Home Exclusive Indian Gadget Awards 2023: కేటగిరీలు మరియు నామినీలు

Indian Gadget Awards 2023: కేటగిరీలు మరియు నామినీలు

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మీరెంతగానో ఆదరిస్తోన్న IGA 2023 (ఇండియన్ గ్యాడ్జెట్ అవార్డ్స్ 2023) మీ ముందుకు వచ్చేసింది. విభిన్న కేటగిరీల్లో అన్ని కంపెనీలకు చెందిన ఫోన్లు పోటీపడుతున్నాయి. అయితే ఎన్ని పోటీపడినా చివరకు గెలిచేది ఒక్కరే. జనాలతో ఆమోద ముద్ర వేయించుకున్న ఆ ఒక్క ఫోనే విజేతగా నిలుస్తుంది. https://www.indiangadgetawards.com/

అయితే విభాగాలు ఒకటో రెండో కాదు కదా. ఎన్నో విభాగాలు మరెన్నో మొబైల్ ఫోన్లు. గెలుపు కోసం జరిగే పోరులో హోరాహోరీ తలపడి అగ్రస్థానం కోసం తలపడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ గ్యాడ్జెట్ 2023 పురస్కారం కోసం అన్ని మొబైల్ ఫోన్ కంపెనీలు తమ నామినీస్ ని ఇప్పటికే పంపించడం జరిగింది. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచి ఏయే ఫోన్లు ఇండియన్ గ్యాడ్జెట్ అవార్డ్స్ 2023 ని సొంతం చేసుకుంటాయో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. మరి నామినీలుగా నిలిచిన ఫోన్లేవో తెలుసుకుందామా? అయితే పదండి.

ఇక్కడ క్లిక్ చేసి యూజర్స్ ఛాయిస్ అవార్డ్ ఓటుని వేయండి.

ఉత్తమ ఫోన్ 2023 (రూ.15,000 లోపు)

భారతదేశంలో 5G ప్రారంభించి 2 సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు విడుదలైన మొబైల్స్ చాలా వరకు 5G మొబైల్స్ అనే చెప్పాలి. అంతే కాకుండా తక్కువ ధరకే లభిస్తున్నాయి. మిడ్‌రేంజ్ మొబైల్‌లకు సవాలు విసిరే ఫీచర్లతో ఇవి బయటకు వస్తున్నాయి. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లోని 3 ఫోన్‌లు మినహా అన్నీ 5G ఫోన్‌లు. వాటిలో బెస్ట్ బడ్జెట్ ఫోన్‌ని ఎంచుకోబోతున్నాం. వాటిపై ఓ లుక్ వేయండి మరి.

ఉత్తమ ఫోన్ 2023 (రూ.25,000 లోపు)

రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య ఉండే మొబైల్స్ ఈ రోజుల్లో చాలా మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే, ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, దాదాపు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో కనిపించే చాలా ఫీచర్లను ఈ ధరల శ్రేణి మొబైల్‌లలో మీరు ఆశించవచ్చు. ఒక కంపెనీ ఈ ధరల శ్రేణిలో కస్టమర్‌ను సంతృప్తిపరిచినట్లయితే, అది సంవత్సరంలో నంబర్ వన్ కంపెనీ అవుతుంది. కాబట్టి ఈ వర్గానికి పోటీ గట్టిగానే ఉంటుంది. మరి ఈ విభాగంలో పోటీ పడుతోన్న ఫోన్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ఉత్తమ ఫోన్ 2023 (రూ. 35,000 లోపు)

ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే వారి కోసమే ఈ విభాగం ఉంది. ఇవి రూ.25,000 నుండి రూ.35,000 ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. మంచి చిప్‌సెట్, ఎక్కువ ర్యామ్, మెరుగైన డిస్‌ప్లే, నాణ్యమైన కెమెరాలు మొదలైన అనేక ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. గొప్ప ఫీచర్లను కలిగి ఉండటం వల్ల వాటిని మల్టీ టాస్కింగ్, హెవీ గేమ్‌లను హ్యాండిల్ చేయడం మొదలైన వాటికి ఈ ఫోన్లు సరిపోతాయి. ఈ కేటగిరీలో పోటీ పడుతోన్న ఫోన్లు ఏవో తెలుసుకోండి.

