీస్ ఫోన్లతో పాటు Xiaomi Book Air 13 కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇంటెల్ 12 వ తరం సీపీయూ, 360-డిగ్రీ ఫ్లిప్ డిజైన్ వంటి ఫీచర్లను ఈ నోట్ బుక్ కలిగి ఉంది. Xiaomi Book Air 13 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Xiaomi Book Air 13 నోట్ బుక్ ని షావోమీ చైనాలో రెండు కన్ఫిగరేషన్స్ లో లాంచ్ చేసింది. ఈ రెండింట్లో ఇంటెల్ కంపెనీ తయారు చేసిన 12వ తరం చిప్సెట్స్ ని వాడటం జరిగింది. ఈ నోట్ బుక్ లో ప్రొవైడ్ చేసిన హింజ్ ద్వారా 360-డిగ్రీల కోణంలో నోట్ బుక్ ని తిప్పవచ్చు. ఓసారి Xiaomi Book Air 13 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాల గురించి తెలుసుకుందాం పదండి.

Xiaomi Book Air 13 ధర, స్పెసిఫికేషన్స్

Xiaomi Book Air 13 ని షావోమీ చైనాలో లాంచ్ చేసింది. Xiaomi Book Air 13 డివైజ్ Core i5-1230U మరియు Core i7-1250U CPU వేరియంట్స్ లో లభిస్తుంది. కోర్ ఐ5 వేరియంట్ ధర CNY 4999 (సుమారు రూ.57,000) కాగా, కోర్ ఐ7 వేరియంట్ ధర CNY 5599 (సుమారు రూ.63,800) గా ఉంది.

ఈ ల్యాప్ టాప్ సింగిల్ వైట్ కలర్ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది. ఇది 16జిబి ర్యామ్, 512జిబి SSD ని కలిగి ఉంది.

Xiaomi Book Air 13 టూ ఇన్ వన్ డిజైన్ తో వస్తోంది. ఇందులో 13.3-ఇంచ్ ఈ4 ఓఎల్ఈడీ డిస్ప్లే, 2880*1800 పిక్సెల్ రెజుల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. ఈ స్క్రీన్ 600 నిట్స్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్ ని కలిగి ఉంది. ఈ ల్యాప్ టాప్ లో డాల్బి విజన్ సపోర్ట్ కూడా ఉంది.

Xiaomi Book Air 13 లో 360-డిగ్రీస్ హింజ్ ఉండటం వల్లన, దీన్ని విభిన్న రీతుల్లో వాడుకునే వీలుంది. ఈ ల్యాప్ టాప్ స్క్రీన్ టచ్ సపోర్ట్ తో వస్తోంది. ఇకపోతే Xiaomi Book Air 13 నోట్ బుక్ బరువు 1.2 కిలోలు ఉంటుంది. కాగా ఈ నోట్ బుక్ 12 మిల్లీ మీటర్ల మందం కలిగి ఉంది.

మల్టీమీడియా విషయానికి వస్తే Xiaomi Book Air 13 నోట్ బుక్ లో డాల్బి అట్మాస్ సపోర్ట్, రెండు మైక్రోఫోన్లు, భారీ గ్లాస్ టచ్ ప్యాడ్, బ్యాక్ లిట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. వీడియో కాల్స్ కోసం Xiaomi Book Air 13 లో 8ఎంపి వెబ్ క్యామ్ ఉంది. ఐ7 వర్షన్ లో Intel Iris Xe GPU అందించారు. రెండు వేరియంట్లలో వేపర్-కూలింగ్ హీట్ సింక్ ఫీచర్ ఉంది.

Xiaomi Book Air 13 నోట్ బుక్ లో 58.3WHr బ్యాటరీ ఉంది. ఇది 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. యూఎస్బీ టైప్-సీ థండర్ బోల్ట్ 4 పోర్ట్స్, 3.5ఎంఎం ఆడియో జాక్, వైఫై-6ఈ, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Xiaomi Book Air 13 విండోస్ 11 ఓఎస్ పై పని చేస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ లో Xiaomi Book Air 13 ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 13.3-ఇంచ్ OLED డిస్ప్లే తో లాంచ్ అయిన Xiaomi Book Air 13: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>