Xiaomi Fan Days Sale - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 04 May 2023 18:16:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 షావోమి ఫ్యాన్ డేస్ సేల్ 2023: Redmi Pad, Xiaomi 11i HyperCharge ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/xiaomi-fan-days-sale-discounts-bank-offers/ Thu, 04 May 2023 18:16:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=6178 నేడు షావోమి ఫ్యాన్ డేస్ సేల్ అఫీషియల్ గా ప్రారంభమైంది. ఈ సేల్ వారం పాటు కొనసాగుతుంది. వారం పాటు నడిచే ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లతో పాటు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్ తదితర వాటిపై డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ లభిస్తాయి. ఇప్పటికే షావోమి, రెడ్మీ స్మార్ట్ ఫోన్లు వాడుతోన్న యూజర్లు కూడా ఎక్స్‌ట్రా ఎక్స్‌చేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. షావోమి ఫ్యాన్ డేస్ సేల్ తేదీ షావోమి […]

The post షావోమి ఫ్యాన్ డేస్ సేల్ 2023: Redmi Pad, Xiaomi 11i HyperCharge ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి ఎమ్ఐ.కామ్ లో మొదలైన షావోమి ఫ్యాన్ డేస్ సేల్
  • వారం పాటు కొనసాగనున్న డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్
  • షావోమి ఫ్యాన్ డేస్ సేల్ కి సంబంధించిన వివరాలు మీకోసం

నేడు షావోమి ఫ్యాన్ డేస్ సేల్ అఫీషియల్ గా ప్రారంభమైంది. ఈ సేల్ వారం పాటు కొనసాగుతుంది. వారం పాటు నడిచే ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లతో పాటు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్ తదితర వాటిపై డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ లభిస్తాయి. ఇప్పటికే షావోమి, రెడ్మీ స్మార్ట్ ఫోన్లు వాడుతోన్న యూజర్లు కూడా ఎక్స్‌ట్రా ఎక్స్‌చేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది.

షావోమి ఫ్యాన్ డేస్ సేల్ తేదీ

షావోమి ఫ్యాన్ డేస్ ప్రస్తుతం ఎంఐ.కామ్ లో ప్రారంభమైంది. మే 10 వరకు సేల్ కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి రూ.8,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి కూడా ఇదే డిస్కౌంట్ వర్తిస్తుంది. పేటీఎమ్ వ్యాలెట్ పై రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆఫర్లు కలుపుకుంటే షావోమి ఉత్పత్తులను చవకైన ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ మీకోసం టాప్ డీల్స్ ని అందించాం. ఓ కన్నేయండి.

షావోమి ఫ్యాన్ డేస్ సేల్ ఆఫర్స్

  • రెడ్మీ ప్యాడ్ ట్యాబ్లెట్ 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ రూ.12,999 తగ్గింపు ధరకి లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో రెడ్మీ ప్యాడ్ ని రూ.5,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఇవాళ మాత్రమే అందుబాటులో ఉంది. రెడ్మీ ప్యాడ్ అసలైతే రూ.14,999 ధరతో ప్రారంభమవుతుంది. ఈ డివైజ్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లభ్యమవుతుంది.
  • షావోమి ఓఎల్ఈడీ విజన్ టెలీవిజన్ 55-ఇంచ్ మోడల్ ధర రూ.99,999 గా ఉంది. కానీ సేల్ సందర్భంగా ఈ టీవీని రూ.71,999 కే సొంతం చేసుకోవచ్చు. రూ.25,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ.3,000 పేటీఎమ్ వ్యాలెట్ డిస్కౌంట్ కలుపుకుని సేల్ ధర రూ.71,999 కి చేరుతుంది. ఈ ఆఫర్ మే 5 వరకు మాత్రమే క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది.
  • స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే, Redmi K50i 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ధర రూ.19,499 కి తగ్గుతుంది. పాత డివైజ్ ని మార్చుకుని రూ.2,000 వరకు బోనస్ పొందవచ్చు.
  • రూ.23,999 ధర పలికే Xiaomi 11i HyperCharge 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ డివైజ్ ని ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ మరియు పేటీఎమ్ వ్యాలెట్ రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కలుపుకుని రూ.11,699 కి సొంతం చేసుకోవచ్చు.
  • Redmi Note 12 5G 4జిబి+128జిబి వేరియంట్ అసలు ధర రూ.17,999 గా ఉండగా, అన్ని డిస్కౌంట్లు కలుపుకుని రూ.15,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్లకు అదనంగా షావోమి మరెన్నో యాక్టివిటీస్ ని ఈ ఫ్యాన్ డేస్ సేల్ సందర్భంగా రన్ చేస్తోంది. ప్లే అండ్ విన్ సెగ్మెంట్ లో భాగంగా మీరు షావోమి ట్రిమ్మర్ 2సీ, రెడ్మీ వాచ్ 2 లైట్, రెడ్మీ రైటింగ్ ప్యాడ్ వంటివి గెలుచుకోవచ్చు. ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటలకు టిక్ టాక్ డీల్స్ ఉంటాయి. అప్పుడు ప్రొడక్ట్స్ పై 75 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

The post షావోమి ఫ్యాన్ డేస్ సేల్ 2023: Redmi Pad, Xiaomi 11i HyperCharge ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>