ఉత్తమ ఫోన్ 2023 (రూ. 50,000 లోపు)

‘ఫ్లాగ్‌షిప్’ అనే మారుపేరుతో, కొత్త టెక్నాలజీ, అధునాతన భాగాలు, గరిష్ట నాణ్యతతో సహా అన్నింటిలో ఈ మొబైల్‌లు అత్యుత్తమమైనవి. ఈ ధరల శ్రేణిలో ప్రతి కంపెనీ వారి అత్యుత్తమ ఫోన్‌ను తయారు చేస్తుంది. మొబైల్ ప్రపంచంలో కొత్త ఫీచర్ ప్రవేశపెడితే, అది ఈ ధరల శ్రేణి మొబైల్‌లలో మొదట విడుదల అవుతుంది. మరి ఈ విభాగంలో పోటీపడుతోన్న ఫోన్లు ఏవో తెలుసుకోండి.

ఉత్తమ సెల్ఫీ ఫోన్ 2023 – మెయిన్ స్ట్రీమ్ (రూ.35,000 లోపు)

సెల్ఫీల కోసం ఎక్కువగా ఉపయోగించే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇప్పుడు వర్క్ మరియు ఆన్‌లైన్ విద్య కోసం అవసరంగా మారింది. కాబట్టి ఇప్పుడు మొబైల్ తయారీ కంపెనీలు మరిన్ని మెగాపిక్సెల్స్ మరియు మరిన్ని ఫీచర్లతో నాణ్యమైన ఫ్రంట్ కెమెరాను ఉత్పత్తి చేసి విడుదల చేస్తున్నాయి. కాబట్టి 2023లో ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న ఈ మొబైల్‌లలో బెస్ట్ సెల్ఫీ ఫోన్ ఏది అనేది చూద్దాం.

ఉత్తమ కెమెరా ఫోన్ 2023 – మెయిన్ స్ట్రీమ్ (రూ. 35,000 లోపు)

మొబైల్ ఫోన్‌లో ఫీచర్‌గా ఉండే ‘కెమెరా’ ఇప్పుడు చాలా రకాలుగా అభివృద్ధి చెందింది. బడ్జెట్ ఫోన్లు కూడా 50MP కెమెరాలతో వస్తున్నాయి. ఇది మంచి ‘డెప్త్’తో ఫోటోలను క్యాప్చర్ చేయడానికి అదనపు సెన్సార్లు మరియు సాఫ్ట్‌వేర్‌తో కూడా వస్తుంది. ప్రజల మనసులను ఆకర్షించిన ఉత్తమ కెమెరా ఫోన్‌ను మేము ఎంచుకోబోతున్నాము. మరి ఈ విభాగంలో పోటీ పడుతోన్న ఫోన్లేవో తెలుసుకోండి.

ఉత్తమ కెమెరా ఫోన్ 2023 – ప్రీమియం (ధర ముఖ్యం)

ప్రొఫెషనల్ కెమెరాల్లో ఉండే ఫీచర్లు ఇప్పుడు మొబైల్ ఫోన్లకు కూడా వస్తున్నాయి. షేకింగ్ లేకుండా చిత్రాలను తీయడానికి OIS సదుపాయం, పెద్ద చిత్రాలను తీయడానికి 200MP వరకు సెన్సార్లు, తక్కువ వెలుతురులో కూడా మంచి చిత్రాలను తీయడానికి 1-ఇంచ్ పెద్ద సెన్సార్, వివిధ ఫోకల్ లెంగ్త్‌లతో కూడిన వివిధ సెన్సార్లు వంటి అనేక ఫీచర్లతో ప్రస్తుత కెమెరా ఫోన్‌లు వస్తున్నాయి. ఉత్తమ ప్రీమియం కెమెరా ఫోన్ గా ఏది నిలవనుందో చూడాలి.

