
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నేటి నుంచి మొదలైంది. ఈ సేల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. సేల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్, ఆఫర్స్ లభించనున్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ క్రింద, స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక్కడ మీకోసం ఉత్తమమైన స్మార్ట్ ఫోన్స్ డీల్స్ యొక్క జాబితాను రూపొందించాం. ఓసారి వాటిని పూర్తిగా చదివి మీకు సరిపడే డీల్ ఏదైనా ఉందో లేదో చెక్ చేయండి. ఏదైనా ఓకే అనిపిస్తే ఆ ఉత్పత్తిని ఆఫర్ ముగిసే లోపు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి.
OnePlus 11 5G
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ సేల్ లో డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.7-ఇంచ్ క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
అసలు ధర: రూ.56,999
డీల్ ధర: రూ.54,999
Apple iPhone 14
ఈ డిస్కౌంట్ సేల్ సందర్భంగా iPhone 14 ని కూడా తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. iPhone 14 లో ఏ15 బయోనిక్ చిప్, 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 12ఎంపి ప్రైమరీ + 12ఎంపి అల్ట్రావైడ్ రియర్ కెమెరాలు, 12ఎంపి ఫ్రంట్ కెమెరా, 5జీ కనెక్టివిటీ, ఐపీ68 వాటర్ రెసిస్టంట్, గ్లాస్ బ్యాక్ ఉన్నాయి. 6 కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.
అసలు ధర: రూ.79,900
డీల్ ధర: రూ.67,499
Samsung Galaxy S20 FE 5G
మీరు గనుక ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Samsung Galaxy S20 FE 5G డివైజ్ ఒకటుంది. సేల్ లో ఈ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy S20 FE 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 1టిబి ఎక్స్‌పాండబుల్ మెమొరీ (మైక్రోఎస్డీకార్డ్ ద్వారా), 12ఎంపి ప్రైమరీ + 8ఎంపి టెలీఫోటో + 12ఎంపి అల్ట్రావైడ్ రియర్ కెమెరాలు, 30ఎక్స్ స్పేస్ జూమ్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.
అసలు ధర: రూ.26,999
డీల్ ధర: రూ.24,999
ఆడియో ఉత్పత్తులపై డీల్స్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఆడియో ప్రొడక్ట్స్ పై మంచి డీల్స్ ఉన్నాయి. OnePlus Bullets Z1 నెక్ బ్యాండ్ ని సేల్ లో రూ.1,599 కే కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy Buds 2 Pro ని డిస్కౌంట్ పై రూ.10,990 కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా OPPO Enco Air 3 Pro వైర్లెస్ ఇయర్‌బడ్స్ ని రూ.4,999 కే కొనుగోలు చేయవచ్చు. pTron Bassbuds Duo ని కేవలం రూ.499 కే కొనుగోలు చేయవచ్చు.