108 MP Camera - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 20 Jul 2023 14:16:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు https://www.91mobiles.com/telugu/108mp-camera-phones-under-rs-20-thousand-rupees-budget/ Thu, 20 Jul 2023 14:16:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7264 ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనైనా ఫోన్లలోనే అయిపోతోంది. మరీ ముఖ్యంగా కెమెరా అవసరాలను స్మార్ట్ ఫోన్లు బాగా తీరుస్తున్నాయి. ప్రత్యేకంగా కెమెరా కొనాల్సిన అవసరం లేకుండా ఫోన్లలో ఉండే కెమెరాలు రకరకాల ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్నాయి. వైడ్ యాంగిల్, మ్యాక్రో, పొట్రెయిట్, డెప్త్, పెరిస్కోప్, టెలీఫోటో ఇలా అన్ని రకాల కెమెరా సెన్సర్స్ ఫోన్లలో అమరిపోతున్నాయి. మంచి కెమెరా ఉన్న ఫోన్ చేతిలో ఉంటే అలా క్లిక్ అనిపిస్తూ ముందుకెళ్తారు యూజర్లు. కెమెరా […]

The post రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>

ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనైనా ఫోన్లలోనే అయిపోతోంది. మరీ ముఖ్యంగా కెమెరా అవసరాలను స్మార్ట్ ఫోన్లు బాగా తీరుస్తున్నాయి. ప్రత్యేకంగా కెమెరా కొనాల్సిన అవసరం లేకుండా ఫోన్లలో ఉండే కెమెరాలు రకరకాల ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్నాయి. వైడ్ యాంగిల్, మ్యాక్రో, పొట్రెయిట్, డెప్త్, పెరిస్కోప్, టెలీఫోటో ఇలా అన్ని రకాల కెమెరా సెన్సర్స్ ఫోన్లలో అమరిపోతున్నాయి.

మంచి కెమెరా ఉన్న ఫోన్ చేతిలో ఉంటే అలా క్లిక్ అనిపిస్తూ ముందుకెళ్తారు యూజర్లు. కెమెరా నాణ్యమైన ఫోటోలను వీడియోలను తీయడం ఎంతో అవసరం. ఫోన్ కొనేటప్పుడు అందులో ఉన్న కెమెరా సామర్థ్యాన్ని ముందుగా తెలుసుకుంటే మంచిది. సరే, ఈ ఆర్టికల్ లో మనం రూ.20,000 లోపు ధరలో లభించే 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ల జాబితాను చూద్దాం.

రూ.20,000 ధరలోపు అందుబాటులో ఉన్న 108ఎంపి కెమెరా ఫోన్లు

1. Redmi Note 11S

2. Infinix Note 12 Pro 5G

3. Realme 10 Pro 5G

4. Motorola G72

5. Infinix Zero 20

6. OnePlus Nord CE 3 Lite 5G

7. Realme 9 4G

Redmi Note 11S

Redmi Note 11S స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి ఏఐ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.43-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉన్నాయి. అమెజాన్ లో ఈ ఫోన్ ధర రూ.12,999 గా ఉంది.

Infinix Note 12 Pro 5G

Infinix Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,999 కి లభిస్తోంది. ఈ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 2టిబి వరకు ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి.

Realme 10 Pro 5G

Realme 10 Pro 5G డివైజ్ రూ.19,999 ధరకి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.

Motorola G72

Motorola G72 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.16,999 గా ఉంది.

Infinix Zero 20

Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,999 కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరా, 60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉన్నాయి.

OnePlus Nord CE 3 Lite 5G

OnePlus Nord CE 3 Lite 5G లో 108ఎంపి + 2ఎంపి +2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ధర అమెజాన్ లో రూ.19,999 గా ఉంది.

Realme 9

Realme 9 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 680 చిప్, 6జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.4-ఇంచ్ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.17,999 గా ఉంది.

The post రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Infinix Note 12 5G, Infinix Note 12 Pro https://www.91mobiles.com/telugu/infinix-note-12-5g-infinix-note-12-pro-5g-108mp-camera-dimensity810-chipset-india-launch/ Fri, 08 Jul 2022 13:00:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=850 హైలైట్స్: రూ.14,999 ప్రారంభ ధరతో ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్ భారత్ గడ్డపై లాంచ్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, అమోలెడ్ ప్యానెల్, 5,000mAh బ్యాటరీ జులై 15 నుంచి ఫ్లిప్ కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా సేల్ కి రానున్న ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్ Infinix Note 12 5G సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇవే కంపెనీ నుంచి తొలి 5జీ స్మార్ట్ […]

The post భారత్ లో లాంచ్ అయిన Infinix Note 12 5G, Infinix Note 12 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.14,999 ప్రారంభ ధరతో ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్ భారత్ గడ్డపై లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, అమోలెడ్ ప్యానెల్, 5,000mAh బ్యాటరీ
  • జులై 15 నుంచి ఫ్లిప్ కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా సేల్ కి రానున్న ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్

Infinix Note 12 5G సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇవే కంపెనీ నుంచి తొలి 5జీ స్మార్ట్ ఫోన్స్ కావడం విశేషం. వెనీలా ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ ఈ సిరీస్ లో ఉన్నాయి. కొనాలనుకునేవారు, ఫ్లిప్ కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా జులై 15 నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ ఇంకేం ఆఫర్ చేస్తుందో ఇక్కడ చూద్దాం.

భారత్ లో Infinix Note 12 5G ధర

ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్ ఫోర్స్ బ్లాక్ మరియు స్నోఫాల్ వైట్ అనే రెండు రంగుల్లో లభ్యమవ్వనుంది. ఇక బేస్ వేరియంట్ ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ రూ.14,999 కి అమ్ముడవ్వనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ రూ.17,999 వద్ద సేల్ అవ్వనుంది. ఫ్లిప్ కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్ జులై 15 నుంచి కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద రూ.1500 డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ ని కొంటే కనుక ఈ డిస్కౌంట్ లభించనుంది.

Infinix Note 12 5G స్పెసిఫికేషన్స్

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, వంద శాతం డీసీఐ పీ3 కలర్ గేముత్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 512జిబి ఎక్స్ ప్యాండబుల్ మెమొరీ, 6జిబి ర్యామ్, 3జిబి ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్, ర్యామ్ ఎక్స్ ప్యాన్షన్ ఫీచర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

కెమెరా విభాగానికి వస్తే, ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. ఇకపోతే సెల్ఫీల కోసం ముందు వైపు 16ఎంపి షూటర్ ఉంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ – 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 స్కిన్ పై పని చేయనుంది.

Infinix Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 100 శాతం డీసీఐ పీ3 కలర్ గేముత్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, 5,000mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 128జిబి స్టోరేజీ, 512జిబి ఎక్స్ ప్యాండబుల్ మెమొరీ, 8జిబి ర్యామ్, 5జిబి ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్, ర్యామ్ ఎక్స్ ప్యాన్షన్ ఫీచర్ వంటి ఫీచర్లు ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ ఫోన్లో ఉన్నాయి.

ఇక కెమెరా విభాగానికి వస్తే, ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ ఫోన్లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ మరియు ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16ఎంపి కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 స్కిన్ పై పనిచేస్తుంది.

The post భారత్ లో లాంచ్ అయిన Infinix Note 12 5G, Infinix Note 12 Pro first appeared on 91Mobiles Telugu.

]]>