ఉత్తమ గేమింగ్ ఫోన్ 2023 – మెయిన్ స్ట్రీమ్ (రూ.35,000 లోపు)

అన్ని ఫోన్‌లు గేమ్‌లను సపోర్ట్ చేయగలిగినప్పటికీ, పెద్ద-స్థాయి గేమ్‌లు సజావుగా మరియు సులభంగా ఆడేందుకు ప్రత్యేకమైన మొబైల్‌లు అవసరం. కానీ గేమింగ్ కోసం డెడికేటెడ్ ఫోన్‌ని కొనకూడదనుకునే మరియు గేమింగ్‌పై ఆసక్తి ఉన్నవారు కొందరున్నారు. ఇది అటువంటి వారికి సంబంధించిన విభాగమే.

సాధారణ మొబైల్ వినియోగం, గేమింగ్, అదనపు ర్యామ్, మంచి చిప్‌సెట్ మొదలైన వాటికి అవసరమైన కొన్ని ఫీచర్లతో విడుదలైన మొబైల్‌లు ఇందులో ఉన్నాయి. ఆ జాబితాపై ఓ కన్నేయండి మరి.

ఉత్తమ గేమింగ్ ఫోన్ 2023 – ప్రీమియం (ధరతో సంబంధం లేదు)

మొబైల్‌లో పెద్ద పెద్ద గేమ్‌లు ఆడే వారికి డెడికేటెడ్ గేమింగ్ మొబైల్స్ కూడా రావడం మొదలైంది. వీటిలో ఎక్కువ ర్యామ్, మెరుగైన ప్రాసెసర్, కూలింగ్ సౌకర్యం మొదలైనవి ఉంటున్నాయి. ఇవన్ని ఫీచర్లు కలిసి మీకు మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది కాకుండా, బెస్ట్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్, పెద్ద బ్యాటరీ, సరౌండ్ ఆడియో మొదలైన బెస్ట్ ఫీచర్లతో వచ్చే బెస్ట్ గేమింగ్ ఫోన్ ఏది అనేది మనం తెలుసుకుందాం.

బెస్ట్ ఫోల్డ్/ఫ్లిప్ ఫోన్ 2023

ఇది గతేడాది లేని కొత్త విభాగం. ప్రతి కొన్ని సంవత్సరాలకు మొబైల్‌లో కొన్ని విషయాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఫ్లిప్ అండ్ ఫోల్డ్ ఫోన్‌లు ప్రజలలో ప్రాచుర్యం పొందుతున్న కొత్త వర్గం. మడతపెట్టే మొబైల్ ఫోన్లు రెండు రకాలు. ఫ్లిప్ ఫోన్‌లు సగానికి మడతబెట్టేందుకు అనువుగా ఉంటాయి. అదే ఫోల్డ్ ఫోన్లు అయితే మధ్యలో పుస్తకం మాదిరి మడిచే విధంగా ఉంటాయి. ఏదేమైనా ఈ తరహా ఫోన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వారి కోసం మొబైల్ ఫోన్ కంపెనీలు ఆసక్తికరమైన లుక్, ఫీచర్లతో డివైజెస్ ని తీసుకొస్తున్నాయి. సరే, ఈ విభాగంలో పోటీ పడుతోన్న ఫోన్ల వివరాలు తెలుసుకోండి.

2023 లో అత్యుత్తమ ఫోన్

మొబైల్‌ను దాని ధర, ఫీచర్లు, కెమెరా సామర్థ్యం, ​​ఉత్తమ ఫీచర్లు, నిరంతర నవీకరణలు, యూజర్ ఫ్రెండ్లీనెస్ వంటి వాటిని బట్టి ఉత్తమమా? కాదా? అనేది నిర్ణయిస్తారు. కానీ అందరికి ఒక మొబైల్ మాత్రమే అవసరం కదా. కాబట్టి మేము అన్ని.. లేదా పైన పేర్కొన్న చాలా ఫీచర్లు ఉన్న ఫోన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి.