Xiaomi Fan Festival 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Apr 2024 17:56:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi 13C 5G ఫోన్‌ పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-13c-5g-discount-know-full-details/ Tue, 09 Apr 2024 17:56:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=11011 Xiaomi సబ్-బ్రాండ్ Redmi గతేడాది భారతీయ మార్కెట్ లో తక్కువ బడ్జెట్ 5జీ ఫోన్‌ Redmi 13C 5G ‌ని లాంచ్ చేసింది. మూడు వేరియంట్స్ లో వచ్చిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999 గా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫోన్‌ని ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం Xiaomi Fan Festival 2024 లో భాగంగా Redmi 5G డివైజ్ ని రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు. Redmi 13C 5G […]

The post Redmi 13C 5G ఫోన్‌ పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రారంభమైన Xiaomi ఫ్యాన్ ఫెస్టివల్
  • తగ్గిన Redmi 13C 5G ధర
  • ప్రస్తుత ధర రూ.9,499

Xiaomi సబ్-బ్రాండ్ Redmi గతేడాది భారతీయ మార్కెట్ లో తక్కువ బడ్జెట్ 5జీ ఫోన్‌ Redmi 13C 5G ‌ని లాంచ్ చేసింది. మూడు వేరియంట్స్ లో వచ్చిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999 గా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫోన్‌ని ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం Xiaomi Fan Festival 2024 లో భాగంగా Redmi 5G డివైజ్ ని రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు.

Redmi 13C 5G ధర

Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ మోడల్ రూ.10,999 ధరతో లాంచ్ అయ్యింది. కానీ, షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.9,499 కే లభిస్తోంది. అంటే ఈ ఫోన్ ధర రూ.500 తగ్గించడం జరిగింది. ఇంకా రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ 2024 లో భాగంగా అన్ని ఆఫర్లు కలుపుకుని Redmi 13C 5G 4జిబి ర్యామ్ ధర రూ.9,499 కి లభిస్తుంది. ఇతర వేరియంట్స్ విషయానికి వస్తే, 6జిబి ర్యామ్ మోడల్ ని రూ.11,999 కి కొనుగోలు చేయవచ్చు. 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 13C 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Redmi 13C 5G ఫోన్‌ పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>