Xiaomi MS11 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 07 Feb 2023 07:29:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్ కి ముందు లీకైన Xiaomi ఎలక్ట్రిక్ కారు ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/xiaomi-ms-11-sedan-ev-images-leaked-before-launch/ Tue, 07 Feb 2023 07:29:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=4812 షావోమి కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి రానుంది. Modena అనే కోడ్ నేమ్ ని ఈ కారు కలిగి ఉంది. తాజాగా Xiaomi MS11 ఎలక్ట్రిక్ సెడాన్ కారు యొక్క ఇమేజెస్ నెట్టింట్లో లీకైయ్యాయి. ఇక వాహనం గతంలో మంగోలియా లో టెస్టింగ్ కి వచ్చి కనిపించింది. ఇప్పుడు Rashlane వెబ్ సైట్ ద్వారా Xiaomi MS11 పిక్స్ బయటకు వచ్చాయి. రెండు బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్స్ లో Xiaomi MS11 కారు […]

The post లాంచ్ కి ముందు లీకైన Xiaomi ఎలక్ట్రిక్ కారు ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన Xiaomi ఎలక్ట్రిక్ కారు ఇమేజెస్
  • ఎల్ఈడీ లైట్స్, రియర్ లైట్ బార్, 5-స్పోక్ అల్లాయ్స్, గ్లాస్ రూఫ్, యెల్లో బ్రేక్ క్యాలిపర్స్ తో వస్తోన్న Xiaomi MS11
  • BYD Blade బ్యాటరీ ప్యాక్ లేదా ఫాస్ట్ చార్జింగ్ CATL బ్యాటరీ ప్యాక్ తో రానున్న Xiaomi MS11 ఎలక్ట్రిక్ కారు

షావోమి కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి రానుంది. Modena అనే కోడ్ నేమ్ ని ఈ కారు కలిగి ఉంది. తాజాగా Xiaomi MS11 ఎలక్ట్రిక్ సెడాన్ కారు యొక్క ఇమేజెస్ నెట్టింట్లో లీకైయ్యాయి. ఇక వాహనం గతంలో మంగోలియా లో టెస్టింగ్ కి వచ్చి కనిపించింది. ఇప్పుడు Rashlane వెబ్ సైట్ ద్వారా Xiaomi MS11 పిక్స్ బయటకు వచ్చాయి.

రెండు బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్స్ లో Xiaomi MS11 కారు లభించనున్నట్లు సమాచారం. ఒకటి BYD బ్యాటరీ, మరొకటి CATL బ్యాటరీ ప్యాక్. ఇంకా పెద్దగా వివరాలు ఏమీ తెలియలేదు. Xiaomi MS11 ఎలక్ట్రిక్ సెడాన్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు సమాచారం.

ప్రొడక్షన్-రెడీ రూపంలో కనిపంచిన Xiaomi MS11 ఎలక్ట్రిక్ సెడాన్ కారు

MS11 అనే రిజిస్ట్రేషన్ ప్లేట్ ని షావోమి ఎలక్ట్రిక్ కారు కలిగి ఉంది. 2024 లో షావోమి ఎలక్ట్రిక్ కారు అధికారికంగా లాంచ్ కానుంది. Xiaomi MS11 అనే పేరుతో ఈ కారు వస్తోంది.

ఇమేజెస్ ద్వారా కారు సెడాన్ బాడీ స్టైల్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. BYD Seal నుంచి డిజైన్ హంగులను Xiaomi MS11 కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఫ్రంట్ మరియు రియర్ లైట్స్ సిల్హోట్ మరియు స్టైలింగ్ ని చూస్తే అది స్పష్టమవుతోంది. ఫ్రంట్ లో సైజబుల్ హెడ్ ల్యాంప్, సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో స్పోర్టీ ఫ్రంట్ ఎయిర్ డ్యామ్ తో కనిపిస్తోంది. Xiaomi MS11 స్మూదర్-ఫ్లోయింగ్ లైన్స్ ని కలిగి, చూడటానికి సమతూకంగా కనిపిస్తోంది.

Xiaomi MS11 ఎలక్ట్రిక్ కారు 5-డోర్ సెడాన్ బాడీ స్టైల్, భారీ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, గ్లాస్ రూఫ్, భారీ డిస్క్ బ్రేక్స్, యెల్లో బ్రేక్ క్యాలిపర్స్ ని కలిగి ఉంటుంది. ఫ్రంట్ రూఫ్ భాగీగా కనిపిస్తోంది. ఇందులో ఏడీఏఎస్ కి సంబంధించిన లైడార్ సెన్సర్స్ ని అమర్చినట్లు తెలుస్తోంది. ఎల్ఎఫ్‌పీ టెక్నాలజీ తో పని చేసే BYD బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ ని Xiaomi MS11 కలిగి ఉంటుంది. మరొక మోడల్ CATL కి చెందిన 800V కిలిన్ బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉండనుంది. ఇది సూపర్-ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 80 శాతం చార్జ్ అయ్యేందుకు కేవలం 15 నిమిషాల సమయం పడుతుంది.

Xiaomi MS11 ఎలక్ట్రిక్ సెడాన్ కారు ధర (అంచనా)

Xiaomi MS11 ఎలక్ట్రిక్ కారు 2024 లో లాంచ్ కానుంది. ఈ కారు దరలు చైనాలో RMB 260,000 (సుమారు రూ.31,20,000), RMB 350,000 (సుమారు రూ.42,01,000) గా ఉంటాయని తెలుస్తోంది. షావోమి కంపెనీ Lemans అనే మరొక ఈవీ పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ కారు 2025 లో లాంచ్ కానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన Xiaomi ఎలక్ట్రిక్ కారు ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>