Xiaomi EV - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 05 Jan 2023 12:30:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2024 లో లాంచ్ కానున్న Xiaomi Electric Car https://www.91mobiles.com/telugu/xiaomi-electric-car-to-launch-in-2024/ Thu, 05 Jan 2023 12:29:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4353 హైలైట్స్ 2024 కల్లా పలు దేశాల్లో లాంచ్ కానున్న Xiaomi Electric Car రెడ్మీ నోట్ 12 సిరీస్ ఇండియా లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఈ-కార్ విషయాన్ని రివీల్ చేసిన షావోమి Xiaomi EV అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ పేరుని రిజిస్టర్ చేయించిన షావోమి సంస్థ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఎన్నో కంపెనీలు ఈ సెగ్మెంట్ లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ వరుసలో ప్రముఖ స్మార్ట్ […]

The post 2024 లో లాంచ్ కానున్న Xiaomi Electric Car first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2024 కల్లా పలు దేశాల్లో లాంచ్ కానున్న Xiaomi Electric Car
  • రెడ్మీ నోట్ 12 సిరీస్ ఇండియా లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఈ-కార్ విషయాన్ని రివీల్ చేసిన షావోమి
  • Xiaomi EV అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ పేరుని రిజిస్టర్ చేయించిన షావోమి సంస్థ

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఎన్నో కంపెనీలు ఈ సెగ్మెంట్ లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ వరుసలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన షావోమి కూడా చేరబోతోంది. త్వరలోనే ఈ సంస్థ ఒక ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనుందని సమాచారం.

భారత్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ సందర్భంగా.. త్వరలో తాము ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయబోతున్నట్లు షావోమి తెలిపింది. 2024 లో Xiaomi Electric Car లాంచ్ అవుతుందని షావోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ స్వయంగా వెల్లడించారు. 2024 కల్లా పలు దేశాల్లో Xiaomi Electric Car పరుగులు తీయనుంది.

Xiaomi Electric Car లాంచ్ ని స్వయంగా ప్రకటించిన షావోమి

Xiaomi Electric Car లాంచ్ టైమ్ లైన్ ని షావోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ స్వయంగా వెల్లడించారు. నేడు భారత్ లో జరిగిన Redmi Note 12 సిరీస్ ఈవెంట్ లో మను కుమార్ Xiaomi Electric Car ప్రకటన చేశారు. 2024 కల్లా Xiaomi Electric Car కొన్ని దేశాల్లో లాంచ్ అవుతుందని ఆయన అన్నారు. ఇది కాకుండా, కారుకి సంబంధించిన మరే ఇతర విషయాలను ఆయన తెలపలేదు. అయితే రానున్న రోజుల్లో Xiaomi Electric Car కి సంబంధించిన సమాచారం షావోమి నుంచి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఓసారి గతంలోకి వెళ్తే, Xiaomi కంపెనీ Xiaomi EV అనే పేరుతో ఒక ఎలక్ట్రిక్ కారుని రిజిస్టర్ చేయించింది. తమ నుంచి రాబోవు ఈవీ ఉత్పత్తి మరియు అభివృద్ధికై 10 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టబోతున్నట్లు షావోమి ఇదివరకు ప్రకటించింది. ఎస్‌యూవీ లేదా సెడాన్ సెగ్మెంట్ లో షావోమి తన ఈవీని తీసుకురానున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఇప్పటికే మొదలైందని, ప్లాన్ లో భాగంగా, 140 టెస్ట్ వెహికిల్స్ ని 2024 లో దేశ వ్యాప్తంగా సరఫరా చేయనున్నామని Xiaomi CEO లీ జున్ చెప్పినట్లు పలు మీడియా కథనాల ద్వారా తెలిసింది.

Xiaomi Electric Car ధర

Xiaomi Electric Car ధర 40,000 డాలర్లకు పైనే ఉండనుందని సమాచారం. అంటే భారత కరెన్సీలో రూ.33,04,174 లకు పైనే ధర ఉండనుంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2024 లో లాంచ్ కానున్న Xiaomi Electric Car first appeared on 91Mobiles Telugu.

]]>