సంపాదకీయ విధానం

91mobiles Telugu ఎడిటోరియల్ టీమ్‌లోని సభ్యులందరూ ఈ క్రింది సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు:

91mobiles Telugu ప్రచురించబడిన మొత్తం సంపాదకీయ కంటెంట్ వ్యక్తిగత పక్షపాతాలు లేనిది మరియు సంస్థ యొక్క వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రభావితం కాదు.

వెబ్‌సైట్‌లోని ఏ ఒక్క డివైజ్ సమీక్ష కూడా డబ్బు చెల్లించబడి చేస్తున్నది కాదు లేదా ప్రాయోజిత కవరేజీలో భాగం కాదు.

91mobiles Telugu వ్యాపారంలో గణనీయమైన భాగం అనుబంధ మరియు ప్రాయోజిత కంటెంట్ నుండి వస్తుంది. అటువంటి కంటెంట్ మేము ప్రచురించే కథనాలను ప్రభావితం చేయదు (లేదా వ్యతిరేకంగా కూడా ప్రచురించబడదు).

మా పబ్లికేషన్‌లోని అన్ని రకాల పెయిడ్ కంటెంట్, బ్రాండ్ స్టోరీ ట్యాగ్‌ను కలిగి ఉంటుంది.

సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందాలు మా పబ్లికేషన్ పై వచ్చే బ్యానర్ అడ్వర్టైజ్మెంట్స్ లో భాగమవుతాయి. అయితే వారికి మేం ప్రచురించే కవరేజీపై ఎటువంటి నియంత్రణ ఉండదు.

మా బృందం, కొన్నిసార్లు, ప్రయాణ మరియు వసతి కోసం నిర్వాహకులు చెల్లించే ఈవెంట్‌లకు హాజరు కావచ్చు. అటువంటి ఈవెంట్ లకు సంబంధించిన కథనాలు విచక్షణని కలిగి ఉంటాయి. అలాగే అటువంటి కథనాలు నిర్వాహకులచే ప్రభావితం కావు.

91mobiles Telugu ఎడిటోరియల్ టీమ్, కొన్ని సమయాల్లో, సేల్స్ టీమ్‌తో వాణిజ్యపరమైన ఒప్పందాలను కలిగి ఉన్న కంపెనీల ద్వారా చెల్లించబడే ఈవెంట్‌లు మరియు సమావేశాలకు హాజరు కావచ్చు. మా ఎడిటోరియల్ కవరేజీ అటువంటి ఒప్పందాల వల్లన ప్రభావితం కాబోదు.

మా కథనాలలోని కొన్నింట్లో ప్రొడక్ట్ లింక్స్ ద్వారా మాకు అఫీలియేట్ కమిషన్స్ అందుతాయి. అంత మాత్రాన సదరు వాణిజ్యపరమైన అమరిక మా యొక్క కథనాన్ని ప్రభావితం చేయబోదు.